మహావిద్యాపీఠం దుండిగల్.

శ్రీవిద్యపరమేశ్వరి దేవస్థానం యందు జురుగు నిత్య పూజ వివరములు

పూజ వివరములు
ఫలప్రాప్తి
నిత్యం
నెలవారి
వార్షికము
పూజ వివరములుశ్రీ అనుజ్ఞ గణపతికి సంకష్ట చతుర్థి రోజున అభిషేకం అర్చన ప్రదోషం
ఫలప్రాప్తిసంకటనివారణ, విజయ ప్రాప్తి
నిత్యం
నెలవారిRs 1,116
వార్షికముRs 5,116
పూజ వివరములురుద్రాభిషేకము అమ్మవారికి కుంకుమార్చన
ఫలప్రాప్తిసర్వపాప విముక్తి, సర్వాభీష్ట సిద్ధి
నిత్యంRs 51
నెలవారి
వార్షికముRs 1,116
పూజ వివరములుశ్రీ సీతా రాములవారికి అభిషేకం అర్చన రామతాకహోమం
ఫలప్రాప్తిఅన్యోన్య దాంపత్యప్రాప్తి
నిత్యంRs 116
నెలవారిRs 1516
వార్షికముRs 5,116
పూజ వివరములుప్రతి పౌర్ణమి చండీ హోమము
ఫలప్రాప్తిఐశ్వర్య ప్రాప్తి,సర్వ దోష నివారణ
నిత్యం
నెలవారిRs 1516
వార్షికముRs 5,116
పూజ వివరములుశ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పూజు
ఫలప్రాప్తిశీఘ్ర కల్యాణ ప్రాప్తి కుజదోష నివారణ
నిత్యం
నెలవారి
వార్షికముRs 5,116
పూజ వివరములుశ్రీ యోగాంజనేయస్వామివారికి తమలపాకులతో పూజ
ఫలప్రాప్తిదుస్వప్న దోష పరిహారం,కార్యసిద్ధి
నిత్యంRs 51
నెలవారిRs 558
వార్షికముRs 3,116
పూజ వివరములుప్రతి ఆదివారం రాహు కాలం లో శ్రీ శరభేశ్వర స్వామికి పూజ
ఫలప్రాప్తిశతృ భయ నివారణ,సర్వ కామనా సిద్ధి
నిత్యంRs 316
నెలవారిRs 1,116
వార్షికముRs 7,516
పూజ వివరములునవగ్రహపూజ
ఫలప్రాప్తినవగ్రహదోష పరిహారంధి
నిత్యంRs 116
నెలవారి
వార్షికముRs 11,116
పూజ వివరములుగౌరీపూజ
ఫలప్రాప్తిసౌమంగళ్య అభివృద్ధి
నిత్యంRs 51
నెలవారిRs 15,16
వార్షికము
పూజ వివరములుశ్రీ మేధా దక్షిణామూర్తి పూజ
ఫలప్రాప్తివిద్యా ప్రాప్తికి, జ్ఞాపకశక్తికి
నిత్యంRs 1,116
నెలవారి
వార్షికము
పూజ వివరములుకృత్తిక నక్షత్రం రోజున శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం,అర్చన,హోమం
ఫలప్రాప్తిఆరోగ్యప్రాప్తి, రోగనివారణ
నిత్యంRs 1,116
నెలవారి
వార్షికముRs 5,116
పూజ వివరములుమాసశివరాత్రి రుద్రాభిషేకం
ఫలప్రాప్తిఅరిష్ట నివారణ, ఇష్టప్రాప్తి
నిత్యంRs 1,116
నెలవారి
వార్షికముRs 5,116
పూజ వివరములుఅనూరాధ నక్షత్రం రోజున శ్రీ పరమాచార్య స్వామివారికి అభిషేకం,అర్చన,వేదపారాయణం
ఫలప్రాప్తిసకల శ్రేయః ప్రాప్తి
నిత్యంRs 116
నెలవారిRs 1,116
వార్షికముRs 5,116
పూజ వివరములుచండీ పారాయణం
ఫలప్రాప్తివ్యాపారాభివృద్ధి, ప్రతి బంధక నివృత్తి
నిత్యంRs 116
నెలవారిRs 1,516
వార్షికముRs 11,116
పూజ వివరములుఅన్నదానం
ఫలప్రాప్తిపితృ దేవత ప్రీతి
నిత్యంRs 1,116
నెలవారి
వార్షికముRs 11,116
పూజ వివరములుమాహానైవేద్యం
ఫలప్రాప్తిదేవీ ప్రీతి
నిత్యం1 kg 316 rs
నెలవారి
వార్షికము
పూజ వివరములుజన్మదినమున అన్నదానం,ఆయుష్య హోమంయం
ఫలప్రాప్తిఆయుర్వృద్ధి
నిత్యం
నెలవారి
వార్షికముRs 5,116
పూజ వివరములుశ్రీ సంతాన నాగేంద్రస్వామివారికి పూజ
ఫలప్రాప్తిసత్ సంతాన ప్రాప్తి, సర్ప దోష నివారణ
నిత్యంRs 51
నెలవారి
వార్షికముRs 5,116
పూజ వివరములుగో పూజ, గోగ్రాసం
ఫలప్రాప్తిసకల దేవతా ప్రీతి
నిత్యంRs 116
నెలవారి
వార్షికము

యత్ర యత్ర వేద పారాయణం: కన్నీరు పెట్టుకున్న కంచి స్వామి (పెరియవ ) ....మహాస్వామి వారు మధ్యాహ్నపు పూజ ముగించుకుని తీర్ధ ప్రసాదాలు ఇచ్చే సమయంలో కుంభకోణం సమీపంలోవున్న తిరువిడైమరుదూరు(మధ్యార్జునం) మహాలింగస్వామికి చైత్రపౌర్ణమినాడు 11 మంది ఘనాపాఠీలతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించి ప్రసాదం స్వామి వారికి సమర్పించాలని ఉత్సుకతతో ఒక సంపన్నుడైన మిరాశీదారు(భూస్వామి) ఒకరు వరుసలో వేచివున్నారు. మహాలింగ స్వామి ప్రసాదాన్ని కొత్త పట్టుగుడ్డలో చుట్టి తీసుకొనివచ్చాడాయన. ఆరోజు భక్తజన సమ్మర్ధం ఎక్కువగావుంది. మిరాశీదారు వంతు వచ్చింది. మహాస్వామివారియందు అమితమైన భక్తితాత్పర్యములు కలవాడాయన. స్వామివారిని చూస్తూనే భక్తితో వణికిపోతూ సాష్టాంగ నమస్కారంచేశాడు. స్వామివారు కనుబొమలెత్తి వారిని చూసి "ఏమి సమాచారం?" అన్నారు. ఆయన తడబడుతూ ప్రసాదాలను విప్పి వెదురు బుట్టలో విభూతి, చందనము, కుంకుమ, బిల్వపత్రములు, కొబ్బరిచెక్కలు విడివిడిగా వుంచి స్వామి వారికి సమర్పించాడు. ప్రసాదమనగానే ముందుకు వంగి గ్రహించే స్వామి "ఏ క్షేత్రానిది ఈ ప్రసాదం?" అని ప్రశ్నించారు. "స్వామీ! తిరువిడైమరుదూరు మహాలింగ స్వామికి నిన్న రుద్రాభిషేకం చేయించాను, స్వామివారి అనుగ్రహం కోసం ప్రసాదం సమర్పిస్తున్నాను" అన్నాడు మిరాశీదారు….స్వామివారు ప్రసాదాలున్న తట్టవైపు పరీక్షగాచూసి "నీవే ఎంతో స్థితి పరుడవు కదా! రుద్రాభిషేకానికి చందాలుకూడా పోగు చేశావా?" అన్నారు. "లేదుస్వామి! మొత్తంఖర్చు నేనే భరించాను", అన్నాడు నేనే అన్న పదాన్ని వత్తుతూ. “రుద్రాభిషేకం లోకక్షేమంకోసం జరిపించావా?” అన్నారు స్వామివారు. "రెండు మూడుసంవత్సరాలుగా పంటలు సరిగా పండటంలేదు, జ్యోతిష్కులు చైత్ర పౌర్ణమి నాడు అభిషేకం జరిపిస్తే ఫలసాయం ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పారు." అందుకు చేయించాను అన్నాడు మిరాశీదారు. "అయితే నువ్వు ఆత్మార్ధంగానో, లోకక్షేమార్ధమో కాక ఒక కామ్యాన్ని ఆశించి చేశావన్న మాట", అంటూ ప్రసాదాన్ని గ్రహించకుండానే కనులు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళారు స్వామివారు. ….కొన్ని నిమిషాల తరువాత కనులు తెరిచిన వారిని చూస్తే, జరిగిందేమిటో అవగతమైనట్లు తెలుస్తుంది. "సరే, ఎంతమంది వేదపండితులు వచ్చారు?" అన్నారు స్వామి. మిరాశీదారు "11 మంది" అన్నాడు. "నీవే నిర్వహించావుకదా! వారెవరు? ఏగ్రామానికి చెందినవారు?" అన్నారు స్వామి. అక్కడున్న భక్తులకు స్వామివారు ఎందుకలా తరచి తరచి ప్రశ్నలు వేస్తున్నారో అర్ధం కాలేదు. మిరాశిదారు కాగితం చూచి పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు. "ఓహో! అందరూ మహా పండితులు. నీ జాబితాలో తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనాపాఠి గారు వున్నారేమో చూడు". అన్నారు. మిరాశీదారుకు సంతోషంవేసింది. స్వామివారు చెప్పిన ఘనపాఠి గారుకూడా రుద్ర జపంలో పాల్గొన్నారు. "భేష్! భేష్! వేంకటేశ ఘనాపాఠి గారు కూడా వున్నారన్నమాట మంచిది. ఆయన చాలా పెద్ద విద్వాంసులు. మంచి వేద పండితులు. పెద్దవారయి పోయారు. రుద్ర జపం ఎంతో కష్టంమీద చేసి వుంటారు." స్వామివారి ఈ మాటలతో బలంపుంజుకున్న మిరాశీదారు "మీరు సరిగ్గా చెప్పారు స్వామీ! ఎక్కువ భాగం ఆయన పారాయణ చెయ్యకుండా కనులు మూసుకుని కూచుంటారు. దాని మూలంగా సంఖ్య తగ్గిపోతోంది. ఎందుకు పిలిచానా అనుకున్నాను" అన్నాడు. స్వామివారి కనులలో ఉవ్వెత్తున తీవ్రత కనిపించింది. "మనదగ్గర ఏదో కొంచెం డబ్బు ఉంది కదా అని ఎలాగయినా మాట్లాడవచ్చు అనుకోకూడదు. నీకు తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారి అర్హతలేమిటో తెలుసా? అతని చరణ ధూళికి సరితూగవు నీవు. ఆయనను అలా ఎలా అనగలిగావు నీవు. నిన్న ఏమి జరిగిందో నాకు ఇప్పుడు అర్ధమయింది. ఆయనలా కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు నీవు దగ్గరకు వెళ్ళి, “తీసుకున్న డబ్బుకు గట్టిగా వళ్ళు దాచుకోకుండా పారాయణం చెయ్యకుండా నోరు మూసుకుని కూరుచుంటే ఎలా?” అని అన్నావా లేదా చెప్పు" అన్నారు తీక్షణంగా! ప్రదేశమంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దంగా అయిపోయింది…భక్తులందరూ నిశ్చేష్టులయి పోయారు. క్షణంవరకు సాధారణంగా మాట్లాడుతున్న మిరాశీదారు గడగడ వణికి కాళ్ళబలం చాలక మోకాళ్ళమీద ముందుకు పడి బలవంతంగా లేచి నుంచున్నాడు. కన్నులనుండి నీరు జలజల స్రవిస్తుండగా నోటీమీద చేయి అడ్డు పెట్టుకుని, "నాది తప్పే! స్వామీ!దయచేసి క్షమించండి. ఘనపాఠి గారితో సరిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన మాట్లే అన్నాను. క్షమించండి స్వామీ! క్షమించండి" అంటూ ప్రాధేయపడ్డాడు…."ఆగు! అంతటితో ఆపలేదు. ఇంకాఉంది. నువ్వు పండితులందరికి దక్షిణఇచ్చావా? ఎంత ఇచ్చావు?" అన్నారు. "ఒక్కక్కరికీ 10 రూపాయలు ఇచ్చాను""నాకంతా తెలుసు. మళ్ళీ చెప్పు. అందరికీ 10 రూపాయల చొప్పున ఇచ్చావా?" రెట్టించారు స్వామివారు. మిరాశీదారు మౌనంగాఉన్నాడు. స్వామి వదిలేటట్లు లేరు. "చెప్పడానికే సిగ్గువేస్తుందికదూ! నే చెబుతాను ఏమి జరిగిందో! మిగతా పండితులందరికీ నీవు 10 రూపాయలు చొప్పున ఇచ్చావు. వేంకటేశఘనపాఠి గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన సరిగా జపం చేయలేదని 7 రూపాయలకు తగ్గించావు. చేసిన దానికి తగినంత ఇచ్చానని నిన్ను నువ్వు మెచ్చుకుని ఆయనను కించ పరచినందుకు సంతోషించావు. ఆయన ఈషణ్మాత్రం ఈ విషయాన్ని సరుకు చెయ్యలేదు. నిన్ను చూచి ఒక చిరునవ్వు నవ్వి ఇచ్చినది తీసుకున్నారు. చెప్పు ఇది నిజమేనా?" అన్నారు. ఈ విషయమంతా స్వామి వారికి ఎలా తెలుసని భక్తులు ఆశ్చర్య పోయారు…[ఒక ఉపన్యాసంలో రాజగోపాల ఘనపాఠి అనే మహా పండితులు చెప్పారు. రామనామం జరిగేచోటల్లా హనుమంతుడున్నట్లు, వేద పారాయణంజరిగే చోటంతా మహాస్వామి వారు ఉంటారట. వారి …గురువుగారు ఎక్కడైనా పారయణాలలో శిష్యులు బాల చేష్టలు చేస్తుంటే "జాగ్రత్త! సరిగ్గాపారాయణ చెయ్యి. మహాస్వామి వారున్నారు".అనేవారట. మరుసటిరోజు వీరు పెద్ద స్వాములవారిని దర్శనంచేస్తే జరిగినదంతా సినిమాలో చూచినట్లు చెప్పేవారట మహాస్వామి.మిరాశీదారు నిర్ఘాంతపోయాడు. నోట మాటరాలేదు. తేరుకొని తాను తప్పు చేశానని, మరల ఇటువంటితప్పిదం చేయనని మరల మరల వేడుకుంటున్నాడు. కన్నీరుమున్నీరుగా అవుతున్నాడు.స్వామివారు అక్కడితో ఆపలేదు. మరి వారి మనసు ఎంత క్షోభపడిందో? "ఆగు అక్కడితో ఆగితే బాగానే ఉండేది. ఆరోజు బ్రాహ్మణులందరికి రామచంద్ర అయ్యర్ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశావుకదూ! అందరికి నీవే స్వయంగా వడ్డించావు. చక్రపొంగలి అమృతంలా ఉన్నది. మంచి నెయ్యి ఓడుతూ ఉంది. ఆనేతిలో ఎన్నో జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు తేలుతున్నాయి. ఆ చక్రపొంగలి నీవే స్వయంగా వడ్డించావు కదూ!" అన్నారు స్వామివారు…తానుచేసిన ఒక మంచిపని శ్రీవారు గుర్తించినట్లుగా మిరాశీదారు, "అవును స్వామీ! నేనే స్వయంగా వడ్డించాను". అన్నాడు."వడ్డించే టప్పుడు పంక్తి మర్యాదను పాటించావా?" అని ప్రశ్నించారు స్వామి….మిరాశీదారునుంచి సమాధానం లేదు…"సరే నేను చెప్తాను. చక్రపొంగలి రుచిగా ఉండడంతో పండితులు మరలమరల మారువడ్డనకై అడిగారు. నీవుకూడా ఆనందంతో వడ్డించావు. కాని వేంకటేశఘనపాఠి మారు అడిగితే, ఒకసారి కాదు అనేకసార్లు, నీవు విననట్లే నటించావు. చాలాసార్లు అడిగారాయన. ఒక్కసారి కూడా నీవు స్పందించలేదు. ఇది పంక్తి మర్యాదా? ఇది ధర్మమా? ఎంత ఘోరంగా అవమానించావు". మహాస్వామివారి మాటలు బాధతో తొట్రుపడుతున్నాయి. ఎంతో విచారంగా కన్పిస్తున్నారు…మిరాశీదారు సిగ్గుతో చితికిపోతూ నిలుచున్నాడు…మహస్వామివారు దండం పట్టుకొని మాలధారి అయిన పరమేశ్వరిని వలె సర్దుకొని నిటారుగా కూర్చున్నారు. మళ్ళీ కొంతసేపు మౌనంగా ధ్యానముద్రలో కనులు మూసికొని ఉద్విగ్నతను అదుపు చేసుకుంటూ .కూర్చున్నారు…కనులుతెరచి సూటిగా చూస్తూ "మిరాశీదారుగారూ! ఒక విషయం అర్ధం చేసుకోండి. తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారికి 81 ఏళ్ళు. వారు తన పదహారేళ్ళ ప్రాయంనుండి అనేక శివాలయాలలో రుద్రజపం చేశారు. శ్రీరుద్రం వారి నరనరములలో, వారి నెత్తురులోనూ, వారి ఊపిరిలోనూ వ్యాపించింది. వారు మహాపురుషులు. వారి యెడ నీవు ప్రవర్తించిన తీరు పూర్తిగా పాపభూయిష్టం. పాపం తప్ప మరొకటికాదు." మహాస్వామి వారు ఇక మాటలాడలేక పోయారు. కొంచెంసేపు ఆగి మరలా కొనసాగించారు…."నీవు చేసిన అవమానం ఆయనను కలవరపరచింది. లోతుగా బాధించింది. నీకు తెలుసా? ఆ తరువాత ఆయన ఇంటికి పోలేదు. నిన్న సాయంత్రం ఆయన నేరుగా మహాలింగస్వామి గుడికిపోయారు. మూడు ప్రదక్షిణలు చేసి స్వామి ఎదురుగా నుంచొని ఏమి ప్రార్ధించారో తెలుసా?" మహాస్వామివారికి మాట్లాడటం కష్టమయిపోతుంది. కొంతసేపయినతరువాత కొనసాగించారు."కన్నీరు బుగ్గలమీదుగా జలజల కారుతుండగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి, స్వామికి చేతులెత్తి నమస్కరించి, "అయ్యా! జ్యోతి మహాలింగమా! నేను నీకెంత భక్తుడినో నీకు తెలుసు. నీ సన్నిధిలో నా చిన్నతనం నుండి నే చేసిన రుద్రజపములు నీవు అనేక పర్యాయములు అవధరించావు. ఇప్పుడు నావయసు 81. హృదయం చాలా గట్టిగానే ఉన్నది. కానీ వార్ధక్యం తగ్గిపోయింది. ఇవ్వాళ భోజన సమయంలో ఏమి జరిగిందో చూశవు కదా! ఆ చక్రపొంగలి ..... ఎంతో రుచిగావుంది. నా సిగ్గును ప్రక్కనుంచి, మరికొంచెం వడ్డించమని అర్ధిస్తున్నాను. ఒకసారికాదు....అనేకసార్లు. మిరాశీదారు విననట్లు నటించి వెళ్ళిపోయాడు. నీకు తెలుసు కదా? నాకు చక్రపొంగలి అంటే ఎంతో ఇష్టం. నేను అర్ధించినా అతడు వడ్డించక పోవడంవలన నేనెంతో బాధపడ్డాను. కానీ స్వామీ! తరువాత నాకీ విధమైన చాపల్యం - అదీ ఒక వంటకంపై ఉండరాదని గుర్తించాను. అందుకే ఇప్పుడు నీ ముందు నుంచున్నాను. కాశీ వెళితే ఇష్టమైన పండు, కూర వదిలిపెడతారని చెబుతారు. నీవు కాశీలో ఉండే మహాలింగానివే! అందుకే నీ ముందు వాగ్దానంచేస్తున్నాను. ఈ నిమిషం నుండి నా శరీరంలొ జీవం ఉండేదాకా చక్రపొంగలే కాదు ఏ మధుర పదార్ధమూ ముట్టుకోను. ఇది నా వాగ్దానము. స్వామీ! ఇక సెలవు." అంటూ కన్నీటితో ఆ ఘనపాఠి నిన్న రాత్రి తన గ్రామం చేరారు. ఇప్పుడు చెప్పండి అయ్యర్ గారూ! నీవు చేసినది మహాపాపం కాదా"? మహాలింగ స్వామి నీ చేష్టితాలను ఒప్పుకుంటారా?"..మహాస్వామివారు మౌనం వహించారు. మూడు గంటలయింది. పరిచారకులు భిక్షకై రావలసినదని ప్రార్ధిస్తున్నారు. ఎవరు ఆ ప్రదేశం వదలి కదలటంలేదు. ప్రతివారి కనులనిండా నీరు.మిరాశీదారు మహాస్వామి పాదముల ఎదుట ఆపుకోలేనంతగా విలపిస్తున్నాడు. మాటలు రావటంలేదు. అయినా ప్రయత్నంమీద "స్వామీ! నా ప్రవర్తనకు సిగ్గు పడుతున్నాను. నేను పెద్ద తప్పు చేశాను. క్షమించానని చెప్పండి. మళ్ళీ ఇటువంటి అపరాధం చేయను స్వామీ! క్షమించండి. మహాలింగస్వామి ప్రసాదంతీసుకోండి. నన్ను క్షమించండి." అంటున్నాడు. స్వామివారు ప్రసాదం ముట్టుకోలేదు…."కొంచెం ఆగు. నాకు మహాలింగస్వామియే అనుగ్రహంతో ప్రసాదం పంపుతాడు". న్నారు.అంతలో రుద్రాక్షలు ధరించిన 65ఏళ్ళ పండితుడు చేతిలో వెదురుతట్టలో ప్రసాదాలు పుచ్చుకొని వచ్చాడు. "స్వామీ! నా పేరు మహాలింగం. నేను తిరువిడైమరుదూరు అర్చకుడను. నిన్న మహాలింగస్వామికి రుద్రాభిషేకం జరిగింది. ఆ ప్రసాదాలు పరమాచార్య స్వామి వారికి సమర్పించి ఆశీస్సులు తీసుకొని వెళదామని వచ్చాను". అన్నారు. ఆయన నమస్కరించబోతుండగా స్వామివారు "శివదీక్ష పుచ్చుకొన్న వారు ఇతరులకు మస్కరించరాదు" అంటూ వారించి, ప్రసాదం ఎంతోభక్తితో గ్రహించి, ఆ పండితునకు బదులు మర్యాద చేసి పంపారు. ఆయన వెళుతు ఈ మిరాశీదారును చూచి, "ఈయనే నిన్న రుద్రాభిషేకం జరిపించింది" అని చెప్పి వెళ్ళిపోయాడు…మిరాశీదాదు ఈ పాపమునకు పరిహారమేమిటని మహా స్వామి వారిముందు మళ్ళీమళ్ళీ ప్రాధేయపడినాడు…మహాస్వామివారు లేస్తూ, "ప్రాయశ్చిత్తం నేను చెప్పలేను. తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి మాత్రమే చెప్పగలరు" అన్నారు."ఇంత జరిగిన తరువాత ఆయన ప్రాయశ్చిత్తం చెబుతాడా" అన్నాడు మిరాశీదారు…"నీకుప్రాప్తముంటే ఆయన చెబుతాడు" అంటూ తనగదిలోనికి వెళ్ళిపోయారు స్వామివారు. రాత్రిదాకా స్వామివారు బయటకు రాలేదు… మిరాశీదారు నేరుగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి పాదములు పట్టుకొని ప్రాయశ్చిత్తానికై ప్రార్ధించడానికి నిశ్చయించు కొన్నాడు. అక్కడకు చేరేసరికి తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి ఇంటిముందు జనం గుమికూడి ఉన్నారు. ఘనపాఠి గారు ఆ తెల్లవారుఝామునే శివసాయుజ్యమొందారు. స్వామివారు "నీకుప్రాప్తముంటే" అన్న మాటలకర్ధం మిరాశీదారుకు ఇప్పుడు అర్ధమయింది. తాను మహాపాపిననుకొంటూ ఘనపాఠి గారి పార్ధివదేహానికి నమస్కరించి ఇంటికిపోయాడు. వేదపండితులకు మనమీయవలసిన మర్యాద ఎటువంటిదో మహాస్వామివారు అనేక సందర్భాలలో ఈ విధంగా తెలియచేశారు…ఇట్టి మహాపరాధం చేసిన, తనను ఆశ్రయించిన మిరాశీదారును పరమ కరుణామూర్తి ఐన స్వామివారు వదిలివేయలేదు. ఆయన శ్రీవారి ఆదేశం మేరకు ప్రాయశ్చిత్తంగా కాశీవాసం చేసి కాశీలో ముక్తి పొందారు. జీవితంలొ ఎవ్వరిని తక్కువగా చూదకండి…….
Back

నిర్వాణ షట్కం

*_శివోహమ్ శివోహమ్ శివోహమ్....._* జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు ఒకసారి హిమాలయ ప్రాంతంలో సరియైన గురువు కోసం అన్వేషిస్తుండగా ఒక సన్యాసి ఎదురొచ్చి, "నువ్వు ఎవరివి..?" అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా శ్రీ ఆది శంకరులవారు మొత్తం అద్వైత వేదాంతాన్ని ఆరు శ్లోకాల రూపంలో "నిర్వాణ షట్కము" గా పలికారట. ఇది తను (అహం) అనుకునే ఆత్మ వివరణ కనుక దీనినే "ఆత్మ షట్కము" అని కూడా అంటారు. నిర్వాణం అంటే సంపూర్ణ సమదృష్టి, ప్రశాంతత, స్వేచ్చ, ఆనందము (సత్+చిత్+ఆనందం = సచ్చిదానందం) మిళితమైన ఒక అచేతన స్థితి. అదే సచ్చిదానందం. శివోహమ్ శివోహమ్ శివోహమ్... మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్ న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్ న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ న మే మృత్యు శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మః న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగత నైవ ముక్తిర్ న మేయః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్ శివోహమ్... || ఓం నమః శివాయ ||
Back

స్థూల సూక్ష్మ కారణ శరీరములు వాటి వివరణము. ఈ శరీరం దేహధ్యాసతోకాక ఆత్మస్వరూపుడు శరీరంలో ఉన్నాడు అన్న భావంతో దేహమనే దేవాలయాన్ని శుభ్రపరచి అలంకరించ వల యును. శరీరం అనగానే మొదట గుర్తుకొచ్చేది కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రి యాలతో కూడుకున్న ఈ స్థూల శరీరం. ఇది ఒక శరీరం అయినా ఇంకా మూడు శరీరాలు ఉన్నాయి. అవి సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం. స్థూల శరీరం కంటికి కనిపించేది స్థూల శరీరం పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచ విష యాలు, పంచ ప్రాణాలు, అంత:కరణ చతుష్టయంతో కూడుకు న్నది. ఈ శరీరం. కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాద, పాము, ఉపస్థలు. జ్ఞానేంద్రియాలు శ్రోత్రం, త్వక్కు, చక్ష, జివ్వా, ఘ్రాణం. విషయాలు శబ్ద, స్పర్శ, రూప రస, గంధములు. ప్రాణాలు సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపానములు. అంత: కరణ చతుష్టయము మనుస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం నాలుగు ఈ 24 ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు ఉంటారు. అంత:కరణ చతుష్టయానికి చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు. కర్మేంద్రియాలకి అగ్నిహోత్రుడు, ఉపేంద్రుడు, ఇంద్రుడు. మృత్యువు, ప్రజాపతి. జ్ఞనేంద్రియాలకి దిక్కులు, వాయువు, సూర్యుడు, అశ్వినీ దేవతలు, వరుణుడు. పంచప్రాణాలకి వశిష్టుడు, విశ్వమోని, విశ్వకర్త, జయుడు, అయుడు. ఈ అధిదేవతలుకూడా వాటంతట అవి ఇంద్రియాలతో పని చేయించలేవు. వీటికి చైతన్యం ఇచ్చేది ఆత్మ, స్థూల శరీరంలో వున్న ప్రత్గయాత్మ, లేక జీవుడు, విశ్వుడు అనే పేరుతో త్రికూట స్థానంలో ఉండి, శ్రోత్రేందియం ద్వారా, శబ్దాలను వింటూ, త్వగేంద్రియం ద్వారా స్పర్శలవలన , చక్ష రింద్రియం ద్వారా రూపా లను గ్రహించుతూ, జిహ్వేంద్రియం ద్వారా షడ్రుచులను గ్రహిం చుతూ, ఘ్రాణేంద్రియం ద్వారా త్రివిధగంధములను తెలుసు కొంటాడు. ప్రత్యగాత్మ చైతన్యం లేకపోతే ఏ ఇంద్రియం పని చెయ్యదు. దీనికి ఉదాహరణ ప్రాణం పోయిన తరువాత శరీరంలో ఏ ఇంద్రియం కదలదు అన్న విషయం అందరికీ తెలిసి నదే. దీని అవస్థజాగ్రదవస్థ. సూక్ష్మ శరీరం పంచ జ్ఞనేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి. ఈ 17 ఇంద్రియాలతో కూడినది సూక్ష్మశరీరం దీని అభిమాని తైజసుడు అంటే ప్రత్యగాత్నే సూక్ష్మశరీరంలో ఉన్నప్పుడు తైజసుడు అంటారు. స్థూల శరీరం నిశ్చలంగా పడకమీద పడివున్నప్పుడు తైజసుడు 17 ఇంద్రి యాలతోను అనేక కర్మలను ఆచరిస్తాడు. ఇవి అన్నీ కూడా మనోక ల్పితాలు. దీని అవస్థ స్వప్నావస్థ. ఇందులో జాగ్రదవస్ధలో చూసి నవి, చూడనివి ఏ జన్మలోనో చూసినవి కూడా రావచ్చు దీని స్థానం కంఠస్థానం. కారణ శరీరం అన్ని ఇంద్రియాలు పనిచెయ్యడం మానివేసి నప్పుడు, మనస్సు కూడా ఆవిద్యలో లీనమైనప్పుడు ఉండేది కారణ శరీరం. దీనిలోవున్న ప్రత్యగాత్మను ప్రాజ్ఞుడు అంటారు. ఈ స్థితిలో శరీరం మీద పాము పాకినా తెలీదు. కాని ఈ స్థితిలో ఏదీ తెలియకపోయినా మనస్సు ఉంటుంది. మనస్సు లేకపోతే సుషుప్తి లోనుంచి లేచినతరువాత 'నేను బాగా నిద్రపోయాను' అని తెలుసు కొనేది ఎవరు? అదే మనస్సు. ప్రాజ్ఞుని స్థానం హృదయ స్థానం. జాగ్రదవస్థలో జ్ఞానేంద్రియాలతో విషయాలను తెలుసుకొని. కర్మేంద్రియాలతో కర్మల నాచరించినప్పుడు ఆ ఫలితాలు వాసనా రూపంగా ఈ కారణ శరీరం ఉంటాయి ఇవే శరీర పతనానంతరం, మరుజన్మకు కారణమవుతాయి అంటే మరణాంతరం జీవుడు ఈ వాసనలను తీసుకొని, మరోజన్మకు వెళ్లిపోతాడు. అందుకనే దీనిని కారణ శరీరం అన్నారు ఈ వాసనల మూటే హృదయ గ్రంధి లేక లింగ శరీరం. ఈ మూడు శరీరాలలో ఏది ఆత్మ అంటే, ఏదీకాదు, స్థూల శరీరం తీసుకొందామంటే 'ఇది నా కాలు' 'ఇది నా చెయ్యి' అంటారే కాని 'ఈ చెయ్యి నేను' 'ఈ కాలు నేను' అనరు. కనుక 'నేను వేరు, కర్మేంద్రియాలు వేరు. పోనీ జ్ఞానేంద్రియాలు ఏమో అనుకుంటే 'నా కన్ను' 'నా చెవి' అనే అంటారు. కనుక 'నేను' జ్ఞానేంద్రియాలు కన్న కూడా భిన్నమైనదే. పోనీ మనస్సు అందామంటే 'నా మనస్సు ఇవాళ బాగుండలేదు', 'నా మనస్సుకు చాలా బాధకలిగింది' అంటారు. కనుక మనస్సు వేరు. 'నేను' వేరు 'నా ప్రాణం ఏదోలా ఉంది. అన్నదాన్ని బట్టి నేను ప్రాణం కూడా కాదు అని అనాలి. కనుక స్థూల శరీరం వేరు 'నేను' వేరు. నేను అనే ఆత్మ సాక్షి స్వరూ పిణి. అన్నీ చూస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీరం అవుతుందా అంటే 'నాకు ఇవాళ ఈ కలవ చ్చింది అందులో నేను మా అమ్మ, నాన్నను చూశాను' అంటారు. అంటే మనోకల్పితములైన ఆ స్వప్నంలో కూడా నేను వేరు. కనుక సూక్ష్మ శరీరానికి కూడా ఆత్మసాక్షి. ఇంక సుషుప్త వ్యవస్థలో 'నేను బాగా నిద్రపోయాను. నాకు ఏమీ తెలియదు' అంటారు. ఆ అవస్థలో కూడా ఆత్మ సాక్షిరూపంగానే ఉంది. అది లేకపోతే మరణానికి, సుషుప్తికి తేడా లేదు. స్థూల ఆత్మ ఈ మూడు శరీరాలకు సాక్షిరూపంగా ఉంది. దేనితోను తాదా త్మ్యంను చెందలేదు. జాగ్రద్స్వప్న సుషుప్తవస్థలకు సాక్షి స్వరూపం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు మూడింటికి విలక్షణంగా జ్యోతీ రూపంగా, స్వయంప్రకాశ మానంగా కర్తగాని, భోక్తిగాని కాకుండా అన్నిటికి చైతన్యం ఇచ్చే పరంజ్యోతి ఏదైతేవుందో, అదే మహాకారణ శరీరం. ఇదే ఆత్మజ్యోతి. శ్రీగురు పరదేవతాయైనమ:
Back

యజ్ఞం ఎందుకు చేస్తారు? మనందరికీ యజ్ఞం అనే పదం బాగా తెలిసిందే. దేవాలయాల్లో, కొత్త ఇళ్ళలో, ఇంకా చాలా సందర్భాలలో యజ్ఞాలు చేస్తుంటారు. అయితే ఈ యజ్ఞాలు ఎందుకు చేస్తారో? వాటి వల్ల ఫలితాలేంటొ తెలుసుకుందాం. వేదకాలం నాటి నుండి ఉన్న మన ఆచార వ్యవహారాలెన్నో నేడు అంతర్థానమైపోయాయి. మరికొన్నిఅయితే పూర్తి వ్యతిరేక స్థాయిలో అమల్లోకి వచ్చాయి. కొన్ని రూపురేఖలు, స్వరూప స్వభావాలు మార్చుకున్నాయి. అలాంటి వాటిలో యజ్ఞయాగాదులను ముఖ్యమని చెప్ప వచ్చు. ఈరోజుల్లో అధికారం కోసం, దాన్ని నిలబెట్టుకోవడానికే యజ్ఞాలను చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది మరి. యజ్ఞం లేదా యాగం అనేది ఒక విశిష్టమైన మన హిందూ సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించం యజ్ఞం ముఖ్య లక్ష్యం. సాధారణంగా యజ్ఞం అనేది అగ్ని (హోమం) వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో వేసినవన్ని అన్నీ దేవతలకు చేరుతాయని విశ్వాసం ఉంది. యజ్ఞంలో ఒకటి గాని అంతకంటే ఎక్కువ గాని హోమాగ్నులు ఉంటాయి. ఆ అగ్నిలో నెయ్యి, పాలు, ధాన్యం వంటి వాటిని వేస్తుంటారు. యజ్ఞాలు కొద్ది నిముషాలనుండి అనేక సంవత్సరాలవరకూ జరుగవచ్చు. ‘‘ యజ్ఞం ’’ అను శబ్దం ‘‘ యజ దేవపూజయాం’’ అనుదాతువు నుండి ఏర్పడింది. దైవపూజే యజ్ఞం. ’’యజయే ఇతి యజ్ఞ: యజ:’’ ఎన్నో యజ్ఞ యాగదులచేత యోగ దాయకుడైన పరమేశ్శరుని యోగీశ్యరత్వానికి ’య’ కారం ప్రతీకగా చెప్పబడింది. యజ్ఞం వలన స్వార్దం నశింస్తుందని గాఢ విశ్వాసం ఉంది. యజ్ఞాలు ల లో మూడు ప్రధాన రకాలున్నాయి. అవి (1) పాక యజ్ఞాలు (2) హవిర్యాగాలు (3) సోమ సంస్థలు వేదంలో యజ్ఞో వై విష్ణుః అని చెప్పబడింది. అంటే యజ్ఞము విష్ణు స్వరూపం అని అర్ధం. . చాలామంది హోమం, అగ్నిహోత్రాల్లో ఆజ్యం (నునె లేదా నెయ్యి) పోయడం దండగని, మిగతా వస్తువులన్నీ వేయడం వృధా అని, చాదస్తం అని కొట్టి పడేసేవారున్నారు, దీనివల్ల ఒరిగేదేమీ లేకపోగా ఎంతో డబ్బు నష్టమని కొందరు వాదిస్తూ ఉంటారు. ప్రకృతిలో ఉన్నవన్నీ మన స్వార్థం కోసమే కాదు కదా! కొన్నిటిని తిరిగి ప్రకృతికే ఇవ్వాలి. అలా చేయడం వల్ల ఆయా వస్తువులు, పదార్ధాలను వృధా చేసినట్లనుకుంటే పొరపాటే మరి. ఆయా పదార్ధాలను కచితంగా సార్ధకం అవుతుంది. ఇలా అగ్నిదేవునికి ఆహుతి చేయడంవల్ల రెట్టింపు ఫలితం ఉంటుంది అనేది మనకు అనాదిగా వస్తున్నా నమ్మకం. ఈ యజ్ఞాలు చెయ్యడం వెనుక scientific reasons కూడా ఉన్నాయి అండీ.. యజ్ఞం చేసేపుడు అగ్ని హోమాలు చేసి అందులో నెయ్యి, పాలు, ధాన్యం, ఆవు పేడ పిడకలు, జిల్లేడు, మోదుగ, దర్భ, గరిక వృక్షాల కట్టెలు వంటి వాటిని వేస్తుంటారు. ఆజ్యాన్ని పోయడంవల్ల పొగ వస్తుంది. అది మనలో అనారోగ్యం తలెత్తకుండా చేస్తుంది. అనేక కారణాలవల్ల ఏర్పడే కాలుష్యాన్ని నివారిస్తుంది. అతివృష్టి, అనావృష్టి లాంటి అపసవ్యతలు లేకుండా చేసి వాతావరణ సమతుల్యతకు దారితీస్తుంది. నేతిని అగ్నిలో వెయ్యడం వచ్చే ధూమంవల్ల వాతావరణంలో ఉన్న కాలుష్యం నివారించబడుతుంది. అణుశక్తి కారణంగా జనించే అనేక బాధలు తగ్గుతాయి కూడా. స్వచ్చమైన గాలి అందుతుంది. మనకు హాని చేసే సూక్ష్మక్రిములు నశిస్తాయి. అంతే కాదండీ ఈ అగ్ని హోమాల్లోని భస్మంతో ఔషధాలు తయారుచేయొచ్చు. యాగాలు చేసిన తర్వాత వచ్చే భస్మాన్ని పంట భూముల్లో చల్లితే ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పొగని మనం పీల్చడం వల్ల లోపలి అనారోగ్యాలు నయమౌతాయి. వర్షాభావం, మితిమీరిన ఎండలు లాంటి వాతావరణ అసమతుల్యత లేకుండా పొలాలు సస్యశ్యామలంగా ఉండి, దేశం సుభిక్షంగా ఉంటుంది. అందుకే యజ్ఞం జరిగే ప్రదేశం ఉండాలని, యజ్ఞం జరిగాక మిగిలిన బూడిదను తీసుకోవాలని చెప్తారు. మరి యజ్ఞాల వల్ల లాభాలు తెలుసుకునారుగా! ఇక నుండి మీ చుట్టూ పక్కల ఎక్కడ యజ్ఞం జరిగిన కొంత సమయాన్ని కేటాయించి వెళ్ళిరండి. అందువల్ల జరిగే మంచిని పొందండి.
Back

సృష్టి - దృష్టి పరమేశ్వరుడికి తన సృష్టిపై అంతులేని ప్రేమ. మనుషులు మూర్ఖత్వంతో, అజ్ఞానంతో స్వజాతి వినాశనానికి ఎంత ప్రయత్నిస్తున్నా భగవంతుడు రక్షిస్తూనే ఉంటాడు. చంటిబిడ్డ కాలితో తన్నినా తల్లిదండ్రులు ఆ కాలును ముద్దు పెట్టుకుంటారే గాని కినుక వహించరు. జగత్తు సర్వస్వం ఈశ్వరమయం. ప్రతిచోటా పరమేశ్వరుడు ఉంటాడన్నాక ఇక ‘ప్రాణుల్లోనూ ఉంటాడు’ అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వేమన దృష్టిలో ప్రతి జీవీ శివస్వరూపమే! ‘జీవిని చంపడం అంటే శివుడిని చంపడమే!’ అని వేమన విస్పష్టంగా చెప్పాడు. పాశ్చాత్య ఆధ్యాత్మిక దృష్టిలో ఆరువేల సంవత్సరాల క్రితం మనుషుల్ని భగవంతుడు సృష్టించాడు. భారతీయుల దృష్టిలో కొన్ని లక్షల సంవత్సరాలు దాటింది. భారతీయుల దృష్టే సత్యసమ్మతంగా ఉందని ఆధునిక విజ్ఞానశాస్త్రం స్పష్టం చేస్తున్నది. ఈ సృష్టిని గురించి మన పురాణాలు పేర్కొన్నాయి. శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ రుద్రుడిని, ఇంద్రుడిని, సనక సనందనాదులను, దేవర్షులను, ప్రజాపతులను, సిద్ధ, గంధర్వ, కిన్నర, కింపురుష, విద్యాధరులను, చతుర్వర్ణాల మనుషులను, జంతువులను, చెట్లను ఇతర స్థావరాలను... సృష్టించాడు. విత్తనాలనుంచి చెట్లు పుడతాయి. వీటిని ఉద్బీజాలు అంటారు. చెమటనుంచి పుట్టిన సూక్ష్మ క్రిములు స్వేదజాలు... ఇవి గాక- అండజాలు, పిండజాలు లక్షల రకాలు... సృష్టిలో కనిపిస్తాయి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఆధ్యాత్మిక మార్గమూ ‘అహింసే పరమ ధర్మం’ అని చెబుతుంది. భగవంతుడి ప్రేమమార్గాన్ని వ్యాప్తిచేసే సూత్రం ఇది. శంకరాచార్యుల అద్వైతం, బుద్ధుడి కరుణా దృష్టి... ఈ మార్గంలోనే పయనిస్తున్నాయి. ప్రకృతి ప్రియులకు సృష్టిలోని ప్రతి చెట్టు, పుట్ట, పిట్ట... సౌందర్య నిలయాలే! ఏ ప్రాణీ తనను తాను అసహ్యించుకోదు - ఒక్క మనిషితప్ప! నల్లగా ఉన్నామనో, పొట్టిగా ఉన్నామనో వేదన చెందేవారు ఎందరో ఉన్నారు. భగవానుడే నల్లటివాడిగా, పొట్టివాడిగా అవతారాలెత్తాడు! ఆయన చేసిన పనుల వలన లోకాలు సుఖించాయి. అందువల్ల నల్లనయ్యను భక్తితో పూజిస్తాం. ఆయన బోధించిన భగవద్గీత మనకు మోక్షమార్గం. చరిత్రలో ఎందరో అందవిహీనంగా ఉండే మహాత్ములు కనిపిస్తారు. కానీ వారి ఔన్నత్యం భౌతికసౌందర్యాన్ని మించి పోయి ఉంటుంది. వారి రూపురేఖలు మన హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి. ఇక వారి అందాన్ని గురించి పట్టించుకోం. ఎవరైనా ఆ మహాత్ముల చక్కదనాన్ని గురించి తక్కువచేసి వ్యాఖ్యానిస్తే సహించం. సామాన్యంగా కథారచయితలు, కవులు కల్పనను ఇష్టపడతారు. అందువల్లనే వారి రచనల్లో సత్యం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా వారిని అసత్యవాదులు అనలేం. మనకు అర్థంకాని జీవిత సత్యాలనెన్నింటినో రచయితలు సులభంగానూ రసరమ్యంగానూ తెలియజేస్తారు. పురాణ ఇతిహాసాల్లోనూ ఇదే రీతి. కల్పనల సహాయంతో క్లిష్ట సమస్యలకు సులభ పరిష్కారాలను సూచించారు మన రుషులు. వారిది పవిత్ర దృష్టి. వాళ్ల సృష్టి కూడా పవిత్రమైనదే! వారి కల్పనలు లోకానికి శుభం చేకూరుస్తాయి. లోకశ్రేయస్సు కోసం చేసే కర్మలు, చెప్పే మాటలు, రాసే రాతలు... అన్నీ సత్యంగానే భావించాలి. మానసిక వైద్యులు రోగికి ఉపశమనం కలిగించడానికి చెప్పే మాటలను సత్యాలుగా భావిస్తేనే మేలు కలుగుతుంది. విద్యార్థులతో ఉపాధ్యాయులు చెప్పే విషయాలను గ్రహించాలంటే వాళ్లకు శ్రద్ధాభక్తులు అవసరం. గురువును దైవం అనే దృష్టితో చూస్తేనే అది సాధ్యం....
Back

https://www.facebook.com/srimahavidya.peetham/videos/1325686324307537/
Back

https://www.facebook.com/srimahavidya.peetham/videos/1325686324307537/
Back

మానవ జీవన ప్రతిబింబం రామాయణం యావత్‌ స్థాస్యంతి గిరయః సరితస్చ మహీతలేశ్రీ తావత్‌ రామాయణకథా లోకేషు ప్రచరిష్యతిశ్రీశ్రీ మహర్షి వాల్మీకి రచించి మనకందించిన శ్రీమద్రామాయణాన్ని గురించిన గొప్పమాట ఇది. వేల సంవత్సరాలుగా మానవ జీవితానికి ఆదర్శప్రాయంగా నిలిచిన మహాకావ్యం రామాయణం. అందుకే ‘‘ఈ సృష్టిలో పర్వతములు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథ ప్రచారంలో ఉంటుంది’’ అని రామాయణమే చెబుతోంది. ఒక మహాకావ్యానికి పదికాలాల పాటు లోకాన్ని ఉద్ధరించే శక్తి ఉంటే.. అది కాల ప్రవాహానికి ఎదురొడ్డయినా నిలిచి వెలుగుతుంది. దానికి ప్రధాన కారణం.. ప్రపంచరీతులు, విశ్వంలోని మానవుల సంవేదనలు, మనిషి ఆచరించాల్సిన ధర్మమార్గం వంటి అనేకమైన అంశాలు ఈ కావ్యంలో దర్శనమిస్తాయి. సార్వకాలికమైన సత్యాలను, ధర్మాలను బోధించే రామకథ విశ్వంలోని సర్వమానవజాతికి ఆదర్శంగా నిలిచింది. పుత్ర ధర్మమైనా, మిత్ర ధర్మమైనా, సోదర ధర్మమైనా సమాజానికి అవసరమైన ఏ ధర్మమైనా సరే.. దాని ఆచరణ ఎంత కష్టమైనా సరే.. ఎన్ని ఆటంకాలు, ఆపదలు ఎదురైనా సరే.. వాటన్నింటినీ అధిగమించి విజయం సాధించడమే రాముని కథలో మనకు అందే సందేశం. రాక్షస ప్రవృత్తి మనిషిని కష్టాల్లోకి నెట్టివేస్తుంది. మానసిక దృఢత్వంతో దాన్ని ఎదిరించి, జయించాలన్న నీతిని రామాయణం చెప్పింది. అందుకే అది మానవులున్నంత కాలం, ప్రకృతి ఉన్నంత కాలం ప్రచారంలోనే ఉంటుంది. రాముడి త్యాగమే ఆయనను ధర్మమార్గంలో నడిపించింది. దానికి సత్యపథం తోడైంది. శాశ్వతంగా నిలువవలసిన ‘సత్యం’ రామచంద్ర ప్రభువు జీవితాన్ని వెలిగించి, ఆదర్శ ప్రభువుగా నిలిపింది. పరమాత్మకు మరో రూపమే ధర్మం. ఆ ధర్మానికి సత్యమే పునాది. ఆ పునాదిపైన రామాయణ కావ్య నిర్మాణం జరిగింది. అందుకే అది నేటికీ పటిష్ఠంగా నిలిచి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నది. రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి అరణ్యాలకు వెళ్లిన రాముడి ఔన్నత్యం, సర్వ సుఖాలను త్యజించి అన్న వెంట నడవటమే ధర్మమార్గమని యెంచిన లక్ష్మణ స్వామి ఘనత, అంతఃపుర సౌఖ్యాన్ని వదిలి, భర్తమార్గంలోనే నడిచి అడవులకేగిన సీతమ్మ వారి మహోన్నత వ్యక్తిత్వం వంటి ఎన్నెన్నో విషయాలు మానవ సమాజానికి మార్గదర్శనం చేశాయి. అయోధ్య, కిష్కింధ, లంక రాజ్యాల కథగా కనిపించే ఈ కావ్యం కేవలం మూడు రాజ్యాల కథ మాత్రమే కాదు. ఇది మూడు జాతుల కథ. మానవ, వానర, రాక్షస జాతుల సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలు. ఈ గుణాల కారణంగా ఏర్పడ్డ ధర్మవిరుద్ధ భావాలు కల దుష్టులను శిక్షించే శక్తిని మనిషి సాధించాలన్నది మహర్షి భావన. అందుకే ఈ కథను వేద సమానమైన కథగా కీర్తిస్తారు. అలాంటి రామాయణమే వేదం. రాముడే వేద పురుషుడు. శ్రీగురు పరదేవతాయై నమ:
Back

మానవ జీవన ప్రతిబింబం రామాయణం యావత్‌ స్థాస్యంతి గిరయః సరితస్చ మహీతలేశ్రీ తావత్‌ రామాయణకథా లోకేషు ప్రచరిష్యతిశ్రీశ్రీ మహర్షి వాల్మీకి రచించి మనకందించిన శ్రీమద్రామాయణాన్ని గురించిన గొప్పమాట ఇది. వేల సంవత్సరాలుగా మానవ జీవితానికి ఆదర్శప్రాయంగా నిలిచిన మహాకావ్యం రామాయణం. అందుకే ‘‘ఈ సృష్టిలో పర్వతములు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథ ప్రచారంలో ఉంటుంది’’ అని రామాయణమే చెబుతోంది. ఒక మహాకావ్యానికి పదికాలాల పాటు లోకాన్ని ఉద్ధరించే శక్తి ఉంటే.. అది కాల ప్రవాహానికి ఎదురొడ్డయినా నిలిచి వెలుగుతుంది. దానికి ప్రధాన కారణం.. ప్రపంచరీతులు, విశ్వంలోని మానవుల సంవేదనలు, మనిషి ఆచరించాల్సిన ధర్మమార్గం వంటి అనేకమైన అంశాలు ఈ కావ్యంలో దర్శనమిస్తాయి. సార్వకాలికమైన సత్యాలను, ధర్మాలను బోధించే రామకథ విశ్వంలోని సర్వమానవజాతికి ఆదర్శంగా నిలిచింది. పుత్ర ధర్మమైనా, మిత్ర ధర్మమైనా, సోదర ధర్మమైనా సమాజానికి అవసరమైన ఏ ధర్మమైనా సరే.. దాని ఆచరణ ఎంత కష్టమైనా సరే.. ఎన్ని ఆటంకాలు, ఆపదలు ఎదురైనా సరే.. వాటన్నింటినీ అధిగమించి విజయం సాధించడమే రాముని కథలో మనకు అందే సందేశం. రాక్షస ప్రవృత్తి మనిషిని కష్టాల్లోకి నెట్టివేస్తుంది. మానసిక దృఢత్వంతో దాన్ని ఎదిరించి, జయించాలన్న నీతిని రామాయణం చెప్పింది. అందుకే అది మానవులున్నంత కాలం, ప్రకృతి ఉన్నంత కాలం ప్రచారంలోనే ఉంటుంది. రాముడి త్యాగమే ఆయనను ధర్మమార్గంలో నడిపించింది. దానికి సత్యపథం తోడైంది. శాశ్వతంగా నిలువవలసిన ‘సత్యం’ రామచంద్ర ప్రభువు జీవితాన్ని వెలిగించి, ఆదర్శ ప్రభువుగా నిలిపింది. పరమాత్మకు మరో రూపమే ధర్మం. ఆ ధర్మానికి సత్యమే పునాది. ఆ పునాదిపైన రామాయణ కావ్య నిర్మాణం జరిగింది. అందుకే అది నేటికీ పటిష్ఠంగా నిలిచి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తున్నది. రాజ్యాన్ని తృణప్రాయంగా త్యజించి అరణ్యాలకు వెళ్లిన రాముడి ఔన్నత్యం, సర్వ సుఖాలను త్యజించి అన్న వెంట నడవటమే ధర్మమార్గమని యెంచిన లక్ష్మణ స్వామి ఘనత, అంతఃపుర సౌఖ్యాన్ని వదిలి, భర్తమార్గంలోనే నడిచి అడవులకేగిన సీతమ్మ వారి మహోన్నత వ్యక్తిత్వం వంటి ఎన్నెన్నో విషయాలు మానవ సమాజానికి మార్గదర్శనం చేశాయి. అయోధ్య, కిష్కింధ, లంక రాజ్యాల కథగా కనిపించే ఈ కావ్యం కేవలం మూడు రాజ్యాల కథ మాత్రమే కాదు. ఇది మూడు జాతుల కథ. మానవ, వానర, రాక్షస జాతుల సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలు. ఈ గుణాల కారణంగా ఏర్పడ్డ ధర్మవిరుద్ధ భావాలు కల దుష్టులను శిక్షించే శక్తిని మనిషి సాధించాలన్నది మహర్షి భావన. అందుకే ఈ కథను వేద సమానమైన కథగా కీర్తిస్తారు. అలాంటి రామాయణమే వేదం. రాముడే వేద పురుషుడు. శ్రీగురు పరదేవతాయై నమ:
Back

కామాక్షీ వైభవం

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱 #కామాక్షీ_వైభవం ఒకప్పుడు పరమశివుడు కైలాసపర్వతం మీద కూర్చుని ఉన్న సమయంలో, అమ్మవారు లీలావినోదంగా ఆయనతో సంతోషంగా కాలం గడుపుతూ, ఆయన రెండు కళ్ళూ మూసింది. ఆయన రెండు కళ్ళు 'సూర్యచంద్రౌ చ నేత్రే' ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. అగ్నిహోత్రం మూడవ కన్ను. ఆ కారణం చేత, ఆవిడ ఆయన రెండు కన్నులూ మూస్తే, లోకమంతా చీకటియిపోయింది. సూర్యచంద్రుల గమనం లేకపోతే, వచ్చే పెద్ద ప్రమాదం, ధర్మచక్రం ఆగిపోతుంది. ఏది లుప్తమైనా పరవాలేదు గాని, ధర్మచక్రం ఆగిపోకూడదు. ఏ పని చేసినా, ఆయా కాలాలలో చేయాలి తప్ప, ఏ కాలంలో ఏది చెయ్యాలో, అది చేయకుండాO వేరొక పని చెయ్యకూడదు. సూర్యచంద్రులు కదలిక లేక ఆగిపోవడంతో, లోకమంతా చీకట్లు కమ్మి, కాలం తెలియలేదు కాబట్టి, చేయవలసిన అనుష్టానాలు జరగక, ధర్మానికి గ్లాని ఏర్పడింది. ఇది జరిగినది, పరమశివునకు లిప్తకాలమైనా, భూలోకంలో దాని ప్రభావం, చాలా ఉంటుంది. లోకులు ఖేదపడ్డారు. ఈశ్వరునిలో ఉన్న గొప్పదనం ఏమిటంటే, అమ్మవారికి పాపపుణ్యాలు ఉండవు. కానీ ఒక పని చేసినప్పుడు, ఇతరులు బాధ పడేటట్లు చేస్తే, అది దోషమవుతుంది. అలా ఎప్పుడూ చెయ్యకూడదు. సూర్యచంద్రుల ప్రకాశం లేక, లోకులు బాధ పడ్డారు. పార్వతీ దేవి కదా అని ఉపేక్షిస్తే, లోకంలో మిగిలిన వాళ్ళు, ఇతరులను బాధపెట్టి, మేం మాత్రం ఎందుకు ఉపేక్షించ కూడదు, అంటారు. అందుకని, ఆయన భూలోకానికి వెళ్ళి తపస్సు చేయి అంటే, ఆవిడ భూలోకానికి వచ్చి తపస్సు చేసింది. ఆ తల్లి, ఉత్తరభారతంలో, హిమాలయాల మీద, ఎప్పటి నుండో, తనని కుమార్తెగా పొందడానికి ప్రయత్నిస్తూ తపస్సు చేసుకుంటున్న, కాత్యాయన మహర్షి కుమార్తె అయి, కాత్యాయనుని కూతురు కాబట్టి, కాత్యాయిని అని పేరుపొందింది. ఆ తల్లి యుక్త వయస్సు పొందిన తరువాత, ఆమెకి వివాహం చేయవలసివచ్చింది. అమ్మవారు ఎంతమందికైనా, కూతురవుతుంది కాని, పరమేశ్వరునికే ఇల్లాలు. ఆయనని భర్తగా తేవడం, ఆమెకే సాద్యం తప్ప, ఇతరులకు సాధ్యం కాదు. కాత్యాయనమహర్షి, కొన్ని వస్తువులిచ్చి," అమ్మా ! ఇవి పట్టుకుని బయలుదేరు. నువ్వు ఏ ప్రాతాంనికి వెళ్ళినప్పుడు, ఈ వస్తువులు మార్పు చెందుతాయో, అక్కడ తపస్సు చేయి. ఈశ్వరుడు స్వీకరించి, భార్యాస్థానంలో, కూర్చోపెట్టుకుంటాడు" . అని చెప్పాడు. ఆమె బయలుదేరి, దక్షిణదేశం వస్తుండగా, కాంచీపురానికి వస్తున్నప్పుడు, ఆమెకి ఇచ్చిన వస్తువులు మార్పు చెందాయి. ఆ పట్టణంలోనే తపస్సు చేయాలని, అమ్మవారు అక్కడ తపస్సు ప్రారంభించింది. పరమశివుడు, ఆమెకి తన పట్ల ఉన్న ప్రేమ ఎటువంటిదో, ఎంతటి మహాపతివ్రతో, లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. ఆయన తన జటాజూటంలోని, గంగపాయను ఒకదానిని, విడచి పెట్టాడు. విశేషమైన ప్రవాహంతో, విచ్చేస్తున్నది. ఆవిడ ఇసుక లింగాన్ని చేసి, ఆరాధన చేస్తున్నది. ఆమెకి తాను కొట్టుకుపోతానని బెంగ కాదు, సైకత లింగం కొట్టుకొనిపోతుందేమో అని బెంగ కలిగి, దుర్గమ్మ ఆవిర్భవించేటట్లుగా, ధ్యానం చేసి, ఆ నీటినంతటినీ త్రాగేయమంది. ప్రళయకాల బంధిని అయిన గంగా ప్రవాహాన్ని, పుక్కిట పట్టి, దుర్గమ్మ తాగేసింది. శివుడు చూసి, ఏం చేస్తుందో చూద్దామని, అంతకన్నా అధృతమైన ప్రవాహాన్ని విడిచి పెట్టాడు. బ్రహ్మాండమైన ప్రవాహం కాంచీపురం వైపు వస్తుంటే, పార్వతీదేవి," కంప కంప" అన్నది. అంటే "భయం భయం" అని అర్థం. అమ్మవారే భయం పోగొట్టగలిగిన ఆదిశక్తి. ఆవిడకు భయం లేదు. సైకత లింగం వెళ్ళిపోతుందని ఆవిడకు భయం. ఆ శివలింగం పోవడానికి వీలు లేదు. లింగానికి నీళ్ళు తగిలేముందు, నేనే వెళ్ళీపోవాలని, తన పతిభక్తిని చాటి చెప్పడానికి, సైకత లింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నది. అప్పుడు అమ్మవారి కుచములు, కంకణాల ముద్రలు, శివలింగం మీద పడ్డాయి. పరమశివుడు చూసి, అమ్మవారి పతిభక్తికి మెచ్చి, ప్రవాహాన్ని ఉపసంహారం చేసి, అమ్మవారిని తాను స్వీకరించాడు. *శివాయ గురవే నమః* *శ్రీ మాత్రే నమః* 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Back

శైవం వేదబాహ్యమైన మతశాఖ కాదు యుగోస్లావియా నుండి డాక్టర్ చెడోవేల్యాచివ్ ఒక విజిటింగ్ ప్రొఫెసర్, స్వామివారిని దర్శించారు. ఈ సమావేశం 1964 అక్టోబరు 20వ తేదీన కంచిలో జరిగింది. జనసామాన్యం దృష్టిలో శైవానికీ వైష్ణవానికీ వున్న అసలు భేదమేమిటి తెలుసుకోవాలని తనకు కోరిక వున్నట్లు అతిథి ముందుగా చెప్పారు. తనకు వైష్ణవ మతమంటే అభిమానమని కూడా అన్నారు. దానికి కారణం వేదాలకూ పురాణేతిహాసాలకూ వైష్ణవంతో వున్న సన్నిహిత సంబంధం. శైవం అలాకాదు, ఆర్యులు భారతదేశానికి రాకముందర నుంచీ వున్న మతమిది. తరువాతి కాలంలో క్రమంగా వేదసంస్కృతి మీద ఆధిపత్యం సంపాదించింది. జగద్గురువులు ఆదిశంకరులవారు తాము శైవులమైనా భగవద్గీతోపనిషద్భహ్మసూత్రాలకు అద్వైత వేదాంతపరమైన భాష్యాలను వ్రాసి శైవ, వైష్ణవ భేదానికి తాము అతీతులమని నిరూపించుకున్నారు. కాని తరువాత తరువాత వచ్చిన మార్పుల్లో శివునకు ప్రాధాన్యం పెరిగి బ్రహ్మవిష్ణువులకు ప్రాధాన్యం తరిగి పోయింది. ఈ మార్పు ప్రాచీన భారతీయకళల్లో స్పష్టంగా కనబడుతుంది. ఎలిఫెంటా గుహల్లో ఎల్లోరా కుడ్యచిత్రాల్లో, అలాగే ఒరిస్సాలోని అనేకానేక దేవాలయాల్లో వున్న విగ్రహాలను పరిశీలిస్తే త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణు ప్రాధాన్యం క్షీణించి శివ ప్రాధాన్యం అధికమైనట్లు కనబడుతుంది. కొందరు శైవులు ఒక్క శివుడే త్రిమూర్త్యాత్మకుడనీ, సృష్టిస్థితి లయకారుడనీ తనతో చెప్పినట్లు వేల్యాచివ్ అన్నారు. అలా చెప్పినవారు బ్రహ్మ విష్ణువులను పూర్తిగా ఉపేక్షించారు. ఈ రెండు మతశాఖలకు సంబంధించినవారు జరిపిన పరిశీలన ఏమేరకు సరియైనదో తెలుసుకోవాలని వేల్యాచివ్ స్వామివారి నర్థించారు. తాను పరిశీలించి తెలుసుకున్న విషయం అంతకు మునుపు విన్నదీ, చదివినదీ కాదనీ, భారతీయ సాంస్కృతిక చరిత్రాధ్యయనంలో తనకెక్కడా కనపడలేదనీ, భారతదేశానికి వచ్చి గమనించేవరకూ ఆ సంగతి తనకూ తెలియదని అన్నారు. వారు భారతదేశానికి వచ్చి, అనేక దేవాలయాలు సందర్శించి, ఆ దేవాలయాల్లోని విగ్రహ శిల్పాలూ, ఆచారకాండా గమనించిన తరువాత వారికి కలిగిన అభిప్రాయం అది. ముఖ్యంగా ఈ మార్పు 8, 13 శతాబ్దాల మధ్య జరిగినట్లు కనబడుతుంది. చాలామట్టుకు వారి అభిప్రాయాలతో స్వామివారేకీభవించారు. కాని శైవం వేదబాహ్యమైన మతశాఖకాదని స్వామివారన్నారు. వేదమధ్యంలో శివపంచాక్షరీ మంత్రం వుంది. వేదసంహితలో శివనామాలున్నాయి. హరప్ప, మొహంజొదారో ప్రాచీన సంస్కృతిలో శైవమత చిహ్నాలు కనబడతాయి. ప్రస్తుత శివమత వ్యాప్తికి స్వామివారు కొన్ని కారణాలు చెప్పారు. ఒక కారణం శైవాచార కాండ సులభతరం కావటం, నుదుట విష్ణుపాదాలు ధరించటం కన్నా విభూతి రేఖలు ధరించటం సులువు. రెండో కారణం వైష్ణవులపట్ల శైవులకున్న ఉదారబుద్ధి. శైవులు వైష్ణవులతో కలుస్తారుగాని, వైష్ణవులు శైవులతో కలవరు అంతగా. వేల్యాచివ్ - తాను కొన్ని పుణ్యక్షేత్రాల్లో గమనించినదాన్ని బట్టి - ముఖ్యంగా కోణార్క దేవాలయంలో చూచినదాన్ని బట్టి - సూర్యమతం అడుగుజాడల్లో శైవమతం నడచినట్లు కనబడుతుందన్నారు. దానికి స్వామివారు “శివుడు తెల్లనివాడు, విష్ణువు నీలమేఘశ్యాముడు, త్రిమూర్తుల్లో ఈ ఇద్దరి స్థానాలనూ ఇష్టాన్నిబట్టి మార్చుకోవచ్చు. బ్రహ్మ రజోగుణానికి చిహ్నం. శైవ వైష్ణవాలు రెంటిలోనూ ఆయనకు స్థానం ఒకటే. శైవులు శ్వేతస్వరూపుడైన భవుణ్ణి సత్త్వమూర్తిగా అభివర్ణిస్తారు. నీలమూర్తి అయిన విష్ణువును తమోగుణ చిహ్నంగా భావిస్తారు. దీన్ని తలక్రిందులుచేసి వైష్ణవులు శివుణే తమోగుణ ప్రధానుడుగా, విష్ణువును సత్వగుణ ప్రధానుడుగా ప్రతిపాదిస్తారు. వారలా, వీరిలా అనటం సహజమే. ఎందువల్లనంటే తానుకొలచే దైవానికి త్రిమూర్తుల్లో ఉత్తమత్వం కల్పించాలనే ఆరాటం భక్తులకుంటుంది. శైవుల్లోనూ, వైష్ణవుల్లోనూ ఇదే పరిస్థితి. కాని స్వామివారి అద్వైత వేదాంతంలో శివకేశవులకు భేదం లేదు. స్వామివారు శివారాధకులైనా సమున్నతమైన ఆధ్యాత్మిక జీవితంలో ఆదిశంకరులవారు ప్రతిపాదించిన అద్వైత వేదాంత సిద్ధాంతాన్నే అనుసరిస్తారు. ఆశీర్వచన సమయంలో నారాయణ స్మరణం చేస్తారు. వేల్యాచివ్ స్వామివారితో సంభాషించటం వల్ల ఎంతో ఆహ్లాదాన్ని, ఉతేజాన్ని పొందారు. వారి సంభాషణ యించుమించు అరగంటసేపు సాగింది. చివరకు నారాయణ, నారాయణ అంటూనే ఒక పండిచ్చి స్వామివారు అతిథిని ఆశీర్వదించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రాచార్యులైన ప్రొఫెసర్ టి.ఎం.పి. మహదేవన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. --- డాక్టర్ చెడో వేల్యాచప్ అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

నువ్వు ఏమి చేస్తుంటావు? 1989లో ఒకరోజు సాయింత్రం ఆరు గంటలప్పుడు కంచి శ్రీమఠంలో కూర్చుని స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పూర్వం కాంచీపురానికి తహసీల్దార్ గా పనిచేసిన మా పెద్దన్న తిరు. సుందరం, నేను మరియు అదనపు జిల్లాధికారి(అసిస్టెంట్ కలెక్టర్) స్వామివారి దర్శనం కోసం కూర్చుని ఉన్నాము. ఈ సంఘటన జరిగినప్పుడు మా అన్నయ్య తిరనల్వేలి జిల్లా కార్యాలయంలో బలహీన వర్గాల సంక్షేమాధికారిగా విధులు నిర్వహించేవాడు. అతను స్వామివారి దర్శనం ముగించుకొని ఆ రాత్రికే చెన్నై వెళ్ళిపోవాలి. భక్తులందరూ ఒక్కొక్కరిగా ముందుకు వెళ్ళి స్వామికి నమస్కరించారు. మా వంతు రాగానే మేమూ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాము. స్వామివారు నవ్వుతూ, “వెళ్ళడానికి చాలా ఆత్రంగా ఉన్నారే? కొద్దిసేపు ఉండండి” అని ఆదేశించారు. స్వామివారి ఆదేశానికి కట్టుబడి మేము అక్కడే కూర్చున్నాము. స్వామివారి చేతులుపైకెత్తి, దర్శాననికి వచ్చిన దాదాపు ముప్పైమందిని కూర్చుండమని సైగ చేశారు. స్వామివారు మొత్తం గుంపుని పలుసార్లు చూసి భక్తితో మూలగా కూర్చున్న ఒక వ్యక్తిపై పడ్డాయి. స్వామివారు అతనితో మాట్లాడగా అతను లేచి నిలబడ్డాడు. అతను చొక్కా తీసి పంచెపైన నడుము చుట్టూ కట్టుకున్నాడు. “నీ పేరు?” అని అడిగారు స్వామివారు. ”మురుగేశన్” అని వినయంగా చెప్పాడు. ”ఏం చేస్తుంటావు?” “వ్యవసాయం సామి” “ప్రపంచానికి అన్నం పెడుతున్నావన్నమాట” అని చిన్నగా నవ్వి, కూచోమన్నట్టుగా సైగచేశారు. అతను కూర్చున్నాడు. స్వామివారి కళ్ళు మరలా వెతకనారంభించాయి ఈసారి ఇంకొక భక్తుణ్ణి అడిగారు. అతను లేచి నిలబడి తన పేరు మునుస్వామి అని వెల్లోర్ లో రెవిన్యూ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు. “నువ్వు ప్రజలకు ఎలా సేవ చేస్తావు?” అని అడిగారు. ”నేను ప్రజలుకోరిన ప్రకారం భూయజమాన్య పత్రాలు, ఇంటి స్థాలాల హక్కు పత్రాలు వంటివి జారీ చేస్తుంటాను పెరియవ” వెంటనే స్వామివారు నావైపు చూసి “ఇప్పుడు ఏ పదవిలో ఉన్నావు?” అని అడిగారు. నాకు కాళ్ళుచేతులు అడడంలేదు. ఎందుకంటే, తమిళనాడు కంజ్యూమర్ ఫెడరేషన్ కి సహాయక తహసిల్దార్ గా చేస్తున్నాను. TASMAC(Tamil Nadu State Marketing Corporation)లో నా పని ప్రభుత్వ గోడౌన్ నుండి మద్యం చిల్లర వర్తకులకు వివిధ రకాలైన మద్యం అమ్మడం. ఇది ప్రజాసేవగా ఎలా చెప్పుకోను? కాస్త సందేహిస్తూనే స్వామివారికి, “TASMACలో డిప్యుటి తహసిల్దార్ గా చేస్తున్నాను” అని చెప్పాను. ఆందోళనతో చమటలు పడుతున్నాయి. కాని స్వామివారి నా ఉద్యోగం గురించి ఎక్కువగా అడగలేదు. బ్రతుకుజీవుడా అని కూర్చున్నాను. తరువాత మా అన్నయ్యని అడిగారు. అతను లేచి స్వామివారికి తాను అసిస్టెంట్ కలెక్టరుగా ఉచిత విద్య, బలహీన వర్గాలవారికి ఆహారము, ఉపాధి కల్పన, అర్హులకు కుట్టుమిషన్లు, ఇస్త్రీపెట్టెల పంపిణీ వంటివి చేస్తుంటాను అని చెప్పాడు. అది విన్నతరువాత స్వామివారు ఇలా చెప్పారు, “ఇక్కడ ఉన్నవారిలో ప్రజలకు మేలుచేసే రెవెన్యూ అధికారి, సహాయ తహసిల్దార్, సహాయ కలెక్టరు వంటివారు ఉన్నారు. మనకు ఇంకేం కావాలి?” అని ఒక ఆకర్షణీయమైన నవ్వు నవ్వారు. కాని నాకు మరలా స్వామివారి కళ్ళు నాపై పడొచ్చు అని గుండెదడగా ఉంది. ప్రజలకు హానిచేసే నా ఉద్యోగం గురించి స్వామివారికి ఎలా చెప్పగలను? నా మనసులోనే స్వామివారిని వేడుకున్నాను, “స్వామి గత మూడేళ్ళుగా నేను ఈ అధికారంలో ఉన్నాను. నాకు ఇక ఉండాలని లేదు. నాకు ఈ పనినుండి విముక్తి కల్పించండి”. కరుణావరుణాలయులైన మహాస్వామివారు నా ఉద్యోగం గురించి అడిగి నన్ను ఇబ్బందికి గురి చెయ్యలేదు. ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల్లోనే అక్కడి నుండి బదిలీ అయ్యి కలెక్టర్ కార్యాలయంలో డిప్యుటి తహసిల్దార్ గా చేరాను. బదిలీ ఉత్తర్వులు ఇచ్చినది ప్రభుత్వమే అయినా, అవి వచ్చేలా చేసినది మాత్రం స్వామివారే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
Back

🌷🙏కాలసర్ప దోషం తొలగడానికి మనసా దేవి స్త్రోత్రం🙏🌷 🔥మానసాదేవి ద్వాదశనామస్తొత్రమ్🔥 ఈ శ్లోకం ఎవరు రోజు చదువుతారో వారికి సర్ప భయం ఉండదు . కాలసర్ప దోషం భాధించదు . 🙏శ్లోకం🙏 జరత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగినీ వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా జరత్కారుప్రియా ఆస్తీకమాతా విషహరేతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా ద్వాదశైతాని నామాని పుజాకాలేతు యఃపఠేత్ తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ 🔱మానసాదేవిమంత్రం🔱 " ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహా" 🌷మానసాదేవి చరిత్ర 🌷 మానసా దేవి వాసుకి చెల్లెలు . వాసుకి జనమేజయుడు చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణిస్తునపుడు, మానసాదేవిని తన కుమారుడైన అస్తీకుని తో చెప్పి నాగజాతిని కాపాడమని కోరతాడు .మానసా దేవి ఆదేశానుసారం అస్తీకుడు ఆ యాగాన్ని ఆపి సర్పజాతిని కాపాడతాడు .వారు అస్తీకుడు కృతజ్ఞతలు తెలుపుతారు.అప్పుడు అస్తీకుడు వాసుకి తొ నేను నా తల్లి తపస్సు వల్ల ,అశీస్సులువల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు . అప్పుడు ఇంద్రుడు అది నిజమని పలికి. అమ్మ జరత్కారు ! నీవు జగన్మాత అయిన లక్ష్మీదేవి అంస తో ఉదయించి ,పూర్వ జన్మలో మమహాతపస్సు చేశావు .హరిహరులు నీ తపస్సు కు సంతోషించి "సిథేశ్వరి" గా నీకు వరములు ప్రసాదించారు .ఆనాడు దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు.నన్ను కూడా నీవు రక్షించావు . నీ భర్త అయిన జరత్కారు మునీశ్వరుడిని (ఆయనలో నారాయణ అంశ వున్నది) యంతో భక్తితో సేవించి ఈ అస్తీకుడిని వరప్రసాదంగా కన్నావు .దేవతలయందు ఆర్తుల యందు,ధర్మరక్షనయందు మనసు పెట్టినమాతగా నిన్ను "మానసాదేవి " అని పిలిచేవారము .ఆ పేరు ఇప్పుడు కూడా సార్ధకమైనది. ఆపదలోవున్న నాగజతిని కాపాడి నాగపూజ్యవే కాదు లోకపూజ్యవు కూడా అయినావు. ఈ నాటినుండి నిన్ను పూజించేవారు సమస్త కామ్యములను పొందుతారు .నీ నామములను ఎవరు పఠిస్తారో వారికి సర్ప భయం వుండదు అంటూ లొకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్తుతించాడు . నాగ ప్రముఖులందరూ మానసాదేవిని భక్తితో పూజించారు.గంగాతీరంలోని "మాయాపురి" దగ్గర వున్న కొండపైన అస్తీకుని ఆశ్రమంలో మానసాదేవి అందరిచేత పూజలు అందుకుంటుున్నది. ఈ గుడి హరిద్వార్ దగ్గర వుంది . 🌷శ్రీ మాత్రే నమః🌷శ్రీగురు పరదేవతాయై నమ:
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

అలాటి చిరునవ్వును నేనెన్నడూ చూడలేదు పార్ట్ 1 హిందూమతంలో అధికారపదవిలో వున్న ఒక మతాచార్యుణ్ణి కలుసుకోవాలన్న ఆరాటం నాకుంది. వారిని కలుసుకుని హిందువుల సనాతనదృష్టి యెలా వుంటుందో తెలుసుకోవాలి. కాని హిందూమతంలో లెక్కలేనన్ని శాఖలున్నాయి. క్రైస్తవ మతంలో వునటు దానికొక గురుపీఠమంటూ లేదు. కొంతవరకు క్రైస్తవుల గురుపీఠంలాంటివని చెప్పదగినవి అయిదు శంకరచార్య కేంద్రాలున్నాయని తెలిసింది. అవి ప్రముఖమైన ఒక హిందూ మత శాఖకు సంబంధించినవి. దాని అధిపతులు జగద్గురు శంకరాచార్యస్వామి నుండి పరంపరగా వస్తున్నవారు. శంకరాచార్యులు ఎనిమిదో శతాబ్దంలో పుట్టిన ఒక గొప్ప మత సంస్కర్త వారు విగ్రహారాధానను ఖండించారు. సర్వదేవతల అభేదాన్ని చాటి చెప్పారు. సనాతనమైన హిందూ శాఖలకు ఒక ఐక్యరూపాన్నివ్వటం కోసం ప్రయత్నించార్. వారి తర్వాత వచ్చిన ఆచార్యులందరూ తమ వారసుల్ని తామే నియమించారు. ఈ తరంలో కంచికామకోటి పీఠాధిపతులకున్నంత ఆధ్యాత్మికమైన అధికారం మరే పీఠాధిపతికీ లేదు. వారు రెండు హిందూశాఖలను - అంతవరకూ ఒకదానితో విభేదించిన వాటిని - ఏకం చేయగలిగారు. ప్రస్తుతం దక్షిణభారతదేశంలో కనబడి ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కేవలం వారి వల్లనే కలిగింది. వారెంతో పవిత్రులనీ జ్ఞానమార్గంలో చాలా దూరం పయనించారని విన్నాను. నేను దర్శించినప్పుడు వారి మద్రాసుకు సమీపంలోనే వున్నారు. మా సమావేశాన్ని ఏర్పాటు చేసినవారు ప్రొఫెసర్ రాఘవన్. వారు మద్రాసు విశ్వవిద్యాలయంలో సంస్కృతశాఖాధ్యక్షులు. వారు రచించిన 'భారతీయ వారసత్వం’ అనే గ్రంథాన్ని భారతదేశాధ్యక్షుల పీఠికతో ఐక్యరాజ్యసమితికి చెందిన విద్యాసాంస్కృతిక శాఖవారు ప్రచురించారు. ఆ గ్రంథం సంస్కృత వాజ్మయానికి సంబంధించిన పరమ ప్రామాణికమైన ఆధారగ్రంథం. ఆ గ్రంథంలోని వాక్యాలను తరువాతి అధ్యాయాల్లో చాలా పర్యాయాలు ప్రమాణాలుగా ఉగ్గడించాను రాఘవన్ ను విశ్వవిద్యాలయంలోనే మొదటిసారి కలిశాను. అప్పుడు వారు పాశ్చాత్యవేషంలో వున్నారు. తీరికలేని ఓ పెద్దమనిషి అతిథికి మర్యాద చేయటం కోసం ఎంత ఇబ్బంది పడతారో అంత ఇబ్బందీ నాకోసం పడ్డారు. రెండోసారి వారిని కలుసుకోవటం శంకరాచార్యులవారి దర్శనానికి వెళ్లేటప్పుడే. అప్పుడు వారు ధోవతిమాత్రం కట్టుకుని వున్నారు. చొక్కా వేసుకోలేదు. మద్రాసు వీధుల్లో ఎందరెందరో యాత్రికులూ, బిచ్చగాళ్లూ ధోవతి చుట్టుకునే కనబడతారు, కాని ఒక మధ్య వయస్కుడైన ప్రొఫెసర్ నడుందాకా దిగంబరంగా వుండి ఓ ఖరీదైన కార్లో మెత్తటి సౌకర్యాలమీద వాలి కూర్చున్న దృశ్యం నా కెందుకో అసాధారణమనిపించింది. “ఇలాటి వారే మా యిద్దరికి ఒక మిత్రులున్నారు. వారిమీదా మీ మీదా శంకరాచార్యులవారి ప్రభావం ఏమైనా పడిందా?” అని రాఘవన్ నడిగాను. “మాలో ఏదైనా గుణముంటే అది స్వామివారివల్ల సంక్రమించిందే. దోషాలన్నీ మావి” అన్నారు వారు. మద్రాసు పరిసరాల్లో ఓ వీథిమూల చీకట్లో కారాపి, చెప్పులు వదిలి క్రిందికి దిగాము. దిగంగానే ఓ మధ్య వయస్కుడైన పెద్దమనిషి మమ్మల్ని పలకరించారు. వారు మద్రాసులో ఓ ప్రచురణకర్తట, రాఘవన్ పరిచయం చేశారు. ఆ ప్రచురణకర్త "ప్రతిసాయంకాలం ఆరు నుండి పదకొండు గంటలదాకా స్వామివారిని కనుపెట్టుకుని వుంటున్నా”నని చెప్పారు. ఆ వీథిలో దేవాలయం ప్రక్కనవున్న ఓ పాడుబడ్డ చిన్న యింట్లో అడుగుపెట్టగానే యెదురుగా మసక చీకట్లో ఓ యిరుకు వరండా కనిపించింది. దాని కడ్డంగా పురాతనమైన ఓ పల్లకీ వుంది. పల్లకీకి తెల్లరంగువేశారు. ముందూ వెనకా బోయీలు మోసేగట్టి గుంజలకు మాత్రం నల్లరంగు. ఆ వరండాలోంచి ఓ చిన్నగదిలోకి ద్వారముంది. అది జైలుగది లాంటిది. అందులో అంతకు ముందే కొందరొక చాపమీద కూర్చున్నారు. వారితో పాటు మేమూ కూర్చున్నాము. గుసగుసలాడినట్లేదో మాట్లాడి, కొన్ని నిమిషాలయాక ఓ యువకుడు పల్లకీ దగ్గరకు వెళ్లి వంగి ఎవరితోనో ఏదో మాట్లాడాడు. ఏ ఆకారమూలేని మోపు మీద కప్పినట్లున్న యిటుక రంగు కంబళి పైకీ కిందకీ కదలి పల్లకీలోంచి స్వామివారు మెల్లగా లేచారు. లేస్తూనే కంబళి తలమీద, ఒంటినిండా కప్పుకున్నారు. వారు పొడగరే. సన్నగా వున్నా చిక్కిపోయినట్లు లేరు. మత్తు వదలక తడబడుతూ పల్లకీ సందుగా లోపలికి వచ్చినా ముందు చాపమీద బాసికపట్టు వేసుకు కూర్చున్నారు. వెంటనే గదిలోవున్న వారందరూ బయటికి వెళ్లారు. వెళ్లినా ద్వారం పక్కనే నిలబడి అప్పుడప్పుడూ తొంగిచూస్తూ చెవులప్పగించి వింటున్నారు. మద్రాసులోని వివేకానంద కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసరొకరు మామధ్య 'దుబాసి'గా వ్యవహరించారు. ఓ అరనిమిషం సేపు స్వామివారేం మాట్లాడలేదు. ఆ అరనిమిషమూ సాయం ముఖాన్ని పరిశీలనగా గమనించాను. కఠోరమైన ఆధ్యాత్మిక సాధనమూలంగా వారి ముఖకవళికలు చాలామట్టుకు పోయి అవసరమయినవే మిగిలాయి. ఉన్నవాటిలో ప్రముఖంగా కనబడేది తెల్లని కురుచ వెంట్రుకల క్రింద ఎత్తైన అర్ధగోళంలా వున్న వారి నుదురు. రెండోది వారి కళ్లు. అవి లోతుగా మెత్తటి చీకటి నీడలు పరుస్తూ కపాలం క్రింద నుంచి గ్రుచ్చి చూస్తున్నట్లున్నాయి. వారి పెదవులు తీర్చినట్లుండి పెరిగిన గడ్డం మధ్య ఆచితూచి మాట్లాడే ప్రతి మాటకూ దృఢంగా భావబంధురంగా కదలుతున్నాయి. వారు నిద్రావస్థలో నుండో సమాధిస్థితి నుండో మెల్లగా బయటకు వస్తున్నట్లని
Back

షట్పదీ స్తోత్రం

ఆది శంకరుల ' షట్పదీ స్తోత్రం ' నకు శ్రీ శ్రీ కంచి పరమాచార్య స్వామివారు ఇచ్చిన వివరణలో కొన్ని మధురవాక్కులు ( 6 ) : 1 వ శ్లోకం : అవినయ మపనయ విష్ణో దమన మన: శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత: 2. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే. 3. సత్యపి భేదాపగమే నాధ ! తవాహం నమామకీనస్త్వం సాముద్రోహి తరంగ: క్వచన సముద్రోన తారంగ: 4. ఉధృతనగ ! నగభిదనుజ దనుజకులామిత్ర! మిత్రశశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కార: ( నిన్నటి దాని కొనసాగింపు ) దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కార: ఇక్కడ ' భవతి ' ని చమత్కారంగా శంకరులు నాలుగుసార్లు వాడారు. దృష్టే భవతి భవతి - నీలో స్త్రీలింగమైతే భవతి. కానీ ఇక్కడ అగుచున్నది అని క్రియా రూపం లో వాడాలి. ప్రభవతి భవతి దృష్టే = మా దృష్టి నీ యందు, జగత్పాలకుడైన నీయందు౦చగా. అలా వుంచడం వలన నీవేమి పొందుతావు ? భవ తిరస్కార: తిరస్కారమనగా దాచుట. భవం అనగా సంసారం. భవ తిరస్కరణ అనగా సంసార బంధాన్ని పోగొట్టి అని అర్ధం. నభవతికిమ్ ? నీ దర్శనం లభి౦పగా ఎందుకు అదృశ్యం కాదు ? అని ప్రశ్న రూపంలో శంకరులు అడుగుతున్నారు. భగవద్గీత లో (2.59) పరమాత్మ దర్శనమైన వెనుక నీ మనస్సులో వున్న అనేకవాసనలు లేదా సంస్కారాలు మటుమాయమౌతాయని అన్నారుకదా ! దానితో బాటు సంసారమూ అదృశ్యమౌతుందని అర్ధం. అంటే జగత్తు మాయమైపోదు. నీకు దానిమీద అనురక్తి వుండదు. జీవన్మరణ ప్రవాహంలో చిక్కుకొనడం వుండదు. నభవతి కిం తిరస్కార: 5.మత్స్యాదిభిరవతారైరవ తారవతా సదా వసుధాం పరమేశ్వర ! పరిపాల్యో భవతా భవతాప భీతొ>హం. సాధారణంగా ఈశ్వర, పరమేశ్వర శబ్దాలు శివుడిని సూచిస్తాయి. కానీ, శంకరులు అన్ని చోట్ల అద్వైతాన్ని చూస్త్తారు కాబట్టి, శివవిష్ణు భేదాన్ని చూడరు. వారి ప్రశ్నోత్తర మాలిక అనే గ్రంధం లో కూడా, ' కశ్చ భగవాన్ ? భగవంతుడెవరు ? అనే ప్రశ్నకు శంకర నారాయణాత్మిక రూప: ' అని సమాధానం. ఇక్కడ పరమేశ్వర శబ్దం విష్ణువుకు అన్వయించారు. ' నీచేత రక్షింపబడాలి. ' అన్నారు. వేద రక్షణమే లోకరక్షణం. వేదధ్వని నలుమూలలా వినిపించాలి. వేదయజ్ఞాల వలన దేవతలు తృప్తి చెందాలి. తద్వారా ప్రపంచరక్షణ కలుగుతుంది. ఎక్కడ వేదధర్మం క్షీణిస్తుందో, అక్కడ పతనం తప్పదు. అప్పుడు లోకపాలకుడైన విష్ణువు అవతరిస్తాడు. మరల వేదధర్మాన్ని ఉద్ధరిస్తాడు. అదేవిధంగా సోమకాసురుడు, హయగ్రీవుడు వంటి వారు, వేదాలను నీళ్ళలో దాచి వుంచితే, విష్ణువు మత్స్యావతారమెత్తి వేదాలను ఉద్ధరించాడు. దశావతారాలు భూమిపై అవతరించినవే. అవతారమనగా క్రిందిగి దిగివచ్చుట. పని పూర్తి అయిన వెంటనే వైకుంఠ౦ నకు చేరుట. అదే కదా విష్ణువు అవతార ప్రక్రియ. ఇలా ఎందుకు చేస్తాడు ?. మన మీద దయతోనే. మనలను ఉద్ధరించడానికే. అవతారవతా వతా-- అవ అనగా రక్షించుట. కీర్తనలలో మామవా అంటారు. అంటే మాం + అవ = నన్ను రక్షించు అని. అవతారవతా సదా వసుధాం = ఈ భూమిని ఎల్లప్పుడు అవతారములచే రక్షి౦చుట. వసు అనగా సంపదలు. భూమి అనేక సంపదలను ఇస్తుంది కాబట్టి వసుంధర. పరమేశ్వరా ! మత్శ్యాది అవతారాలనెత్తి ప్రపంచాన్ని రక్షిస్తున్నావు. నేను సంసారతాపం చే బాధ పడుతున్నాను. నన్ను రక్షించవయ్యా ! 6. దామోదర ! గుణమందిర ! సుందరవదనారవింద! గోవింద ! భవజలధి మధన మందర మపనయత్వంమే. దామోదర, గోవింద, గుణ మందిర, సుందరవదనారవింద అనే పదాలు. శ్రీ కృష్ణస్వామి సంబోధనలే. ఇందు దామోదర గోవింద నామాలు ప్రసిద్ధం. శ్రీగురు పర దేవతాయై నమ:
Back

షట్పదీ స్తోత్రం

ఆది శంకరుల ' షట్పదీ స్తోత్రం ' నకు శ్రీ శ్రీ కంచి పరమాచార్య స్వామివారు ఇచ్చిన వివరణలో కొన్ని మధురవాక్కులు ( 6 ) : 1 వ శ్లోకం : అవినయ మపనయ విష్ణో దమన మన: శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత: 2. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేదచ్చిదే వందే. 3. సత్యపి భేదాపగమే నాధ ! తవాహం నమామకీనస్త్వం సాముద్రోహి తరంగ: క్వచన సముద్రోన తారంగ: 4. ఉధృతనగ ! నగభిదనుజ దనుజకులామిత్ర! మిత్రశశిదృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కార: ( నిన్నటి దాని కొనసాగింపు ) దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కార: ఇక్కడ ' భవతి ' ని చమత్కారంగా శంకరులు నాలుగుసార్లు వాడారు. దృష్టే భవతి భవతి - నీలో స్త్రీలింగమైతే భవతి. కానీ ఇక్కడ అగుచున్నది అని క్రియా రూపం లో వాడాలి. ప్రభవతి భవతి దృష్టే = మా దృష్టి నీ యందు, జగత్పాలకుడైన నీయందు౦చగా. అలా వుంచడం వలన నీవేమి పొందుతావు ? భవ తిరస్కార: తిరస్కారమనగా దాచుట. భవం అనగా సంసారం. భవ తిరస్కరణ అనగా సంసార బంధాన్ని పోగొట్టి అని అర్ధం. నభవతికిమ్ ? నీ దర్శనం లభి౦పగా ఎందుకు అదృశ్యం కాదు ? అని ప్రశ్న రూపంలో శంకరులు అడుగుతున్నారు. భగవద్గీత లో (2.59) పరమాత్మ దర్శనమైన వెనుక నీ మనస్సులో వున్న అనేకవాసనలు లేదా సంస్కారాలు మటుమాయమౌతాయని అన్నారుకదా ! దానితో బాటు సంసారమూ అదృశ్యమౌతుందని అర్ధం. అంటే జగత్తు మాయమైపోదు. నీకు దానిమీద అనురక్తి వుండదు. జీవన్మరణ ప్రవాహంలో చిక్కుకొనడం వుండదు. నభవతి కిం తిరస్కార: 5.మత్స్యాదిభిరవతారైరవ తారవతా సదా వసుధాం పరమేశ్వర ! పరిపాల్యో భవతా భవతాప భీతొ>హం. సాధారణంగా ఈశ్వర, పరమేశ్వర శబ్దాలు శివుడిని సూచిస్తాయి. కానీ, శంకరులు అన్ని చోట్ల అద్వైతాన్ని చూస్త్తారు కాబట్టి, శివవిష్ణు భేదాన్ని చూడరు. వారి ప్రశ్నోత్తర మాలిక అనే గ్రంధం లో కూడా, ' కశ్చ భగవాన్ ? భగవంతుడెవరు ? అనే ప్రశ్నకు శంకర నారాయణాత్మిక రూప: ' అని సమాధానం. ఇక్కడ పరమేశ్వర శబ్దం విష్ణువుకు అన్వయించారు. ' నీచేత రక్షింపబడాలి. ' అన్నారు. వేద రక్షణమే లోకరక్షణం. వేదధ్వని నలుమూలలా వినిపించాలి. వేదయజ్ఞాల వలన దేవతలు తృప్తి చెందాలి. తద్వారా ప్రపంచరక్షణ కలుగుతుంది. ఎక్కడ వేదధర్మం క్షీణిస్తుందో, అక్కడ పతనం తప్పదు. అప్పుడు లోకపాలకుడైన విష్ణువు అవతరిస్తాడు. మరల వేదధర్మాన్ని ఉద్ధరిస్తాడు. అదేవిధంగా సోమకాసురుడు, హయగ్రీవుడు వంటి వారు, వేదాలను నీళ్ళలో దాచి వుంచితే, విష్ణువు మత్స్యావతారమెత్తి వేదాలను ఉద్ధరించాడు. దశావతారాలు భూమిపై అవతరించినవే. అవతారమనగా క్రిందిగి దిగివచ్చుట. పని పూర్తి అయిన వెంటనే వైకుంఠ౦ నకు చేరుట. అదే కదా విష్ణువు అవతార ప్రక్రియ. ఇలా ఎందుకు చేస్తాడు ?. మన మీద దయతోనే. మనలను ఉద్ధరించడానికే. అవతారవతా వతా-- అవ అనగా రక్షించుట. కీర్తనలలో మామవా అంటారు. అంటే మాం + అవ = నన్ను రక్షించు అని. అవతారవతా సదా వసుధాం = ఈ భూమిని ఎల్లప్పుడు అవతారములచే రక్షి౦చుట. వసు అనగా సంపదలు. భూమి అనేక సంపదలను ఇస్తుంది కాబట్టి వసుంధర. పరమేశ్వరా ! మత్శ్యాది అవతారాలనెత్తి ప్రపంచాన్ని రక్షిస్తున్నావు. నేను సంసారతాపం చే బాధ పడుతున్నాను. నన్ను రక్షించవయ్యా ! 6. దామోదర ! గుణమందిర ! సుందరవదనారవింద! గోవింద ! భవజలధి మధన మందర మపనయత్వంమే. దామోదర, గోవింద, గుణ మందిర, సుందరవదనారవింద అనే పదాలు. శ్రీ కృష్ణస్వామి సంబోధనలే. ఇందు దామోదర గోవింద నామాలు ప్రసిద్ధం. శ్రీగురు పర దేవతాయై నమ:
Back

మీరేం చేసినా ప్రేమతో చెయ్యండి పార్ట్ 1 1958, ఫిబ్రవరి 26 బుధవారంనాడు బ్రిటిష్ రచయిత సర్ పాల్ డ్యూక్స్, ఫ్రెంచి విద్వాంసుడు ఫిలిప్ లేవెస్టిన్ కలిసి కంచి కామకోటి పీఠాధిపతులు, శ్రీ చంద్రశేఖరయతీంద్ర శంకరాచార్యులవారిని దర్శించి సంభాషించారు. ఆ సంభాషణ గురించి మద్రాసు విశ్వవిద్యాలయంలోని తత్త్వశాస్త్రాచార్యులు శ్రీ టి.ఎం.పి. మహదేవన్ ఇచ్చిన వివరాలివి. వారి సమావేశం ఆనాటి రాత్రి తొమ్మిది గంటల కేర్పాటయింది. మద్రాసులోని త్యాగరాయనగర్ లో వున్న స్వామివారి విడిదికి సర్ పాల్ డ్యూక్స్ రాత్రి ఎనిమిదిన్నారకే వచ్చేశారు. ఆరు బయట వరుసగా వున్న తాటిచెట్ల క్రింద ఏర్పాటైన సమావేశస్థలానికి సర్ పాల్ డ్యూక్స్ నెవరో తీసుకువచ్చారు. దగ్గరొక గడ్డివామి వుంది. స్వామివారు కూర్చోటానికి మధ్య ఒక పీట వేశారు. ఆ పరిసరాలు డ్యూక్సును బాగా కదిలించాయి. తానెదురు చూస్తున్న సమావేశానికి ఇంతకన్నా కాల్పనికమైన వాతావరణాన్ని ఊహించలేనన్నారు వారు. అప్పుడే ఫ్రాన్స్ దేశస్థుడైన ఫిలిప్ లేవెస్టిన్ కూడా కొందరు భారతీయ మిత్రులతో కలసి అక్కడికి వచ్చారు. ఒక గొప్ప విద్వాంసుడూ, యోగీ అయిన మహనీయుణ్ణి కలుసుకోబోతున్నా మన్న సంభ్రమం వారిలో స్పష్టంగా కనిపించింది. తొమ్మిది గంటలు దాటి కొంత సేపయింది. ఉన్నట్లుండి టార్చిలైట్ వెలుతురు కనబడితే అందరం అటువైపు చూచి లేచినిలబడ్డాము. స్వామివారు మెల్లగా నడిచి వస్తున్నారు. నడకలో తాను నడుస్తున్నాననే స్పృహే లేదు. ఆ వింతనడక వారిదే. వెంటనే వస్తున్న అయిదారుగురు శిష్యులూ ఆగిపోయారు. స్వామివారు పీటమీద కూర్చుని అంతవరకూ లేచి నిలబడ్డవారిని కూర్చోండని సంజ్ఞ చేశారు. వచ్చిన అతిథులిద్దరూ స్వామివారికి సమీపంలో కూర్చున్నారు. సంభాషణకు రంగం సిద్ధమైంది. ముందుగా సర్ పాల్ డ్యూక్స్ పరిచయం జరిగింది. వారు "ది అనెండింగ్ క్వెస్ట్”, “యోగాఫర్ దివెస్టర్న్ వరల్డ్” అనే గ్రంథాలు రెండు వ్రాశారని పరిచయం చేసినవారన్నారు. "అంతంలేని అన్వేషణ” అని ఆ గ్రంథానికి పేరు పెట్టటంలో మీ ఉద్దేశ మేమి”టని స్వామివారు డ్యూక్స్ నడిగారు. "నా విషయమే చూడండి, నా అన్వేషణ యింకా పూర్తి కాలేదు. ఒకసామాన్య పాశ్చాత్యుడు చేసే అన్వేషణ ఏదో ఒక క్రైస్తవ శాఖను వరించటంతో ముగుస్తుంది. కాని అది నిజమైన అన్వేషణ కాదు” అని వారు సమాధానం చెప్పారు. స్వామివారు “మనం చేసే అన్వేషణ బాహ్యమైనదైతే దానికి అంతం వుండదు. దిగంతాన్ని అందుకోటానికి తీసే పరుగులాంటి దది. అది వట్టి భ్రాంతి, అంతే! కాని మన అన్వేషణ ఆంతరమైనదైతే అది ఆత్మ సాక్షాత్కారంతో ముగుస్తుంది. ఒక విధంగా అంతర్ముఖత్వానికి కూడా ముగింపు అనేది లేదేమో. దాని పరమార్థం అనంతం కాబట్టి” అన్నారు. తరువాత ఫ్రెంచిమేన్ పరిచయం జరిగింది. వారు రాచరిక వ్యవస్థను గురించి ప్రస్తుతం పరిశోధన సాగిస్తున్నారు. ఆ పరిశోధనలో భాగంగా మన దేవాలయాలూ, పురాణాలూ అధ్యయనం చేయటానికి ఈ దేశం వచ్చారు. లేవెస్టిన్ తనకున్న ముఖ్య సమస్య యేమిటో తానే చెప్పారు. “పూర్వకాలంలో రాచరికవ్యవస్థ ఆధిభౌతికానికీ, ఆధ్యాత్మికానికి ప్రతీకగా వుండేది. అందులో లౌకికానికీ అలౌకికానికీ భేదం లేదు. రెండూ కలిసే వుండేవి. ఇటీవల ఈ రెండూ విడిపోయాయి. అలా విడిపోయాకనే మనకష్టాలు మొదలయ్యాయేమో! దక్షిణ భారతదేశంలోని దేవాలయాల అధ్యయనం వల్ల లౌకిక భావనకూ, పరమార్థభావనకూ వున్న అవినాభావం మరింత రుజువెతుందేమో అని ఆశ” అన్నారు. “రాజా ధర్మస్య కారణమ్” (రాజే ధర్మానికి బాధ్యుడు) అనే సూక్తి విన్నారా?” అని స్వామివారు లేవెస్టిన్ ని అడిగారు. స్వామివారు ఆ సూక్తికి చేసిన వ్యాఖ్యానం సముజ్జ్వలమైంది. వారు దాన్ని వ్యాఖ్యానిస్తున్నప్పుడు అతిథులిద్దరూ స్వామివారికి మరింత దగ్గరగా జరిగి, చెవులప్పగించి విన్నారు. స్వామి తమిళంలో మాట్లాడుతూ ఎన్నో ఆంగ్ల పదాలు ద్విభాషి సౌకర్యం కోసమూ, అతిథుల అవగాహన కోసమూ ప్రయోగించారు. క్రింద కూర్చోటం అలవాటు లేక పాశ్చాత్యులిద్దరూ నానా అవస్థలు పడ్డారు. మాటిమాటికీ కాళ్లు మార్చుకోటం చూచి 'కాళ్లు కదిలించకండి', అన్నట్లు వారి మోకాళ్లు ద్విభాషి మెల్లగా తాకారు. అలా తాకటం స్వామివారు గమనించనే గమనించారు. “వారి నిష్టం వచ్చినట్లు కూర్చోనివ్వండి” అని ద్విభాషితో అన్నారు. “సామాన్య పాశ్చాత్యుడికి క్రింద కూర్చోటం - అందులో ఒకే పద్ధతిలో కూర్చోటం - చాలాకష్టం. వారెలా కూర్చున్నా రది కాదు ముఖ్యం. ఈ విషయంలో వారు పిల్లలు, వారికి ఆంక్ష లెందుకు?” అని కూడా అన్నారు. (సశేషం) అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

SrI rama diiksha

Gurugaru, This is the English Translation of your text. This can be put up in website. Sanatana Dhrama is the foundation on which our nation – India is built. The biggest strength of the Indian Society structure is the value systems that have been built across different cultures and traditions. The traditions of this country viz., Poojas, Vrathaas, Yagnas, festivals, Jaataras, Tirannallus, are designed for the benefit of the society. Sanatana Dharma believes in ‘Sarve jana sukhino bhavanthu’ which translates to along with me, at all points in time, let the entire world be happy. While there have been changes in the pace at which the world is moving, advancement of technology, changes in circumstances etc., the fundamental foundations of Dharma remain intact. It is important to practice Dharma instead of merely talking about it. Since the beginning of mankind, it is known to everyone that there are many Deekshas in Sanatana Dharma. The main objective of all the deekshas is to cleanse our minds, body and purify our souls. If we let our lives be dictated by the flow of events that we are not consciously aware, then we cannot protect ourselves. In these times and situations, deekshas will help in driving oneself and also the society in the path of Dharma. In addition to the spiritual ways, the art forms like Music and other art forms have been used and are being used as means to protect Dharma. We are all aware of the legend of how Samartha Ramadas has enlightened and motivated Chatrapati Shivaji to protect Dharma, and the songs of Bhakta Ramadas that led to building the temple for lord Srirama at Bhadrachalam. Tyagaraja has become a legend as a devotee of lord Sri Rama and got immersed in his worship. Sri Rama Deeksha is something that would be on these lines as a continuation of these legendary objective to protect Dharma. In today’s world, the responsibility as an individual themselves in the society, is to understand and protect the values of the society. Lord Sri Rama is an ideal personality to lead oneself on the righteous path. The Sri Rama Deeksha is intended to lead us into taking responsibility of ourselves and leading a virtuous way of life and also for reestablishing Dharama (Dharma Sthapana). Sri Mahavidyapeetham humbly joins hands with Dharmajagaran Society, which is already actively involved in this effort, is going to take up this activity as a ‘Yagna’. For any queries questions related to how to take up this Deeksha, the process, the guidelines and other details, please reach us on the contact details provided in the website.
Back

Gurugaru, This is the English Translation of your text. This can be put up in website. Sanatana Dhrama is the foundation on which our nation – India is built. The biggest strength of the Indian Society structure is the value systems that have been built across different cultures and traditions. The traditions of this country viz., Poojas, Vrathaas, Yagnas, festivals, Jaataras, Tirannallus, are designed for the benefit of the society. Sanatana Dharma believes in ‘Sarve jana sukhino bhavanthu’ which translates to along with me, at all points in time, let the entire world be happy. While there have been changes in the pace at which the world is moving, advancement of technology, changes in circumstances etc., the fundamental foundations of Dharma remain intact. It is important to practice Dharma instead of merely talking about it. Since the beginning of mankind, it is known to everyone that there are many Deekshas in Sanatana Dharma. The main objective of all the deekshas is to cleanse our minds, body and purify our souls. If we let our lives be dictated by the flow of events that we are not consciously aware, then we cannot protect ourselves. In these times and situations, deekshas will help in driving oneself and also the society in the path of Dharma. In addition to the spiritual ways, the art forms like Music and other art forms have been used and are being used as means to protect Dharma. We are all aware of the legend of how Samartha Ramadas has enlightened and motivated Chatrapati Shivaji to protect Dharma, and the songs of Bhakta Ramadas that led to building the temple for lord Srirama at Bhadrachalam. Tyagaraja has become a legend as a devotee of lord Sri Rama and got immersed in his worship. Sri Rama Deeksha is something that would be on these lines as a continuation of these legendary objective to protect Dharma. In today’s world, the responsibility as an individual themselves in the society, is to understand and protect the values of the society. Lord Sri Rama is an ideal personality to lead oneself on the righteous path. The Sri Rama Deeksha is intended to lead us into taking responsibility of ourselves and leading a virtuous way of life and also for reestablishing Dharama (Dharma Sthapana). Sri Mahavidyapeetham humbly joins hands with Dharmajagaran Society, which is already actively involved in this effort, is going to take up this activity as a ‘Yagna’. For any queries questions related to how to take up this Deeksha, the process, the guidelines and other details, please reach us on the contact details provided in the website.
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

తొందరలేదు మీరు కోరింది దొరుకుతుంది పార్ట్ 1 రహదారి కిరువైపులా బారులు బారులుగా నిలిచిన తాటిచెట్ల మధ్య ప్రయాణించి చెంగల్పట్టు చేరుకున్నాము. వెల్ల వేసిన తెల్లటి యిళ్లు చిక్కుబడ్డట్లు గుట్టగా పడివున్నాయి. పై కప్పులు ఎర్రగా అబందరగా కనిపించాయి. కారు దిగి యిరుకు సందుల గుండా నడిచి ఊరి మధ్యకు వచ్చాము. అక్కడ చాలామంది జనం గుంపులు గుంపులుగా వున్నారు. ఆ యింటి గుమ్మం గుండా లోపలికి గదిలోకి ప్రవేశించాము. దూరాన మసక వెలుతురులో నీడన ఓ కురచ వ్యక్తి నిలబడి వున్నారు. వారి దగ్గరకు వెళ్లి చిన్న కానుకొకటి సమర్పించి, వంగి నమస్కరించాను. అలా వంగి నమస్కరించటంలో వున్న మర్యాద, గౌరవం అలా వుంచి ఆపని చాలా కళాత్మకంగా కనబడుతుంది నాకు. అలా నమస్కరించటం నా కెంతో యిష్టం. శంకరాచార్యులవారు "పోప్” లాంటివారు కారని నాకు తెలుసు. హిందూమతంలో “పోప్” లుండరు. కాని వారు హిందూమతంలోని ఓ శాఖకు ఆధ్యాత్మిక గురువులు. వారివల్ల అసంఖ్యాకులు ఉత్తేజం పొందుతున్నారు. దక్షిణభారతమంతా వారి పారమార్థిక సంరక్షణలో వుంది. సడి చేయకుండా వారి వంకే చూస్తున్నాను. కురచగా వున్న ఆవ్యక్తి యతిలా కాషాయాంబరాలు ధరించి వున్నారు. చేతిలోని సన్న్యాసదండం మీద కొంచెం ఒరిగి వున్నారు. నేను విన్నది, వారికి నలభైయేళ్లకు తక్కువే అని. జుట్టు అప్పుడే నెరిసినందు కాశ్చర్యపోయాను. నా స్మృతి మందిరంలోని కుడ్యాలకు వ్రేలాడే అనేకానేక వర్ణచిత్రాల్లో పలిత శ్యామశబలమైన వారి సముదాత్త ముఖచిత్రానికి ఓ ప్రత్యేకమైన గౌరవస్థానం వుంది. ఫ్రెంచివారు "ఆధ్యాత్మికత" అని పేర్కొనే ఓ అనిర్వచనీయమైన లక్షణం వారి ముఖంలో స్పష్టంగా కనబడుతుంది. అందులో ప్రసన్నత వుంది. అమాయికత వుంది. వారి విశాలమైన నేత్రాలు నిశ్చలంగా, అందంగా, ఆకర్షకంగా వున్నాయి. వారి ముక్కు పొట్టిగా, నిటారుగా, కోటేరువేసినట్లుంది. గడ్డం చిందరవందరగా పెరిగినా పెదవులు మాత్రం గంభీరంగా వున్నాయి. అలాంటి ముఖకవళికలు వారి బుద్ధిబలం మినహా - మధ్యయుగాల క్రైస్తవమతాచారుల కుండేవేమో మరి! లౌకిక దృష్టితో చూచే పాశ్చాత్యులకు వారి నేత్రాలు స్వాప్నిక నేత్రాలనిపించవచ్చు కాని వారి బరువైన కనురెప్పల క్రింద వట్టి స్వప్నాలు మాత్రమే వున్నాయని నా కనిపించలేదు. ఎందు కనిపించలేదో నిర్ధారణగా చెప్పలేను. మా సంభాషణలో ఉపోద్ఘాతభాగాన్ని చాలా క్లుప్తంగా చెప్పేస్తాను. అది నన్ను గురించి. హైందవమతాచార్యుల విషయమందులో లేదు. భారత పర్యటనలో వ్యక్తిగతంగా నాకు కలిగిన అనుభవాలను గురించి అడిగారు. ఒక విదేశీయునికి ఇక్కడి ప్రజలనూ, సంస్థలనూ గమనించినప్పుడెలా అనిపిసుందో తెలుసుకోవాలని వారి కభిలాష. నా అభిప్రాయాలు మాత్రం నిర్మొహమాటంగా, మెప్పుతో విమర్శను జోడించి, చాలా ధారాళంగా చెప్పేశాను. మా సంభాషణ సాగిసాగి విశాలమైన పరిధిలోకి వెళ్లిపోయింది. అప్పుడుగాని నాకు తెలియలేదు, స్వామివారు ప్రతిదినమూ ఇంగ్లీషు పత్రికలు చదువుతారనీ, ప్రపంచంలో ఏమూల ఏం జరుగుతోందో గమనిస్తారనీ. వెస్ట్ మిన్ట్సర్‌లో ఇటీవల జరిగిన గొడవలన్నీ వారికి తెలుసు. యూరప్ ఖండంలో బాలారిష్టాలు గడవటానికి ప్రజాస్వామ్యం ఎలా విలవిల్లాడి పోతోందో కూడా వారికి తెలుసు. శంకరాచార్యస్వాములకు భవిష్యదర్శనం వుందని వేంకటరమణి చెప్పటం గుర్తొచ్చింది. ప్రపంచ భవితవ్యాన్ని గురించి స్వామి నడిగాను. "అంతటా ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఎప్పుడు మెరుగౌతాయని తోస్తుంది మీకు?” అని ప్రశ్నించాను. “ఇప్పుడప్పుడే మెరుగుకావటం సాధ్యం కాదు. పరిస్థితులు మారటానికి కొంతకాలం పడుతుంది. దేశాలన్నీ మారణాయుధాల ఉత్పత్తిలో నిమగ్నమై వుంటే ప్రపంచ మెలా బాగుపడుతుంది?" అన్నారు వారు. “నిరాయుధీకరణ గురించిన మాట లిటీవల వినబడుతున్నాయి. అది జరుగుతుందంటారా?” అని, అడిగాను. “యుద్ధనౌకలు రద్దు చేయటంవల్లా, తుపాకులు మూల పడేయటం వల్లా యుద్ధాలాగవు. కర్రలతోనైనా మనుష్యులు కొట్టుకొంటూనే వుంటారు” అన్నారు వారు. “అయితే మరేం చెయ్యాలి?” అని అడిగాను. "జాతికీ జాతికీ మధ్య, ఉన్నవారికీ లేనివారికీ మధ్య, ఆధ్యాత్మికమైన అవసరం ఏర్పడితేతప్ప, సౌహార్దం, శాంతి, అభ్యుదయం సాధ్యం కావు" అని సమాధానం చెప్పారు. “ఇది అయేపనిగా కనబడటం లేదు. కాబట్టి ఆశారేఖ శూన్యమున్నమాట” అన్నాను. తన సన్న్యాసదండం మీద మరింత ఒరిగి “అయితే భగవంతుడొక డింకావున్నా” డన్నారు. “ఉంటే ఆయన కివేం పట్టినట్లు లేదు” అన్నాను ధైర్యంగా, “ఆయన కరుణామయుడు, మానవజాతిపట్ల కరుణ తప్ప ఆయనకు మరే భావం లేదు.” "ప్రపంచంలో ప్రస్తుతం వున్న అధ్వాన్న పరిస్థితినీ, ప్రజల దీనదారుణ జీవితాన్ని బట్టి చూస్తే భగవంతుడికి మానవుల పట్ల క్రూరమైన నిర్లక్ష్య వైఖరే తప్ప ఉదారమైన కరుణావైఖరి వున్నట్లు నాకు తోచడం లేదు” అనేశాను. నా గొంతులో వున్న కరకుదనం, కసి, చేదు, నన్నే ఆశ్చర్యపరిచాయి. వారు నావంక వింతగా చూచారు. నా తొందరపాటుకు నేనే సిగ్గుపడ్డాను. “ఓర్పు కలవారు లోతుగా ఆలోచిస్తారు. సమయం వచ్చినప్పుడు భగవంతుడు మానవోపకరణా లుపయోగించి పరిస్థితులు చక్కదిద్దుతాడు. జాతుల మధ్య యేర్పడిన సంక్షోభం చూచి, కొందరిలో కనబడుతున్న భయంకర నైతిక పతనం చూచి, ప్రజలనుభవిస్తున్న దారుణ బాధలు చూ
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

యత్ర యత్ర వేద పారాయణం మహాస్వామి వారు ఆరోజుల్లో కంచిలో బసచేసివున్నారు.మధ్యాహ్నపు పూజ ముగించుకుని తీర్ధ ప్రసాదాలు ఇచ్చే సమయం.కుంభకోణం సమీపంలోవున్న తిరువిడైమరుదూరు మహాలింగస్వామికి చైత్రపౌర్ణమినాడు11 మంది ఘనపాఠీలతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించి ప్రసాదం శ్రీవారికి సమర్పించాలని ఉత్సుకతతో ఒక సంపన్నుడైన మిరాశీదారు(భూస్వామి) ఒకరు వరుసలో వేచివున్నారు. మహాలింగ స్వామి ప్రసాదాన్ని కొత్తపట్టుగుడ్డలోచుట్టి తీసుకొనివచ్చాడాయన. ఆరోజు భక్తజన సమ్మర్ధం ఎక్కువగావుంది.మిరాశీదారు వంతు వచ్చింది.మహాస్వామివారియందు అమితమైన భక్తితాత్పర్యములు కలవాడాయన.స్వామివారిని చూస్తూనే భక్తితో వణికిపోతూ సాష్టాంగ నమస్కారంచేశాడు. స్వామివారు కనుబొమలెత్తి వారిని చూసి "ఏమి సమాచారం" అన్నారు, ఆయన తడబడుతూ ప్రసాదాలను విప్పి వెదురు తట్టలో విభూతి, చందనము,కుంకుమ, బిల్వపత్రములు,కొబ్బరిచెక్కలు విడివిడిగా వుంచి స్వామి వారికి సమర్పించాడు.ప్రసాదమనగానే ముందుకు వంగి గ్రహించే స్వామి "ఏ క్షేత్రానిది ఈ ప్రసాదం?" అని ప్రశ్నించారు. స్వామీ!తిరువిడై మరుదూరు మహాలింగ స్వామికి నిన్న రుద్రాభిషేకం చేయించాను, స్వామివారి అనుగ్రహం కోసం ప్రసాదం సమర్పిస్తున్నాను అన్నాడు మిరాశీ దారు. స్వామివారు ప్రసాదాలున్న తట్టవైపు పరీక్షగాచూసి "నీవే ఎంతో స్థితి పరుడవు కదా! రుద్రాభిషేకానికి చందాలుకూడా పోగు చేశావా?"అన్నారు. లేదుస్వామి! మొత్తంఖర్చు నేనే భరించాను, అన్నాడు నేనే అన్న పదాన్ని వత్తుతూ. రుద్రభిషేకం లోకక్షేమంకోసం జరిపించావా?అన్నారు స్వామివారు. రెండు మూడుసంవత్సరాలుగా పంటలు సరిగా పండటంలేదు, జ్యోతిష్కులు చైత్ర పౌర్ణమి నాడు అభిషేకం జరిపిస్తే ఫలసాయం ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పారు. అందుకు చేయించాను అన్నాడు మిరాశీదారు.అయితే నువ్వు ఆత్మార్ధంగానో,లోకక్షేమార్ధమో కాక ఒక కామ్యాన్ని ఆశించి చేశావన్న మాట", అంటూ ప్రసాదాన్ని గ్రహించకుండానే కనులు మూసుకుని ధ్యానంలో పడిపోయారు స్వామివారు. కొన్ని నిమిషాల తరువాత కనులు తెరిచిన వారినిచూస్తే జరిగిందేమిటో అవగతమైనట్లు తెలుస్తుంది. "సరే,ఎంతమంది వేదపండితులు వచ్చారు?" అన్నారు స్వామి.మిరాశీదారు "11 మంది" అన్నాడు. "నీవే నిర్వహించావుకదా! వారెవరు?ఏగ్రామానికి చెందినవారు?" అన్నారు స్వామి. అక్కడున్న భక్తులకు స్వామివారు ఎందుకలా తరచి తరచి ప్రశ్నలు వేస్తున్నారో అర్ధం కాలేదు.మిరాశి దారు కాగితం చూచి పేర్లు చెప్పడం మొదలుపెట్టాడు. "ఓహో!అందరూ మహా పండితులు. నీ జాబితాలో తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారు వున్నారేమో చూడు". అన్నారు. మిరాశీదారుకు సంతోషంవేసింది. స్వామివారు చెప్పిన ఘనపాఠి గారుకూడా రుద్ర జపంలో పాల్గొన్నారు. "భేష్! భేష్! -వేంకటేశ ఘనాపాఠి గారుకూడావున్నారన్నమాట.మంచిది. ఆయన చాలా పెద్దవిద్వాంసులు. మంచి వేద పండితులు. పెద్దవారయి పోయారు.రుద్ర జపం ఎంతో కష్టంమీద చేసి వుంటారు." స్వామివారి ఈ మాటలతో బలంపుంజుకున్న మిరాశీదారు "మీరు సరిగ్గా చెప్పారు స్వామీ! ఎక్కువ భాగం ఆయన పారాయణ చెయ్యకుండా కనులు మూసుకుని కూచుంటారు. దాని మూలంగా సంఖ్య తగ్గిపోతోంది.ఎందుకు పిలిచానా అనుకున్నాను".అన్నాడు. స్వామివారి కనులలో ఉవ్వెత్తున తీవ్రత కనిపించింది. "మనదగ్గర ఏదో కొంచెం డబ్బు ఉంది కదాఅని ఎలాగయినా మాట్లాడవచ్చు అనుకోకూడదు. నీకు తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారి అర్హతలేమిటో తెలుసా? అతని చరణ ధూళికి సరితూగవు నీవు. ఆయనను అలా ఎలా అనగలిగావు నీవు. నిన్న ఏమి జరిగిందో నాకు ఇప్పుడు అర్ధమయింది. ఆయనలా కళ్ళు మూసుకు కూర్చున్నప్పుడు నీవు దగ్గరకు వెళ్ళి తీసుకున్న డబ్బుకు గట్టిగా వళ్ళు దాచుకోకుండా పారాయణం చెయ్యకుండా నోరు మూసుకుని కూరుచుంటే ఎలా? అని అన్నావా లేదా చెప్పు" అన్నారు తీక్షణంగా! ప్రదేశమంతా చీమ చిటుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దంగా అయిపోయింది. భక్తులందరూ నిశ్చేష్టులయి పోయారు.క్షణంవరకు సాధారణంగా మాట్లాడుతున్న మిరాశీదారు గడగడ వణికి కాళ్ళబలం చాలక మోకాళ్ళమీద ముందుకు పడి బలవంతంగా లేచి నుంచున్నాడు.కన్నులనుండి నీరు జలజల స్రవిస్తుండగా నోటీమీద చేయి అడ్డు పెట్టుకుని, "నాది తప్పే! స్వామీ!దయచేసి క్షమించండి. ఘనపాఠి గారి తో సరిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన మాట్లే అన్నాను. క్షమించండి స్వామీ!క్షమించండి" అంటూ ప్రాధేయపడ్డాడు. ఆగు! అంతటితో ఆపలేదు.ఇంకాఉంది. నువ్వు పండితులందరికి దక్షిణఇచ్చావా? ఎంత ఇచ్చావు?"అన్నరు. "ఒక్కక్కరికీ 10 రూపాయలు ఇచ్చాను" నాకంతా తెలుసు. మళ్ళీ చెప్పు.అందరికీ 10 రూపాయల చొప్పున ఇచ్చావా?" రెట్టించారు స్వామివారు.మిరాశీదారు మౌనంగాఉన్నాడు.స్వామి వదిలేటట్లు లేరు. "చెప్పడానికే సిగ్గువేస్తుందికదూ! నే చెబుతాను ఏమి జరిగిందో! మిగతా పండితులందరికీ నీవు 10రూపాయలు చొప్పున ఇచ్చావు.తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన సరిగా జపం చేయలేదని 7 రూపాయలకు తగ్గించావు. చేసిన దానికి తగినంత ఇచ్ఛానని నిన్ను నువ్వు మెచ్చుకుని ఆయనను కించ పరచినందుకు సంతోషించావు. ఆయన ఈషణ్మాత్రం ఈ విషయాన్ని సరుకు చెయ్యలేదు.నిన్ను చూచి ఒక చిరునవ్వు నవ్వి ఇచ్చినది తీసుకున్నారు. చెప్పు. ఇది నిజమేనా?" అన్నారు. ఈ విషయమంతా స్వామి వారికి ఎలా తెలుసని భక్తులు ఆశ్చర్య పోయారు. [ఒక ఉపన్యాసంలో రాజగోపాల ఘనపాఠి అనే మహా పండితులు చెప్పారు. రామనామం జరిగేచోటల్లా హనుమంతుడున్నట్లు, వేద పారాయణంజరిగే చోటంతా మహాస్వామి వారు ఉంటారట. వారి గురువుగారు ఎక్కడైనా పారయణాలలో శిష్యులు బాల చేష్టలు చేస్తుంటే "జాగ్రత్త!సరిగ్గాపారాయణ చెయ్యి.మహాస్వామి వారున్నారు".అనేవారట. మరుసటిరోజు వీరు పెద్ద స్వాములవారిని దర్శనంచేస్తే జరిగినదంతా సినిమాలో చూచినట్లు చెప్పేవారట మహాస్వామి.] మిరాశీదారు నిర్ఘాంతపోయాడు. నోట మాటరాలేదు. తేరుకొని తాను తప్పు చేశానని, మరల ఇటువంటితప్పిదం చేయనని మరల మరల వేడుకుంటున్నాడు.కన్నీరుమున్నీరుగా అవుతున్నాడు. స్వామివారు ఆగేటట్లు లేరు. మరి వారి మనసు ఎంత క్షోభపడిందో? "ఆగు అక్కడితో ఆగితే బాగానే ఉండేది. ఆరోజు బ్రాహ్మణులందరికి రామచంద్ర అయ్యర్ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశావుకదూ!అందరికి నీవేస్వయంగా వడ్డించావు.చక్రపొంగలి అమృతంలా ఉన్నది.మంచి నెయ్యి ఓడుతూ ఉంది.ఆనేతిలో ఎన్నో జీడిపప్పులు, కిస్మిస్ పళ్ళు తేలుతున్నాయి. ఆ చక్రపొంగలి నీవే స్వయంగా వడ్డించావు కదూ!"అన్నారు స్వామివారు. తానుచేసిన ఒక మంచిపని శ్రీవారు గుర్తించినట్లుగా మిరాశీదారు, "అవును స్వామీ! నేనే స్వయంగా వడ్డించాను". అన్నాడు. వడ్డించే టప్పుడు పంక్తి మర్యాదను పాటించావా?" అని ప్రశ్నించారు స్వామి. మిరాశీదారునుంచి సమాధానం లేదు. సరే నీకు నేను చెప్తాను. చక్రపొంగలి రుచిగా ఉండడంతో పండితులు మరలమరల మారువడ్డనకై అడిగారు. నీవుకూడా ఆనందంతో వడ్డించావు. కాని తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి మారు అడిగితే,ఒకసారి కాదు అనేకసార్లు, నీవు విననట్లే నటించావు. చాలాసార్లు అడిగారాయన. ఒక్కసారి కూడా నీవు స్పందించలేదు. ఇది పంక్తి మర్యాదా?ఇది ధర్మమా? ఎంత ఘోరంగా అవమనించావు". మహాస్వామివారి మాటలు బాధతో తొట్రుపడుతున్నాయి. ఎంతో విచారంగా కన్పిస్తున్నారు. మిరాశీదారు సిగ్గుతో చితికిపోతూ నిలుచున్నాడు. మహస్వామివారు దండం పట్టుకొని మాలధారి అయిన పరమేశ్వరిని వలె సర్దుకొని నిటారుగా కూర్చున్నారు.మళ్ళీ కొంతసేపు మౌనంగా ధ్యానముద్రలో కనులు మూసికొని ఉద్విగ్నతను అదుపు చేసుకుంటూ కూర్చున్నారు. కనులుతెరచి సూటిగా చూస్తూ"మిరాశీదారుగారూ! ఒక విషయం అర్ధం చేసుకోండి. తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి గారికి 81ఏళ్ళు.వారు తన పదహారేళ్ళ ప్రాయంనుండి అనేక శివాలయాలలో రుద్రజపం చేశారు. శ్రీరుద్రం వారి నరనరములలో, వారి నెత్తురులోనూ,వారిఊపిరిలోనూ వ్యాపించింది.వారు మహాపురుషులు. వారి యెడ నీవు ప్రవర్తించిన తీరు పూర్తిగా పాపభూయిష్టం. పాపం తప్ప మరొకటికాదు." మహాస్వామి వారు ఇక మాటలాడలేక పోయారు.కొంచెంసేపు ఆగి మరలా కొనసాగించారు. నీవు చేసిన అవమానం ఆయనను కలవరపరచింది. లోతుగా బాధించింది. నీకు తెలుసా? ఆ తరువాత ఆయన ఇంటికి పోలేదు.నిన్న సాయంత్రం ఆయన నేరుగా మహాలింగస్వామి గుడికిపోయారు.మూడు ప్రదక్షిణలు చేసి స్వామి ఎదురుగా నుంచొని ఏమి ప్రార్ధించారో తెలుసా?" మహాస్వామివారికి మాట్లాడటం కష్టమయిపోతుంది.కొంతసేపయినతరువాత కొనసాగించారు. కన్నీరు బుగ్గలమీదుగా జలజల కారుతుండగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి, స్వామికి చేతులెత్తి నమస్కరించి, "అయ్యా! జ్యోతి మహాలింగమా! నేను నీకెంత భక్తుడినో నీకు తెలుసు. నీ సన్నిధిలో నా చిన్నతనం నుండి నే చేసిన రుద్రజపములు నీవు అనేక పర్యాయములు అవధరించావు.ఇప్పుడు నావయసు 81. హృదయం చాలా గట్టిగానే ఉన్నది. కానీ వార్ధక్యం తగ్గిపోయింది. ఇవ్వాళ భోజన సమయంలో ఏమి జరిగిందో చూశవు కదా! ఆ చక్రపొంగలి ..... ఎంతో రుచిగావుంది. నా సిగ్గును ప్రక్కనుంచి,మరికొంచెం వడ్డించమని అర్ధిస్తున్నాను. ఒకసారికాదు....అనేకసార్లు. మిరాశీదారు విననట్లు నటించి వెళ్ళిపోయాడు. నీకు తెలుసు కదా? నాకు చక్రపొంగలి అంటే ఎంతో ఇష్టం. నేను అర్ధించినా అతడు వడ్డించక పోవడంవలన నేనెంతో బాధపడ్డాను. కానీ స్వామీ! తరువాత నాకీ విధమైన చాపల్యం - అదీ ఒక వంటకంపై ఉండరాదని గుర్తించాను.అందుకే ఇప్పుడు నీ ముందు నుంచున్నాను. కాశీ వెళితే ఇష్టమైనది పండు, కూర వదిలిపెడతారని చెబుతారు. నీవు కాశీలో ఉండే మహాలింగానివే! అందుకే నీ ముందు వాగ్దానంచేస్తున్నాను. ఈ నిమిషం నుండి నా శరీరంలొ జీవం ఉండేదాకా చక్రపొంగలే కాదు ఏ మధుర పదార్ధమూ ముట్టుకోను. ఇది నా వాగ్దానము. స్వామీ! ఇక సెలవు."అంటూ కన్నీటితో ఆ ఘనపాఠి నిన్న రాత్రి తన గ్రామం చేరారు. ఇప్పుడు చెప్పండి అయ్యర్ గారూ! నీవు చేసినది మహాపాపం కాదా"?మహాలింగ స్వామి నీచెయిదాలను ఒప్పుకుంటారా?" మహాస్వామివారు మౌనం వహించారు. మూడు గంటలయింది.పరిచారకులు భిక్షకై రావలసినదని ప్రార్ధిస్తున్నారు. ఎవరు ఆ ప్రదేశం వదలి కదలటంలేదు. ప్రతివారి కనులనిండా నీరు. మిరాశీదారు మహాస్వామి పాదముల ఎదుట ఆపుకోలేనంతగా విలపిస్తున్నాడు. మాటలు రావటంలేదు.అయినా ప్రయత్నంమీద"స్వామీ! నా ప్రవర్తనకు సిగ్గు పడుతున్నాను. నేను పెద్ద తప్పు చేశాను. క్షమించానని చెప్పండి.మళ్ళీ ఇటువంటి అపరాధం చేయను.స్వామీ!" క్షమించండి.మహాలింగస్వామి ప్రసాదంతీసుకోండి.నన్ను క్షమించండి." అంటున్నాడు.స్వామివారు ప్రసాదం ముట్టుకోలేదు. కొంచెం ఆగు. నాకు మహాలింగస్వామియే అనుగ్రహంతో ప్రసాదం పంపుతాడు". అన్నారు. అంతలో రుద్రాక్షలు ధరించిన 65ఏళ్ళ పండితుడు చేతిలో వెదురుతట్టలో ప్రసాదాలు పుచ్చుకొని వచ్చాడు. "స్వామీ! నా పేరు మహాలింగం. నేను తిరువిడైమరుదూరు అర్చకుడను.నిన్న మహాలింగస్వామికి శ్రీరుద్రాభిషేకం జరిగింది. ఆ ప్రసాదాలు శ్రీవారికి సమర్పించి ఆశీస్సులు తీసుకొని వెళదామని వచ్చాను". అన్నారు. ఆయన నమస్కరించబోతుండగా స్వామివారు "శివదీక్ష పుచ్చుకొన్న వారు ఇతరులకు నమస్కరించరాదు"అంటూ వారించి, ప్రసాదం ఎంతోభక్తితో గ్రహించి, ఆ పండితునకు బదులు మర్యాద చేసి పంపారు. ఆయన వెళుతు ఈ మిరాశీదారును చూచి "ఈయనే నిన్న రుద్రాభిషేకం జరిపించింది" అని చెప్పి వెళ్ళిపోయాడు. మిరాశీదాదు ఈ పాపమునకు పరిహారమేమిటని మహా స్వామి వారిముందు మళ్ళీమళ్ళీ ప్రాధేయపడినాడు. మహాస్వామివారు లేస్తూ, "ప్రాయశ్చిత్తం నేను చెప్పలేను.తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి మాత్రమే చెప్పగలరు" అన్నారు. ఇంత జరిగిన తరువాత ఆయన ప్రాయశిత్తం చెబుతాడా" అన్నాడు మిరాశీదారు. నీకుప్రాప్తముంటే ఆయన చెబుతాడు" అంటూ తనగదిలోనికి వెళ్ళిపోయారు స్వామివారు.రాత్రిదాకా స్వామివారు బయటకు రాలేదు. మిరాశీదారు నేరుగా తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి పాదములు పట్టుకొని ప్రాయశ్చిత్తానికై ప్రార్ధించడానికి నిశ్చయించు కొన్నాడు.అక్కడకు చేరేసరికి తేప్పెరుమానల్లూరు వేంకటేశఘనపాఠి ఇంటిముందు జనం గుమికూడి ఉన్నారు. ఘనపాఠి గారు ఆ తెల్లవారుఝామునే శివసాయుజ్యమొందారు.స్వామివారు "నీకుప్రాప్తముంటే" అన్న మాటల అర్ధం మిరాశీదారుకు ఇప్పుడు అర్ధమయింది. తాను మహాపాపిననుకొంటూ ఘనపాఠి గారి పార్ధివదేహానికి నమస్కరించి ఇంటికిపోయాడు. వేదపండితులకు మనమీయవలసిన మర్యాద ఎటువంటిదో మహాస్వామివారు అనేక సందర్భాలలో ఈ విధంగా తెలియచేశారు. ఇట్టి మహాపరాధం చేసిన, తనను ఆశ్రయించిన మిరాశీదారును పరమ కరుణామూర్తి ఐన స్వామివారు వదిలివేయలేదు. ఆయన శ్రీవారి ఆదేశం మేరకు ప్రాయశ్చిత్తంగా కాశీవాసం చేసి కాశీలో ముక్తి పొందారు. శ్రీగురు పరదేవతాయై నమ:
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

రాముడు - దయా రాముడు పొలాల్లో పనిచేసే ఒక మహిళ గర్భవతియైన తన కుమార్తెను వెంటబెట్టుకుని పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చింది. కడుపుతో ఉన్న తన కుమార్తెకు మంచి పౌష్టిక ఆహారం పెట్టలేకపోతున్నామని స్వామివారికి చెప్పుకుంది. అప్పుడే ఒక భక్తుడు పెద్ద పాత్రనిండా గట్టి పెరుగుతో స్వామివారి వద్దకు వచ్చాడు. వెంటనే స్వామివారు “అది ఆమెకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు. అది చేతులు మారింది. మరొక్క భక్తుడు రెండు పెద్ద పాత్రల నిండా మధుర పదార్థాలు, తినుబండారాలతో వచ్చాడు. అది కూడా చేతులు మారింది. ఇంకొక భక్తుడు రాగానే స్వామివారు, “ఆమెకు కొంత ధనం ఇవ్వు” అని చెప్పారు. ఆ భక్తుడు ఆమెకు డబ్బు ఇచ్చాడు. “ఎంత డబ్బు ఇచ్చావు?” అని అడిగారు స్వామివారు. ఆ భక్తుడు చెప్పడానికి ఇష్టపడలేదు. స్వామివారు కేవలం కనుసైగ ద్వారా ఆజ్ఞాపిస్తే లక్షలు, కోట్లు ఇచ్చే భక్తులు ఉన్నారని అతనికి తెలుసు. కాని స్వామివారు సమాధానం చెప్పాల్సిందే అన్నట్టు అతనివైపు చూస్తున్నారు. స్వరం తగ్గించి, “నావద్ద నాలుగు వేలా చిల్లర మాత్రమె ఉంది పెరియవ. దాన్ని మొత్తం ఆమెకు ఇచ్చాను” అని బదులిచ్చాడు. వెంటనే స్వామివారు, “కాని నేను అంత ధనం ఇవ్వమని నేను అడగలేదు కదా” అని అన్నారు. అప్పుడు ఆ భాక్స్తుడు స్వామివారితో, “ఈరోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రసవానికి నాలుగువేలు అవుతుంది పెరియవ” అని అన్నాడు. స్వామివారు కొద్దిసేపు అతనివంక చూసి, “నువ్వు సాధారణ రాముడివి కాదు. దయా రాముడివి” అని ప్రశంసించారు. అతను కళ్ళ నీరు పెట్టుకుని అత్యంత ఆనందంతో, “చాలు. ఈ దీవెన చాలు నా తరతరాలకు” అని స్వామివారికి నమస్కరించి వెళ్ళిపోయాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

రిజర్వేషన్ లేని ప్రయాణం మా తాతగారి ఊరైన తంజావూరు జిల్లాలోని వరగూర్ లో ఉన్న శివ, విష్ణు ఆలయాల కుంభాభిషేకం చాలాకాలం పాటు వాయిదా పడింది. చివరికి 1980లో భక్తులు అందరూ మహాస్వామివారి ఆశీస్సుల వల్లనైనా ఊర్లోని వారికి బ్రతుకుతెరువు కోసం ఊరు విడిచి వెళ్ళిన వారికి సయోధ్య కుదురుతుందేమో అని ఆలోచించసాగారు. అప్పుడు పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని ఒక పల్లెలో మకాం చేస్తున్నారు. పదిహేను మందికి రైల్వే రిజర్వేషన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు. వెళ్ళేటప్పుడు రిజర్వేషన్లు దొరికాయి కాని, తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ లభించలేదు. ఉదయాన్నే అందరమూ అనంతపురం జిల్లాలోని గుంతకల్లు స్టేషనులో దిగాము. ఆరోజు రాత్రికే తిరిగివెళ్లాలని నిశ్చయించుకున్నాము. ఆ బాధ్యత నాది కావడంవల్ల దిగగానే ఒక అధికారి వద్దకు వెళ్లి మహాస్వామివారిని మనస్సులో ప్రార్థిస్తూ, మేము వచ్చిన పని గురించి, ఆరోజు రాత్రి అనుకున్న మా ప్రయాణం గురించి చెప్పాను. తరువాత అందరంమూ స్వామివారు ఉన్న చోటికి వెళ్లి, మహాస్వామివారిని తృప్తిగా దర్శించుకుని, వారి ఆశీస్సులు అందుకున్నాము. రాత్రి ట్రైన్ కోసమని స్టేషనుకు చేరుకున్నాము కాని రిజర్వు చెయ్యని కంపార్ట్ మెంట్ ల గురించిన సమాచారం లేదు. మేము ఎక్కవలసిన ట్రైను రాగానే, ఐదారు బోగీలపై చాక్ పిసుతో రాసిఉన్న “ఎం ఎస్ గోపాలకృష్ణన్ & పార్టీ” అన్న విషయం చూసి ఆశ్చర్యపోయాను. మాకు కేటాయించిన సీట్లలో కూర్చుని సుఖంగా చెన్నై చేరుకున్నాము. అప్పట్లో కంప్యూటర్ రిజర్వేషన్లు లేకపోవడంతో సీట్లు కేటాయించే అధికారం సంపూర్ణంగా టి. టి. ఇ లకు ఉండేది. నా విజ్ఞాపనని మన్నించి ఆ అధికారి మాకందరకు సీట్లను కేటాయించడం నిజంగా అద్భుతమే. ఇది కేవలం మహాస్వామివారి అనుగ్రహం మాత్రమే. 1981లో కుంభాభిషేకం జరిగింది బహుశా ముప్పై సంవత్సరాల తరువాత. అప్పుడు ప్రజల్లో కలిగిన ఐక్యత వల్ల తొంభైలలో రెండవసారి కుంభాభిషేకం చేయగలిగాము. ఇప్పుడు కూడా 2016లో కూడా కుంభాభిషేకం చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాము. మహాస్వామివారి కరుణ నిరంతరమూ సాగే జీవనది వంటిది. అది ఎప్పటికి మనవైన సంస్కృతీ సంప్రదాయాలను పరిడవిల్లేటట్లు చేస్తుంది. --- ఎం ఎస్ గోపాలకృష్ణన్, కంచి పెరివ ఫోరం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

పరమాచార్య అనుగ్రహం 1993లో నా షష్టిపూర్తి చెన్నైలో చాలా నిరాడంబరంగా జరిగింది. ఆ ఉత్సవం తరువాత నేను నా భార్య కలిసి పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం కంచికి వెళ్ళాము. స్వామివారు మమ్మల్ని అనుగ్రహించి మాకు కుంచితపాదాన్ని అనుగ్రహించారు. చిదంబరంలో నటరాజ స్వామి ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. నటరాజ స్వామి కుడికాలు పీఠంపై బోర్లా పడుకునిఉన్న ఒక రాక్షసునిపై ఉంటుంది. పైకెత్తిన ఎడమకాలుకు కుంచితపాదం(వివిధ ఔషధ మొక్కల వేర్లతో చేయబడిన ఒక చిన్న మాల వంటిది) ఉంటుంది. ఈ విశ్వం యొక్క సుక్ష్మ స్థూల పదార్థముల యొక్క సృష్టి, స్థితి లయ అను చక్రభ్రమణానికి సాక్షిభూతంగా చిరునవ్వుతో గమనిస్తున్న భగవంతుడి లీలా రూపమే ఈ చిదంబర నటరాజ మూర్తి. ఆ రాక్షసుని పేరు అపస్మారకుడు, సంసారంలో పడి జీవుని గురించి మరచి దేహం గురించిన ఆలోచనలు చేసేవాడు. అ కుంచితపాదాన్ని నా పూజామందిరంలో ఉంచాను. దేహాత్మ సంబంధాలను, ముడులను సడలించి, నా సందేహాలు తీరి మహాస్వామివారి అపార కరుణచేత ఆత్మదర్శనం కలగాలని, జన్మజన్మల జననమరణ చక్రం నుండి విడివడాలని ఆ యంత్రాన్ని(కుంచితపాదం) రోజూ ప్రార్థిస్తున్నాను. 1994 జనవరిలో పరమాచార్య స్వామివారు మహాసమాధి చెందే కొన్నిరోజుల ముందు ఒక స్వప్నం వచ్చింది. చాలామంది భక్తులు గుమిగూడి ఉన్నారు. దర్శనం కోసం దూరం నుండి నావైపు తిరిగి చూస్తారేమో అని తొంగిచూస్తున్నాను. కొద్దిసేపటి తరువాత మహాస్వామివారు నావైపు తిరిగి చెయ్యెత్తి నన్ను చూశారు. క్షణకాలంలో స్వప్నం కరిగిపోయింది. అప్పుడు ఉషోదయ కాలం. ఏమి అర్థం కాక ఆదరాబాదరగా లేచాను. అది వారి నిష్క్రమణకు సంకేతం అని తెలియలేదు. మూడు నాలుగు రోజుల తరువాత అనుకుంటూ విషయం తెలిసి సాయంత్రమే కంచికి పరిగెత్తాను. మరుసటిరోజు ఉదయం వారి గురువు గారికి అంజలి ఘటిస్తూ ఇద్దరి మధ్యలో ఉన్న పరమాచార్య స్వామివారిని దర్శించుకున్నాను. సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి వచ్చిన అపర ఆదిశంకరుల కడసారి దర్శనం అది. సశరీరంగా వారు లేకపోయినా ఆ జీవన్ముక్తులు ఎందఱో భక్తుల హృదయాలలో సజీవులై ఉన్నారు. అరుణాచల పద్దికంలో భగవాన్ రమణులు చెప్పినట్టు అరుణాచల అని అన్న వెంటనే ముక్తి లభిస్తుంది. మన బాధలకు ఏదైనా మందు ఉంది అంటే అది అరుణాచల అను నామమే. ఎనభైఅయిదేళ్ళ ఈ వయస్సులో వారి కరుణ అనే మందు కోసం చేతులెత్తి నమస్కరిస్తున్నాను. --- ఎం ఎస్ గోపాలకృష్ణన్, కంచి పెరివ ఫోరం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్ర్ కంచి పరమాచార్య వైభవం

వేప పువ్వు పచ్చడి ప్రసాదం తమిళ సంవత్సరాది రోజున పరమాచార్య స్వామివారిని దర్శించుకునే అవకాశం వచ్చింది ఒకసారి. పుదుక్కోట్టై నుండి అక్కడకు వెళ్లి మహాస్వామి వారిని దర్శించుకుని చింతపండు, బెల్లం కలిపిన వేప పువ్వు మిశ్రమాన్ని స్వామివారికి సమర్పించాము. “వేప పువ్వు పచ్చడిని మీరు ఎలా తయారుచేస్తారు?” అని అడిగారు స్వామివారు. మాకు తెలిసిన విధానాన్ని తోచిన పదాలతో తెలియజేశాము. అందుకు మహాస్వామివారు, “ఈ మూడు పదార్థాలు మాత్రమే సరిపోవు. దానికి మీరు తేనె మరియు నెయ్యి చేర్చాలి. దాన్ని సరైన పద్ధతిలో చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇలా తయారుచేసిన పదార్థాన్ని మీరు ఇతరులకు పంచాలి; వారు మీ వైపు ఆకర్షితులు అవుతారు” “మొదట, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి; అప్పుడు మీకు అమ్మవారు ప్రసన్నురాలు అవుతుంది. తరువాత మీ ఇంటి యజమానికి; అప్పుడు భార్య ఏమి చెబితే వాటికి ఆయన తల ఊపుతాడు! తరువాత ఇంటిలో పనిచేసే వారికి ఇవ్వాలి; అప్పుడు వారు ఏమాత్రం గొణుక్కోకుండా మీ పనులు చేసి పెడతారు!” తరువాత స్వామివారు కొంత వేప పువ్వు పచ్చడి తయారు చెయ్యమని వంటశాలకు ఆదేశాన్ని ఇచ్చారు. దాన్ని తీసుకుని వచ్చి, అందరికి పంచమని చెప్పారు. “ఇప్పుడు ఇది ఎందుకో తెలుసా?” అని అడిగారు. అందుకు ఒకామె, “దీంతో మేమందరమూ పరమాచార్య స్వామివారి ఆదేశాల మేరకు నడుచుకుంటాము” అని చెప్పింది. “అవును నిజమే, కాని ఇది త్రిపురసుందరి ప్రసాదం. మీరందరూ ఎల్లప్పుడూ అమ్మవారికి భక్తురాళ్ళుగా ఉండాలి” అని చెప్పారు. మా చేతుల్లో ఉన్నది ఒక చెంచాడు వేప పువ్వు పచ్చడిగా అగుపించలేదు, అమృత సముద్రంలా అనిపించింది. --- రాధా రామమూర్తి, మహా పెరియవాళ్ – దరిశన అనుభవంగళ్ 6 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

సాంబారు తయారుచెయ్యడం ఎలా? పరమాచార్య స్వామివారి చుట్టూ భక్తుల గుంపు. పురుషులంతా ఒకవైపు, స్త్రీలంతా ఒకవైపు. ఆరోజు స్వామివారు చాలా సాధారణ విషయాల గురించి మాట్లాడుతూ, భక్తులకు నవ్వులు పంచుతున్నారు. హఠాత్తుగా పురుషుల వైపు తిరిగి, “మీలో వంట చెయ్యడం ఎవరికి వచ్చు?” అని అడిగారు. జీవితంలో ఒక్కసారి కూడా వంటగది వైపు తొంగిచూడని కొందరు మగవారితో కలుపుకుని అందరూ “హా, నాకు తెలుసు” అన్నారు. “సాంబారుని మీరు ఎలా తయారుచేస్తారు?” అన్నది తరువాతి ప్రశ్న. వరుసలో మొదట నిలుచున్న వ్యక్తి చెప్పడం ప్రారంభించాడు, “చింతపండును నీళ్ళల్లో నానబెట్టి, కొద్దిగా ఉప్పు, ఎండు మిరప పొడి వేసి; ఆ మిశ్రమాన్ని బాగా మరిగించి వడ్డించాలి” వెనుకన నిల్చున్న మరొక వ్యక్తి చెప్పాడు, “నూనెలో కొద్దిగా ఆవాలు, ఎండు మిరపకాయలు వేయించుకోవాలి. తరువాత చింతపండు-ఉప్పు-కారం-కరం పొడి మిశ్రమాన్ని ఉడికించి, ఉడకబెట్టిన పప్పును వేసి, మొత్తంగా ఒకసారి ఉడికిన తరువాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి . . .” మరొక వ్యక్తి, “చింతపండు, ఎండు మిరప రెండూ నీళ్ళతో బాగా రుబ్బుకుని, తరువాత ఉప్పు, ఉడకబెట్టిన పప్పు, చిటికెడు ఇంగువ వేసుకుని, బాగా మరిగించాలి” అని చెప్పాడు. అలా కొందరు మగవాళ్ళు ఎన్నో రకాలా పద్ధతులని చెప్పారు. తరువాత పరమాచార్య స్వామివారి వంతు వచ్చింది. “మీరందరూ పెద్ద జ్ఞానులు! అహంకారాన్ని మరచిపోయిన వారు. కాని నేను ఇంకా దానికోసం ప్రయత్నిస్తున్నాను” అని అన్నారు. మహాస్వామివారు ఏమి చెప్పారు? “సాధారణంగా మనం తికమకపడేది తాన్ (నేను) అన్న ఆలోచన వల్ల. మీకందరకూ ఆ తాన్(కూరగాయలు) అన్న ఆలోచనే లేదు. చింతపండు-ఉప్పు-మిరప-ఇంగువ మాత్రమే మీ మస్తిష్కంలో ఉన్నాయి. తాన్ అన్న ఆలోచనే మీకు రాలేదు. ఇది జ్ఞానుల స్థితి కదా?” తమిళంలో తాన్ అంటే కూరగాయలు మరియు అహం అన్న అర్థం కూడా!! వాళ్ళందరూ కైలాస పర్వతం ముందర చిన్న రాళ్ళల్లా నిలబడిపోయారు. --- రాధా రామమూర్తి, మహా పెరియవాళ్ – దరిశన అనుభవంగళ్ 6 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

పెళ్లిరోజు - పరమాచార్య నా పేరు వెంకటేశన్. మేము తిరుచ్చిలో ఉంటాము. నేనేమీ ఊహ తెలిసిన నాటినుండే పరమాచార్య స్వామివారి భక్తుడను కాను. నేను చెన్నైలో పని చేసేటప్పుడు నెలకు ఒకటి రెండుసార్లు శ్రీమఠానికి వెళ్లేవాణ్ణి. భక్తుల అనుభావల పుస్తకాలు చదవడం కూడా మొదలుపెట్టాను. ఆ అనుభవాలు పొందిన భక్తులు కొందరు మహాస్వామివారికి అత్యంత సన్నిహితులైతే కొందరు అసలు శ్రీవారి గురించి ఏమీ తెలియని వారు. అటువంటి వారు కూడా స్వామివారి కరుణకు పాత్రులైనారు. ఇక నా విషయానికి వస్తే, ఒకసారి మా పెల్లిరోజున నేనూ, మా ఆవిడ కలిసి శ్రీమఠంలో వారి సన్నిధానానికి వెళ్ళాము. ఆరోజు ఎదో విశేషమైన రోజు అవ్వడంతో మహాస్వామి వారి బృందావనం వద్ద పెద్ద పూజ జరుగుతోంది. నా భార్య ఒరిక్కై పరమాచార్య స్వామివారి ఆలయానికి వెళ్ళాలని కోరింది. కాని అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో నేను వద్దన్నాను. తరువాత మేము అన్నదాన మఠంలో భోజనాదులు ముగించాము. మేము బయటకు వస్తుండగా ఒక ముసలాయన మమ్మల్ని ఒరిక్కై వెళ్లవలసినదిగా కోరాడు. మేము మఠం నుండి బయటకు రాగానే, ఒక ఆటో డ్రైవర్ మమ్మల్ని పిలుస్తూ, ఒరిక్కై వెళుతున్నాను మిమ్మల్ని అక్కడ వదులుతాను రండి అని చెప్పాడు. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఒరిక్కై చేరుకున్నాము. దేవాలయం తలుపులు మూయబడి ఉన్నాయి. అక్కడున్న ఒకాయన మరలా నాలుగు గంటలకే తెరుస్తారు అని చెప్పాడు. మా పెళ్లిరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కలగపోవడం నిరాశ కలిగించింది. అక్కడ కూర్చుని స్వామివారిని ప్రార్థించాను. ఇక చేసేదిలేక తిరిగి వెళ్దామని లేవబోయేంతలో హఠాత్తుగా నీరసంగా అనిపించి ఒక్క అడుగు కూడా వేయలేకపోయాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను అని నా భార్యతో చెప్పి నిద్రలోకి జారుకున్నాను. మెలకువ వచ్చి చూసేసరికి, నా భార్య పరమాచార్య స్వామివారి భక్తుడొకాయతో మాట్లాడుతూ ఉంది. పడుహేను నిముషాల తరువాత దేవాలయ అర్చకులు పరుగులాంటి నడకతో వచ్చి, గర్భాలయం తలుపు తెరిచారు. ఆశ్చర్యపోయి ఇంత త్వరగా ఎందుకు తెరుస్తున్నారని అడుగగా, మహాస్వామివారు ఆయనతో, “దంపతులోకరు నా దర్శనం కోసం కాచుకుని ఉన్నారు. ఈరోజు వాళ్ళ పెళ్లిరోజు. ఆలయం తెరిచి వాళ్లకు ప్రసాదం ఇవ్వు. అందుకే వచ్చాను” అని చెప్పారు. పరమాచార్య స్వామివారికి ఏమీ తీసుకుని రాలేదని అప్పుడు గుర్తుకు వచ్చింది. నా భార్యతో మాట్లాడుతున్నా ఆయన ఒక పెద్ద తులసిమాలను ఇచ్చారు స్వామివారికి సమర్పించామని. మహాస్వామివారి అనుగ్రహాన్ని తలచుకుని కన్నీళ్ళ పర్యంతం అయ్యాము. అది మా జీవితాల్లో మరచిపోలేని సంఘటన. కేవలం మహాస్వామి వారిని ప్రార్థించడమే కాదు, వారు ఉన్నారని మనం నమ్మాలి. ఆయనే తల్లి, తండ్రి, హితుడు, స్నేహితుడు, గురువు, దైవం అన్నీ. శ్రీవారు అంతటా ఉన్నారు. మనలో కూడా ఉన్నారు. స్వామివారి గురించి రాయడానికి మాటలు చాలవు. మనం కోరుకున్నది స్వామివారు ఇవ్వరు, మనకు ఏమి కావాలో వాటిని తప్పక ఇస్తారు. ఇది చాలా సామాన్యమైన విషయం. ఎప్పుడు మనం పరమాచార్య స్వామివారి వైపు చూస్తామో, అప్పుడు ఆయన మన వైపు చూస్తారు. --- వెంకటేశన్ సుబ్రమణియన్, కంచి పెరివ ఫోరం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

జీవన్ముక్తుల జీవకారుణ్యం అది 1983 ఏప్రియల్ చైత్ర పౌర్ణమి. పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన కొడంగల్ కు వచ్చారు. పర్ణశాలగా మార్చిన ఒక పశువుల కొట్టంలో వారి మకాం. మరుసటి రోజు నేను నా స్నేహితుడు విశ్వరూప దర్శనం చేసుకుని, స్వామివారి తెల్లవారు చేసే జపం అప్పుడు దాదాపు రెండు గంటల పాటు వారి వద్దనే కూర్చునే అదృష్టాన్ని పొందాము. స్వామివారు జపం పూర్తిచేసేటప్పటికి దర్శనం కోసమని కొంతమంది భక్తులు వచ్చారు. మహాస్వామివారు వారితో మాట్లాడుతూ, తాము ఉంటున్న స్థలం యజమాని గురించి అడిగారు. ఆ సమూహం నుండి ఆ స్థలం యజమాని బంధువు ఒకరు ముందుకు వచ్చి, స్వామివారు అడిగిన విషయాలను తెలిపాడు. వారి కుటుంబం, వృత్తి, వారికున్న భూమి, గోసంపద మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇది విన్నవారెవరికైనా వారిని గూర్చి మహాస్వామివారు అడిగి తెలుసుకుంటున్నారు అనే అనుకుంటారు. కాని అలా అడగడంలో ఆంతర్యం కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే కాదని తరువాత అర్థమయ్యింది. మరి ఇప్పుడు గోవుల్ని, గేదెలని ఎక్కడ ఉంచారు అని అడిగారు స్వామివారు. వాటిని ఆరుబయట కట్టేశారు అని తెలుసుకుని, ఈ ఎండలో రోజంతా అవి అక్కడే ఉంటాయా అని అడిగారు. వాటి నివాసాన్ని తను ఆక్రమించుకున్నానని స్వామివారి తలంపు కావచ్చు. వెంటనే మఠానికి సంబంధించిన కొన్ని వస్తువులను తీయించి, వాటిని లోపల ఉంచమని ఆదేశించారు. ఆ మూగజీవులపై స్వామివారికున్న ప్రేమ అపారమైనది. ఆ పశువుల కొట్టంలో ఉండవలసిన హక్కు వాటిదే కాని తనది కాదని వాటికి చల్లని నీడను ఏర్పరిచారు మహాస్వామివారు. --- కంచి పెరివ ఫోరం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

భిక్ష - బ్రతుకు 1987లో నేను చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నాను. మాది మధ్యతరగతి కుటుంబం కావున అప్పటికే నాకు పెళ్ళైనా ఉద్యోగము ఆదాయమూ లేక ఏమీ తోచని స్థితిలో ఉన్నాను. అటువంటి స్థితిలో నా స్నేహితుడు ఒకసారి కాంచీపురానికి తనతో రమ్మన్నాడు. శ్రావణంలో వారి కుటుంబం తరుపున చేసే భిక్షావందనం కోసమని. నాకు కూడా కాస్త కొత్తగా ఉంటుందని, నా అదృష్టవశమున అతనితో వెళ్ళడానికి ఒప్పుకున్నాను. కంచిలో నా తప్పిదం వల్ల శ్రీమఠానికి చేరుకోవడం కాస్త ఆలస్యం అయ్యింది. నేను శ్రీమఠానికి చేరుకునేటప్పటికి అక్కడ చాలామంది భక్తులతో కొద్దిగా కూడా స్థలం లేకుండా పూజా మండపం గదిలోనికి కూడా వెళ్ళడానికి చోటు లేకుండా ఉంది. నేను అక్కడే ద్వారం వద్దనే నిలుచుండిపోయాను. అప్పుడు జయేంద్ర సరస్వతి స్వామివారు పూజ చేస్తున్నారు. అంతలోనే పరమాచార్య స్వామివారు వస్తున్నారన్న విషయాన్ని తెలిపారు. అందరూ భక్తిశ్రద్ధలతో లేచి నిలబడ్డారు. మహాస్వామివారు లోపలకు వచ్చి ఆశీర్వదించి అందరిని కూర్చోమని సైగ చేశారు. నేను తప్ప అందరూ వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. నేను అక్కడే ద్వారం వద్ద నిలబడి ఉన్నాను. అప్పుడు నన్ను మహాస్వామివారు కొద్దిసేపు చూసి చేతులెత్తి నన్ను ఆశీర్వదించారు. అప్పుడు అక్కడున్న భక్తులందరూ నన్ను ఒకసారి చూసారు. కొద్దిగా సర్దుకుని నాకు కూడా కూర్చోవడానికి కాస్త చోటిచ్చారు. తరువాత నా స్నేహితుని దయ వల్ల స్వామివారిని వారి గదిలో కలుసుకుని సాష్టాంగం చేసుకున్నాను. వారు నన్ను గుర్తుపట్టి మరలా ఆశీర్వదించారు. గొప్ప అనుభూతితో, మనస్సు నిండుగా సంతోషంతో మా ఊరికి తిరిగొచ్చాను. పరమాచార్య స్వామివారి ఆశిస్సుల వల్ల రెండు మంచి సంఘటనలు జరిగాయి. ఒకటి నా ఉద్యోగం గురించి - అవును, నాకు భారతీయ రైల్వేలో ఉద్యోగం లభించింది. ఇప్పటికి నేను ఇక్కడే పనిచేస్తున్నాను. రెండవది నా భార్య గర్భవతి అవ్వడం. మహాస్వామి వారి అనుగ్రహం వల్ల మాకు ఒక కుమారుడు కలిగాడు. మా ఆనందానికి అవధులు లేవు. నా ఈ స్థితికి జీవితానికి కారణం పరమాచార్య స్వామివారి అనుగ్రహ కృపాకటాక్ష విక్షణాలే. --- శ్రీ శాస్త్రి, కంచి పెరివ ఫోరం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

అన్నవిక్రయం మహాపాపం చెన్నైకు చెందిన ఒక పెద్ద రెస్టారెంట్ యజమాని చాలా ప్రముఖ వ్యక్తి. ఆయన పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతని వ్యాపారం బాగా అభివృద్ధి చెందడంతో, చాలా ధనం సంపాదించాడు. అతడు మంచి భక్తితత్పరుడు, దానగుణం కలవాడు కూడా. 1958 - 1960లలో పరమాచార్య స్వామివారు చెన్నైలో మకాం చేస్తున్నప్పుడు, పాదపూజ చేసి, భిక్షావందనం చెయ్యాలని ఆశపడ్డారు. “సరే చూద్దాంలే” అన్నారు స్వామివారు. కాని ఎన్నిసార్లు ఆయన తన కోరికను తెలిపినా, పరమాచార్య స్వామివారు అంగీకరించలేదు. అలా అని తిరస్కరించనూ లేదు. కాని ఇది తిరస్కారమే అని శిష్యులు అర్థం చేసుకున్నారు. శ్రీమఠంతో మంచి సంబంధాలు ఉన్న కొంతమంది పెద్దలు ఆయన తరుపున పరమాచార్య స్వామివారిని వేడుకున్నారు. “అతను మంచి వ్యక్తీ, గొప్ప దానగుణం ఉన్నవాడు. మఠానికి ఎన్నో రకాలుగా సేవ చెయ్యగల సమర్థుడు. అతనికి సంతానం కూడా లేదు” అని చెప్పసాగారు. మహాస్వామివారు అంతా మౌనంగా విన్నారు. “అతను మంచి వ్యక్తి అని నాకు కూడా తెలుసు. భక్తీ ప్రపత్తులు దానగుణం కలిగినవాడు కూడా. అతని గురించి తప్పుగా నేను ఏనాడైనా మాట్లాడానా?” అని అడిగారు. “లేదు లేదు పెరియవ. కేవలం శ్రీమఠానికి ఎదోరకంగా సేవచేసుకోవాలి అనే ఆశ అతనిది” “అదే నేను కూడా అడుగుతున్నా. అతను మంచివ్యక్తి అంటున్నారు కదా. ఆయన సేవచేయాలనుకుంటే ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కదా! అతను మఠానికి డబ్బు ఇచ్చినా మరలా మనం చేసేది అదే కదా. మరి అతనే చెయ్యవచ్చు కదా!” అని అన్నారు స్వామివారు. అందరూ మౌనం వహించారు. “పుట్టుక చేత అతను వేదాధ్యయనం చెయ్యాలి. అన్నం అమ్ముకోకూడదు. అది పెద్ద పాపం. అతని సంపద అంతా అన్నం అమ్ముకోవడం వల్ల సమకూరినదే. మరి ఆ డబ్బు చంద్రమౌళీశ్వరునికి అవసరమా? చెప్పండి” అందరూ మిన్నకుండిపోయారు. ఇక మాట్లాడడానికి వారికి అనకాశం లేదు. కాని ఆయన మాత్రం పదే పదే తన కోరికను తెలుపుతూనే ఉన్నాడు. పరమాచార్య స్వామివారు పరమ దయాళువు. చెన్నై నగరం నుండి వెళ్ళిపోయే తేదీ నిశ్చయం అయ్యింది. సమష్టి భిక్షావందనం ఏర్పాటు చేశారు. సమష్టి అంటే అందరూ కలిసి. ఇటువంటి భిక్షావందనంలో భక్తులందరి సమర్పణని అంగీకరిస్తారు. చిన్నదా పెద్దదా ఎవరు ఎంత ఇచ్చారు అనే పట్టించుకోరు. అందరూ కలిసి గురువుగారికి భిక్ష సమర్పిస్తారు. అతణ్ణి కూడా ఇందులో పాల్గొనమని చెప్పారు. అదే భాగ్యంగా తలచి ఆయన కూడా పాల్గొన్నారు. వారికి చెట్ పేట్ లో కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది. “నేను నా భార్య మరణించిన తరువాత ఈ ఇంటిని శ్రీమఠానికి ఇవ్వాలని, ఒకవేళ దాన్ని అమ్మిన పక్షంలో ఆ డబ్బును మఠానికి ఇవ్వాలని” విల్లు వ్రాశారు. కాని మఠాన్ని పరమాచార్య స్వామివారు నిర్వహించినంతవరకూ ఆ రాజభవనాన్ని స్వాధీనపరుచుకోలేదు. ధర్మం అంటే ధర్మమే! పరమాచార్య స్వామివారు అంటే పరమాచార్య స్వామివారే! --- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 3 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

సన్యాసి - సమాధి 1986లో తిరుచిరాపల్లిలోని ఆంగరై నుండి కొంతమంది భక్తులు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. స్వామివారు వారితో చాలా విషయాలు మాట్లాడిన తరువాత కావేరీ తీరంలో ఉన్న సంధ్యావందన ఘాట్ గురించి వారిని అడిగారు. అక్కడే దగ్గర్లో నిలబడి మహాస్వామివారి భిక్షా కైంకర్యం పర్యవేక్షిస్తున్న ఆంగరై శ్రీకంఠన్ ను చూపిస్తూ, “నేను ఎప్పుడు ఆంగరై గురించి అడిగినా, ఇతను తనకు ఏమి తెలియదని సమాధానం చెబుతాడు” అని అన్నారు. అందుకు శ్రీకంఠన్ స్వామివారితో, “నేను ఆంగరై వదిలి నలభై సంవత్సరాలు అయ్యింది. కాబట్టి నాకు అక్కడి విషయాలు ఏమి తెలియవు” అని సమాధానం చెప్పాడు. “ఎవరో కొంతమంది ఆ సంధ్యావందన ఘాట్ ని ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు అక్కడ కేవలం కొంత స్థలం మాత్రమే మిగిలిఉంది” అని దర్శనానికి వచ్చిన భక్తులు చెప్పారు. “వారంతా పేదవారు. వారిని మీరు అక్కడినుండి పంపించాల్సిన పని లేదు. ఆ మిగిలిన స్థలానికి ఒక ప్రహరీ కట్టి, రెండు మారేడు చెట్లు తులసి చెట్టు నాటి వాటిని పోషించండి” అని స్వామివారు ఆదేశించారు. పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం చేస్తామని వారు స్వామివారితో విన్నవించుకున్నారు. 2003వ సంవత్సరంలో శ్రీకంఠన్ సన్యాసం స్వీకరించారు. వారు తిరువానైకోవిల్(జంబుకేశ్వరం) లోని శ్రీమఠం శాఖలో ఉంటూ అక్కడే సిద్ధి పొందారు. అక్కడి శ్రీమఠం తోటలోనే వారిని శరీరాన్ని ఉంచాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే తిరువానైకోవిల్ శ్రీమఠం దేవాలయ పంచ ప్రాకారాలలోనే ఉండటం వల్ల ఇక్కడ ఖననం చెయ్యడం సరికాదని కొంతమంది ఈ నిర్ణయాన్ని ఆక్షేపించారు. వారికి ఏమి చెయ్యాలో అర్థం కాక ఆంగరైలో ప్రహరీ నిర్మిచిన వ్యక్తీ సూచన మేరకు, పెద్దస్వామి ఆదేశానుసారం వారి పార్థివ దేహాన్ని అక్కడకు తీసుకుని వెళ్లి సన్యాస సంపరదాయం ప్రకారం సమాధి చేశారు. 2003లో దేహత్యాగం చేసే తన సన్యాస శిష్యుని కోసం 1986లోనే స్థలాన్ని సిద్ధం చేసి ఉంచారు పరమాచార్య స్వామివారు. ఇది కేవలం కాకతాళీయమా? లేక పరమాచార్య స్వామివారి దిర్ఘదృష్టికి నిదర్శనమా? --- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 3 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

వేద రక్షణ - వాజపేయం మా నాన్నగారు జె. పద్మానాభాచార్య వాజపేయ యాజి గారికి నాతోపాటు నలుగురు కొడుకులము. మా నాన్నగారికి పరమాచార్య స్వామివారిపై అనన్య భక్తిప్రపత్తులు. వారు ఋగ్వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారు. అప్పుడు మేము కుంభకోణంలో నివసించేవాళ్ళం. అప్పుడు పరమాచార్య స్వామివారు మా నాన్నగారిని పిలిచి, “ఇప్పుడు మధ్వులలో అగ్నిహోత్రులు ఎవరూ లేరు కనుక నువ్వు రోజూ అగ్నిహోత్రం చెయ్యడం ప్రారంభించాలి” అని ఆజ్ఞాపించారు. స్వామివారి ఆదేశానుసారం మా నాన్నగారు అధ్యయనం ప్రారంభించి నిత్యాగ్నిహోత్రి అయ్యారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు మా నాన్నగారు వేదపారాయణం చేస్తున్నారు. కంచి పరమాచార్య స్వామివారు పంపగా వచ్చామని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. మా నాన్నగారు కలకత్తాకు వెళ్లి అక్కడ ఉన్న వేదభవనంలో ఋగ్వేద అధ్యాపకులుగా ఉంటూ అక్కడ ఉన్న మధ్వ సముదాయానికి పౌరోహిత్యం చెయ్యవలసిందిగా పరమాచార్య స్వామివారు ఆదేశించారని వారు తెలిపారు. మహాస్వామివారి ఆజ్ఞ ప్రకారం మా పెద్ద అన్నను తీసుకుని కలకత్తా వెళ్ళారు. అక్కడి వేదభవనంలో ఋగ్వేద అధ్యాపకులుగా ఉంటూ, అక్కడి మధ్వులకు వైదికం చేస్తూ ఉండేవారు. నాలుగైదు సంవత్సరాల తరువాత 1968లో ఒక బస్సు ప్రమాదంలో మా అన్నయ్య చనిపోయాడు. పరమాచార్య స్వామివారు మమ్మల్ని విజయవాడ వేద సదస్సుకు రమ్మన్నారు. అక్కడ స్వామివారిని కాలువగా మమ్మల్ని కలకత్తా వదిలి కావేరీ తీరంలో ఉండమని ఆదేశించారు. దాంతో మేము సిరుగమణి అగ్రహారం చేరుకున్నాము. అక్కడ శ్రీమాన్ వేంకటేస అయ్యర్ గారు మా వసతికి, నెల భత్యానికి ఏర్పాట్లు చేశారు. నాన్నగారు అక్కడ ఋగ్వేదం నేర్పుతూ, అగ్నిహోత్రం చేస్తూ ఉండేవారు. శాస్త్రం ప్రకారం నిత్యాగ్నిహోత్రం, ఇష్టి, సోమయజ్ఞం జరిగేవి. పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో ఎందఱో మధ్వ విద్యార్థులు వేద రక్షణ నిధి ట్రస్ట్ తరుపున విద్యార్థులుగా చేరి, అధ్యయనం చేసి, పరిక్షలలో ఉత్తీర్ణులయ్యారు. ఈనాటికీ సిరుగమణి వేద పాఠశాల నడుస్తోంది. మా చిన్నతమ్ముడు పరసురామన్ అక్కడ అధ్యాపకుడు కూడా. ఈరోడ్ లో మా నాన్నగారు వాజపేయ యాగం పూర్తిచేసిన తరువాత మహాస్వామివారి దర్శనం కోసం మహఖాన్ వెళ్ళాము. అక్కడ ఉన్న శ్రీమఠం సేవకులకి వాజపేయ యాగం పూర్తిచేసి స్వామివారి దర్శనానికి వచ్చామని చెప్పాము. కాని మహాస్వామివారు మమ్మల్ని మా బసకు తిరిగివెళ్ళమని సమాధానం పంపారు. ఎదో కారణానికి మహాస్వామివారి దర్శనం లభించకపోవడంతో మేము బసచేస్తున్న సత్రానికి వచ్చి మిక్కిలి బాధపడుతున్నాము. ఒక గంటసేపటి తరువాత ఏనుగు, గుర్రం, చామరం, వేదఘోష, మంగళ వాయిద్యాలతో కూడిన ఒక బృందం అటుగా వచ్చింది. “యాగం చేసివచ్చినవారు ఇక్కడ ఎవరో బసచేస్తున్నారు. వారిని సకుటుంబంగా తీసుకునిరమ్మని పరమాచార్య స్వామివారు సండూర్ సంస్థాన మహారాజుగారిని పంపారు” అని మాతో చెప్పారు. ఆ విషయం విని మేము ఆనందాశ్చర్యాలకు లోనయ్యాము. సామవేద ఘోషతో, కలకత్తా శంకర నారాయణ శ్రౌతి మమ్మల్ని తీసుకుని వచ్చారు. సండూర్ మహారాజుగారు మా నాన్నగారికి శ్వేత ఛత్రం పట్టి ఊరేగింపుగా తిసుకునివచ్చారు. మేము మహాస్వామి వారి మకాం చేరుకోగానే స్వామివారు మాతో, “ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు ఈ కన్నీళ్ళు? వాజపేయ యాగం చేసినవారిని రాజలాంఛనాలతో తెల్లని గొడుగు క్రింద చూడాలని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మిమ్మల్ని అలా చూడాలనే నేను వెనక్కు పంపాను” అని చెప్పారు. మహారాజుగారు పట్టిన శ్వేత ఛత్రాన్ని మాకు ఇచ్చి, దాదాపు రెండుగంటల సేపు మాతో మాట్లాడి, మా బాధను తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి పంపారు. ఇది మా జీవితాల్లో ఎప్పటికీ మరచిపోలేని అత్యద్భుతమైన సంఘటన. --- పి. రామకృష్ణాచార్య, ఋగ్వేద అధ్యాపకులు, మంత్రాలయం. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 1 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

పిల్లవాడు - పిల్లివైద్యం పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శ్రీ మఠంలో భక్తులు బారులు తీరి ఉన్నారు. వారిలో దంపతులొకరు మగబిడ్డతో వరుసలో నిలబడి ఉన్నారు. వారి వంతు రాగానే, బిడ్డను మహాస్వామి వారి పాదాల చెంత ఉంచి భోరున ఏడవసాగారు. ఇతర భక్తులు వారివైపు జాలితో చూస్తున్నారు. ఆ పిల్లవాణ్ణి చూస్తే బంగారు బొమ్మలా ఏ కదలికా లేకుండా ఉన్నాడు. కళ్ళు కూడా కనిపించడం లేదు అని అర్థమైంది. స్వామి వారు పిల్లవాడి వంక కొద్ది సేపు తీక్షణంగా చూసి, "ఇంకా అలానే ఉంది. తగ్గలేదు" అని మౌనంలోకి వెళ్ళిపోయారు. మహాస్వామి ఏమి అన్నారో ఎవరికీ అర్థం కాలేదు. కాసేపాగి మఠం అంతేవాసిని కొద్దిగా పాలు, నందివర్ధనం పువ్వు తెమ్మన్నారు. పాలలో పువ్వుని ముంచి పిల్లవాడి తలకు, కళ్ళకు, కడుపుకు, కాళ్ళకు రాసి కనులు మూసి కొద్ది సేపు ప్రార్థన చేసారు. తరువాత ఆ బిడ్డ తల్లి తండ్రులతో, "మాయవరం(మైలాదుతురై) మయూరనాథుని ఆలయానికి తీసుకుని వెళ్ళి, అక్కడ ఉన్న దక్షిణామూర్తి పాదాల చెంత పిల్లవాడిని ఉంచండి. ఇప్పుడే బయలుదేరండి" అని చెప్పారు. వెంటనే ఆ దంపతులు ఆ పిల్లవాణ్ణి తీసుకుని పయనమయ్యారు. వీరు అక్కడకు చేరుకునేటప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు. వారు ఈ పిల్లవాడి గురించి మాట్లాడుకుంటున్నారు. గణపతిని దర్శించుకుని దక్షిణామూర్తి సన్నిధికి వెళ్ళి పిల్లవాడిని స్వామి పాదాల చెంత ఉంచి ప్రార్థించసాగారు. ఒక గంట గడిచింది. పిల్లవాడిలో ఏ కదలికా లేదు. చుట్టూ మూగిన జనం ఆ బిడ్డ తల్లిదండ్రుల నమ్మకం చెడిపొయేలాగా మాట్లాడుతూ, వారిని మాట్లాడించే ప్రయత్నం చేయనారంభించారు. అదే సమయానికి ఒక తెల్ల పిల్లి ఎక్కడి నుంచో పరిగెత్తుకుంటూ పిల్లాడి దగ్గరకు వచ్చింది. పిల్లి నుంచి బిడ్డను తల్లి కాపాడ సాగింది. ఎవ్వరూ ఊహించని విధంగా పిల్లి పిల్లాడి నుదురు నాకి, తల నుంచి పాదాల వరకు వాసన చూసి వెళ్ళిపోయింది. పుట్టినప్పటి నుంచి కదలని ఆ పిల్లవాడు దక్షిణామూర్తి వైపు చూసి నవ్వి కేరింతలు కొట్టసాగాడు. ఆ తల్లిదండ్రులు "జయ జయ శంకర హర హర శంకర" అని ఆనందంతో చెప్పుకుంటూ పిల్లవాడిని ఎత్తుకున్నారు. పిల్లవాడు తల్లిదండ్రులను చుసి నవ్వాడు. ఈ సంఘటన చూసిన జనాలు స్వామివారి దైవత్వాన్ని కొనియాడారు. పూర్వ జన్మలలో పిల్లిని చంపినట్లు అయితే, అలాంటి వారు మరు జన్మలో సంతాన హీనులుగా కానీ, మానసిక/శారీరిక వైకల్యం ఉన్న సంతానం కానీ కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. మహాస్వామి వారి గొప్పతనం ఏమని చెప్పేది. ఏ పిల్లిని చంపడం ద్వారా సంక్రమించిన పాపం వల్ల ఆ తండ్రికి అలాంటి సంతానం కలిగిందో, ఆ పిల్లి జాతి ద్వారానే ఆ పిల్లవాడి కర్మను మార్చారు. మహాస్వామి వారి దగ్గరకు వచ్చి శరణు వేడిన వారి బాధలను స్వామి వారు ఎన్నిటినో తీసి వేసారు. వైద్యులు నయం చేయలేని, కర్మవశాత్తు కలిగే ప్రాణంతక రోగాలను ఎన్నింటినో స్వామి వారు తొలగించారు. ఇలాంటివి చదువుతుంటే, స్వామి వారు మన మధ్యలో ఇంకో 100 యేళ్ళు ఉంటే బావుంటుంది అని అనిపించకుండా ఉంటుందా? --- ఆదిత్య నండూరి, హైదరాబాద్ అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

కచ్ఛపేశ్వరుడు - కంచి పరమాచార్య స్వామివారు కాంచీపురంలోని కొల్ల చత్రంలో చాలా రోజులపాటు మకాం చేశారు. ప్రతిరోజూ కచ్ఛపేశ్వర దేవాలయ కొలనులో స్నానం చేసేవారు. కార్తీక సోమవారాలలో ఆ కొలనులో స్నానాదికాలు చెయ్యడం ఎంతో పుణ్యప్రదమని పురాణాలు చెబుతున్నాయి. అలా ఒకనాటి కార్తీక సోమవారం రోజు పరమాచార్య స్వామివారు కొలనులో స్నానం చేసి, దైవదర్శనం కోసమని దేవాలయంలోనికి వెళ్ళారు. చెన్నై నుండి వచ్చిన ఒక భక్తుడు కూడా ఇతర భక్తులతో మహాస్వామివారి వెంట వెళ్తున్నాడు. అతను ఎకామ్రేశ్వర దేవాలయానికి వెళ్ళవలసి ఉన్నందున మహాస్వామివారి వద్ద నుండి సెలవు కావాలని ప్రార్థించాడు. “ఈరోజు కార్తీక సోమవారం. ఇటువంటి రోజున శివాలయంలో పరమశివ దర్శనం అత్యంత పుణ్యప్రదం. కాంచీపురంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. ఎన్ని వీలైతే అన్ని శివాలయాలను దర్శించుకో. నాకు వయస్సు అయిపొయింది. కాబట్టి నేను అన్ని ఆలయలాను దర్శించలేను. ఈ పృథ్వీ క్షేత్రమైన కంచిలో అత్యంత పురాతన దేవాలయంగా ఈ కచ్ఛపేశ్వర దేవాలయాన్ని చెబుతారు. ఈ దేవాలయ నిర్మాణము, ప్రతిష్ట జరిగిన తరువాతనే ఎకామ్రేశ్వర దేవాలయ నిర్మాణం జరిగిందని చెబుతారు. కచ్ఛపేశ్వరుడు వెలసి ఉండడం వల్ల ఈ కాంచీపురానికి కచ్చిముదూర్, కచ్చి ఏకాంబరం అను పేర్లు కూడా కలవు. ఆ ‘కచ్చి’యే సంస్కృతమున ‘కంచి’గా మారిందని చెబుతారు” అని సెలవిచ్చారు స్వామివారు. ఆ చెన్నై భక్తుడు గొప్ప విద్వాంసుడు. పరమాచార్య స్వామివారు చెబుతున్న విషయాలను విని అమిత ఆశ్చర్యానికి లోనయ్యాడు. అంతటి గొప్ప చారిత్రిక విషయాలను స్వయంగా స్వామివారి నుండే వినే భాగ్యం పొందాడు. స్వామివారి ఆంతరంగిక సహాయకులకు తెలుసు. స్వామివారికి కంచి చరిత్రే కాదు ప్రపంచ చరిత్ర కూడా తెలుసని. --- శ్రీ మఠం బాలు మామ, మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్ 3 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు. https://t.me/paramacharyavaibhavam #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

నిండు చూలాలు - తీర్థ ప్రసాదం పరమాచార్య స్వామివారు మద్రాసు సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆరోజు ఆదివారం. భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. చంద్రమౌళీశ్వర పూజ అయిపోయిన తరువాత భక్తులకు అభిషేక తీర్థం పంచడానికి ఒక పెద్ద ప్రదేశంలో కూర్చున్నారు. స్వామివారి చేతులతో ఆ తీర్థాన్ని స్వీకరించడానికి భక్తులు వరుసల్లో నిలబడ్డారు. పూజ పూర్తై, అంతమంది భక్తులకు తీర్థం ఇవ్వడానికి చాలా సమయం పడుతుందని తెలిసినా ఎంతోమంది భక్తులు ఆ తీర్థం పుచ్చుకునేదాకా పచ్చి గంగ కూడా ముట్టరు. తీర్థప్రసాదాన్ని ఇస్తున్న మహాస్వామివారు ఒక్కుదుటున పైకి లేచి నిలబడ్డారు. వరుసల్లో నిలబడి తమ వంతుకోసం ఆతృతగా ఎదురుచూస్తున్న భక్తులు కలత చెందారు. “స్వామివారు భిక్షకు వెళ్ళిపోతున్నారా? శ్రీవారి స్వహస్తాలతో తీర్థం తీసుకునే అదృష్టం మాకు లేదా?” మహాస్వామివారు ఒక చిటికెవేసి తమ సహాయకుణ్ణి రమ్మని పిలిచారు. తమ ముందు నులుచున్న వరుసను చూపించి అతనికి ఎదో చెప్పారు. ఆ సహాయకుడు ఒక వంద మంది భక్తులను దాటుకుని ముందుకు వెళ్లి, తనతో పాటు ఒక యువతిని వెంటబెట్టుకుని వచ్చాడు. పరమాచార్య స్వామివారు కూర్చుని వెంటనే ఆమెకు తీర్థం ఇచ్చారు. ఇదంతా గమనిస్తున్న భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ యువతి నిండు చూలాలు. ఉదయం ఆరుగంటలప్పుడు కొంత కాఫీ త్రాగింది. అప్పటినుండి ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంది. ఇప్పుడు సమయం దాదాపు మూడు గంటలు. బహుశా తన కడుపులో ఉన్న బిడ్డ ప్రార్థన మహాస్వామివారు విని ఉంటారు. --- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 3 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

నిండు చూలాలు - తీర్థ ప్రసాదం పరమాచార్య స్వామివారు మద్రాసు సంస్కృత కళాశాలలో మకాం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆరోజు ఆదివారం. భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. చంద్రమౌళీశ్వర పూజ అయిపోయిన తరువాత భక్తులకు అభిషేక తీర్థం పంచడానికి ఒక పెద్ద ప్రదేశంలో కూర్చున్నారు. స్వామివారి చేతులతో ఆ తీర్థాన్ని స్వీకరించడానికి భక్తులు వరుసల్లో నిలబడ్డారు. పూజ పూర్తై, అంతమంది భక్తులకు తీర్థం ఇవ్వడానికి చాలా సమయం పడుతుందని తెలిసినా ఎంతోమంది భక్తులు ఆ తీర్థం పుచ్చుకునేదాకా పచ్చి గంగ కూడా ముట్టరు. తీర్థప్రసాదాన్ని ఇస్తున్న మహాస్వామివారు ఒక్కుదుటున పైకి లేచి నిలబడ్డారు. వరుసల్లో నిలబడి తమ వంతుకోసం ఆతృతగా ఎదురుచూస్తున్న భక్తులు కలత చెందారు. “స్వామివారు భిక్షకు వెళ్ళిపోతున్నారా? శ్రీవారి స్వహస్తాలతో తీర్థం తీసుకునే అదృష్టం మాకు లేదా?” మహాస్వామివారు ఒక చిటికెవేసి తమ సహాయకుణ్ణి రమ్మని పిలిచారు. తమ ముందు నులుచున్న వరుసను చూపించి అతనికి ఎదో చెప్పారు. ఆ సహాయకుడు ఒక వంద మంది భక్తులను దాటుకుని ముందుకు వెళ్లి, తనతో పాటు ఒక యువతిని వెంటబెట్టుకుని వచ్చాడు. పరమాచార్య స్వామివారు కూర్చుని వెంటనే ఆమెకు తీర్థం ఇచ్చారు. ఇదంతా గమనిస్తున్న భక్తులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ యువతి నిండు చూలాలు. ఉదయం ఆరుగంటలప్పుడు కొంత కాఫీ త్రాగింది. అప్పటినుండి ఏమీ తీసుకోకుండా ఉపవాసం ఉంది. ఇప్పుడు సమయం దాదాపు మూడు గంటలు. బహుశా తన కడుపులో ఉన్న బిడ్డ ప్రార్థన మహాస్వామివారు విని ఉంటారు. --- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 3 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ మేధాదక్షిణా మూర్తి

ఆది గురువు దక్షిణామూర్తి భారతీయ సంస్కృతి ప్రపంచదేశాలకు అనుసరణీయం. మార్గదర్శనం చేస్తోందంటే ఈ సంస్కృతి వికాసానికి మూలం గురువే అన్న సత్యం బోధిస్తుంది. వ్యక్తి షోడశ సంస్కారాలు పరిపూర్ణం కావడానికి దోహదపడే వాడు గురువు. అజ్ఞానతిమిరాన్ని పోకార్చి జ్ఞాన జ్యోతులు వెలిగించే గురువును ప్రత్యక్షదైవంగా మన భారతీయ సంస్కృతి సాహిత్యాలు అభివర్ణిం చాయి. ''ఆలయం కరుణాలయం'' అని ఆది గురువు దక్షిణామూర్తిశంకరులను కీర్తించింది మన సంస్కృతి. గురుసేవ మహాభాగ్యంగా భావించి తరించిన ఎందరో సత్పుర్షులు ఈ వేద భూమిని మరింత పవిత్రం చేశారు. వ్యక్తి క్రమ శిక్షణాత్మక జీవితాన్ని జన్మ ఉన్నంత వరకు ఒక మంచి సంస్కా రంగా తెలియజేసిన మన సంస్కృతిలో గురువుకు ఉన్నత స్థానం ఈయ బడింది. మానవ సమాజం ఉన్నంత ఉత్తమ సంస్కారా లతో ఆదర్శవంతమైన జీవితం గడిపిన పురుషార్థా లను సుసంపన్నం చేసే ప్రక్రియలో గురుస్థానం ప్రముఖమైనది. వ్యక్తి పుట్టుకతో సంస్కార వంతుడు కావడానికి తొలి గురువు తల్లి. ఆమె శిక్షణలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వ్యక్తి విద్యాసంస్కారం అలవరచు కోవడానికి గురువును ఆశ్రయిస్తాడు. గురువు ద్వారా లభించిన జ్ఞానాన్ని పదు గురికి పంచుతూ ఒక నాటి శిష్యుడు గురు స్థానానికి చేరుకుంటాడు. ఈ సందర్భంలో గురువు ఇచ్చే జ్ఞానాన్ని విశ్లేషిస్తూ ఒకచైనా సామెతను మనం స్మరించుకోవాలి. ఆ సామెత ఇలా వుంది. ''జ్ఞానం లేని జీవితం పండని పొలం రెండూ వ్యర్థమే''. పై భావం ఏ దేశానిదైనా, ఏ భాషదైనా అంత రార్థం ఒక్కటే. గురు ముఖత: నేర్చిన జ్ఞానమే మనిషి జీవితాన్ని ఆదర్శ వంతం చేస్తుంది. అందుకే హయగ్రీవుని స్తుతిలో జ్ఞాన ఆనందాలకు హేతువుగా తెలియజేయడం జరిగింది. మన భారతీయ సంస్కృతి ఆది గురువుగా దక్షిణా మూర్తిని అభివర్ణించింది. ఆ శ్లోకం ఇలా వుంది. ''గురవే సర్వలోకానాం భిషజే భవ రోణినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణా మూర్తయేనమ:'' అన్న దక్షిణామూర్తి శ్లోకం దక్షిణామూర్తిని మేధ దక్షిణా మూర్తి గానూ, ఆదిగురువుగాను తెలియ జేస్తోంది. గురువు విశ్వానికి, జ్ఞానానికి వుండే సంబం ధాన్ని విశదప రుస్తాడు. గురువంటే గమించే జ్ఞానం. అంథకా రాన్ని తొలగించే జ్ఞానం. అచేతనం నుండి చేతనా నికి తీసుకపోయే మార్గ దర్శి. గురువు జ్ఞానాన్ని నిష్కామకర్మ రూపంగా శిష్యులకు అందిస్తాడు. ''పూర్వ దత్తేషు యా విద్యా'' అన్న విధంగా పూర్వ జన్మలో చేసిన పుణ్యం వల్లనే గొప్ప విద్య శిష్యునికి అలవడటానికి పుణ్యమూర్తి గురువే ఆధారం అవుతాడు. అందుకే గురుస్తుతిలో ''గురుమూర్తిం చిదాకాశం సచ్చిదానంద విగ్రహం నిర్వి కల్పం నిరాబాధం దత్తమానంద మాశ్రయే గురుస్తుతితో ధన్యులమౌదాం. ఓం శ్రీత్రిమూర్తి స్వరూప గురవేనమ: ఓం నమో దక్షిణామూర్తియే నమః ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః | ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం ఙ్ఞానదాతారమారాత్ | త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేద దక్షం నమామి శ్రీ గురు పరదేవతాయై నమ:
Back

కంచి పరమాచార్య వైభవం

గ్రామ దేవతల ప్రాముఖ్యత ఒక భక్తుడు పరమాచార్య స్వామివారికి తన బాధను చెప్పుకున్నాడు. “చాలా సంవత్సరాలుగా మా ఊళ్ళో ఉన్న శివాలయన్ని జీర్ణోద్ధరణ చెయ్యలేదు. అష్టబంధన, కుంభాభిషేకాలు కూడా జరగలేదు. ఈ కార్యాన్ని చెయ్యడానికి ఎవరైనా ముందుకు వచ్చినా వారు చాలా సమస్యల్లో చిక్కుకుంటున్నారు. ఆ బాధ్యతను తీసుకోవడానికి అందరూ భయపడుతున్నారు”. అందుకు మాహాస్వామివారు అతనితో, “మీ ఊరికి అమ్మవారు గ్రామదేవతగా ఉంది. మొత్తం ఊరందరూ కలిసి పెద్ద ఎత్తున ఉత్సవం చెయ్యండి. పెద్దగా అభిషేకం చేసి జాతర జరపండి. అమ్మవారికి కొత్త వస్త్రాలు సమర్పించి, చక్కెర పొంగళ్ళు నైవేద్యం పెట్టండి. అంతా అయిన తరువాత శివాలయం జీర్ణోద్ధరణ పనులు మొదలుపెట్టండి” ఆ భక్తుడు స్వామివారి ఆదేశాన్ని ఊరిప్రజలకు తెలిపాడు. ఇన్నిరోజులు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకున్నారు. వెంటనే గ్రామసభ ఏర్పాటు చేసి, ఒక మంచి రోజును నిర్ణయించి, ఊరి గ్రామ దేవతకి పెద్ద ఎత్తున ఉత్సవం చేశారు. అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉండగానే, ఒక పిల్లకు అమ్మవారు ఆవహించి, “నేను సంతోషించాను. నేను సంతోషించాను” అని పెద్దగా అరిచి స్పృహ తప్పి పడిపోయింది. తరువాత ఎటువంటి ఆటంకమూ లేకుండా శివాలయ జీర్ణోద్ధరణ జరిగింది. తరువాత కుంభాభిషేకము కూడా ఎంతో వైభవంగా జరిపారు. పరమాచార్య స్వామివారికి గ్రామదేవతలు అంటే అపరిమితమైన గౌరవం. స్వామివారు తరచుగా ఇలా చెప్పేవారు. “ఒక జిల్లా కలెక్టరును కలిసి తమ సమస్యను తెలుపుకుని పరిష్కరించుకోవాలి అంటే సాధారణ ప్రజకు చాలా ప్రయాసతో కూడుకున్న విషయం. కాని అదే ఒక తహశిల్దార్ ను కానీ, గ్రామ స్థాయి అధికారిని కాని కలిసి పని చేయించుకోవడం సులభం. వారు చేయలేకపోయినా నిన్ను సరైన చోటికి సిఫారసు చేయగలరు. నీ పని జరిగేలా చూడగలరు” --- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 3 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

జానకిరామయ్య గారి అనుభవాలు కంచి కామాక్షి అమ్మవారి ఆలయ కుంభాభిషేకం 1944లో జరిగింది. ఈ సమయంలోనే జానకిరామయ్య గారు శ్రీమఠానికి బాగా దగ్గరయ్యారు. వారు తీర్థ - పురోహితులు అనే శాఖకు చెందినవారు. అప్పటికే వారు చాలా ప్రముఖులు. వారి తండ్రి గారి కాలంలో వాళ్ళ ఇంట్లోనే ముగ్గురు నలుగురు సహాయక పురోహితులు ఉండేవారు. వారు కాంచీపురం రైల్వే స్టేషనుకు వెళ్లి ఉత్తరభారతం నుండి వచ్చిన యాత్రికులను కలుసుకుని వారికి భోజన, వసతి ఏర్పాట్లు చేసేవారు. ఎన్నో రాచకుటుంబాల వారు ముఖ్యంగా రాజస్థానీయులు కాంచీపురానికి వచ్చేవారు. ఆ పురోహితులు సర్వతీర్థ దేవాలయ కొలనులో వారితో సంకల్ప సాహిత స్నానం చేయించేవారు. అక్కడే వారి పితరులకు శ్రాద్ధ విధులు కూడా చేయించేవారు. “ఇప్పుడు ఇవన్నీ జరగడంలేదు. యాత్రికులు ఎవరూ పితృకార్యాలు చేయించడానికి సుముఖత చూపించడంలేదు. వాటి గురించి చెప్పి చేయించే పురోహితులూ లేరు” అని వాపోయేవారు జానకిరామయ్య గారు. వారు చాలా నిస్పృహతో గత రోజులను తలచుకొని బాధపడేవారు. ఒకానొక సమయంలో కంచి కామాక్షి అమ్మవారి ఆలయ పారంపర్య ధర్మకర్తలుగా ఉన్న పరమాచార్య స్వామివారు వైదొలగారు. అప్పుడు అమ్మవారి దేవాలయం రిలీజియస్ ఎండోమెంట్స్ బోర్డ్ ఆధీనంలో ఉండేది. కాని యం. భక్తవత్సలం గారు పదే పదే అభ్యర్తించడంతో శ్రీమఠం తరుపున నుండి ధర్మకర్తను నియమించారు. 1953 - 1954లో కామాక్షి అమ్మవారి దేవాలయానికి జానకిరామయ్య గారు ట్రస్టిగా ఉన్నారు. కోర్టులో కేసు పూర్తైన తరువాత మరలా అమ్మవారి దేవాలయం శ్రీమఠం ఆధీనంలోకి వచ్చింది. జానకిరామయ్య గారు మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయ కుంభాభిషేకం కోసమని మదురైలో ఉన్నారు. పరమాచార్య స్వామివారు కబురంపగా, వారు రాగానే కామాక్షి ఆలయానికి శ్రీకార్యంగా నియమించారు. 1984లో ఆరోగ్య సమస్యల దృష్ట్యా జానకిరామయ్య గారు శ్రీకార్యం నుండి వైదొలిగారు. వారు చెప్పిన విషయాలు వారి మాటల్లోనే. “నేను శ్రీకార్యం అయినప్పుడు ఆలయానికి ఏమాత్రం ఆదాయం లేదు. హుండి పెడితే వచ్చిన డబ్బుల్లో సగం పరిపాలకులకు వెళ్తుంది. అందుకని నిత్యపూజ ధర్మ హుండి పెట్టాము. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తెరుస్తాము. మొత్తంగా ముప్పై నలభై వేలదాకా ఉండేది. అప్పుడు పూల వారికి, సరుకులు ఇచ్చే వారికి డబ్బులు చెల్లించేవాళ్ళం. వారు కూడా ఎప్పుడూ సహనంతో సంవత్సరంపాటు వేచి ఉండేవారు. ఒకసారి నేను పరమాచార్య స్వామి వద్దకు వెళ్లి “మనకు నిధులు చాలా తక్కువ ఉన్నాయి. ప్రవేశ రుసుము పెడదామా?” అని అడిగాను. ఈ ఆలోచన స్వామివారికి కోపం తెప్పించింది. సర్వసంగ పరిత్యాగులై ధనాన్ని తాకని సన్యాసులు ఎవరైనా అమ్మవారి దర్శనానికి వస్తే, వారు ఏం చెయ్యాలి? అయినా దేవీ దర్శనానికి ప్రవేశ రుసుమా? ఇది ఎక్కడి న్యాయం? ఇది సరైన పని కాదు. ఖచ్చితంగా ప్రవేశ రుసుము తీసుకోవడానికి వీలు లేదు!” ఈ విషయంలో పరమాచార్య స్వామివారు చాలా ఖచ్చితంగా ఉన్నారు. లలితా సహస్రనామాల కాసులతో చేయించిన బంగారు హారం ఉన్నది అమ్మవారికి. పరమాచార్య స్వామివారే దాన్ని తయారుచేయించి సమర్పించారు. ఎలాగో తెలుసా? ప్రతి ఒక్కరిని వారే అడిగి తయారుచేయించారు. “జానకిరామా! ఆ కాసుమాల చాలా బరువుగా ఉంటుంది. అది కామాక్షికి చాలా బరువుగా ఉంటుంది కాబట్టి అమ్మవారికి ఇబ్బంది ఉంటుంది. కనుక వెనుక ఉన్న ప్రభావళికి కొక్కాలు చేయించి దానికి తగిలించు”. మనకు స్థూలంగా ఒక శిలగా కనిపించే అమ్మవారి విగ్రహం గురించి ఇంత ఆర్ద్రత కేవలం పరమాచార్య స్వామికే ఉంది. అయినా వారికి అక్కడ కనిపించేది విగ్రహం కాదు, సాకార రూపంలో ఉన్న సాక్షాత్ అమ్మవారే కదా! చిన్న కాంచీపురంలోని అనైకట్టి వీధిలో పరమాచార్య స్వామివారికి కనకాభిషేకం జరిగింది. ఆ బంగారాన్ని కామాక్షి అమ్మవారికి ఆది శంకరాచార్యుల దివ్యపాదుకలకి స్వర్ణ కవచాలు చేయడానికి వినియోగించాలని ఆదేశించారు. మామూలుగా విగ్రహాలకి స్వర్ణ కవచాలు చేసేటప్పుడు, వాటిని రాగితో తయారుచేయించి దానిపై పలుచని బంగారు పూత వేస్తారు. అవి బంగారు కాంతులీనుతూ భక్తులకు ఆనందాన్ని కలుగజేస్తాయి. కాని స్వామివారు ఏం చేయ్యమన్నారో తెలుసా? “జానకిరామా! బంగారం భవత్పాదుల పాదాలను తాకాలి. కనుక లోపలివైపు కూడా బంగారు పూత వేసేటట్లుగా జాగ్రత్త వహించు” అని అన్నారు. అదీ ఆచార్యులపై వారి గురుభక్తి. వారి ఆదేశానుసారమే కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న ఆదిశంకరులకు ఇరువైపులా బంగారు పూతతో స్వర్ణ పాదకవచాలు చేయించడం జరిగింది. 1953లో శ్రీమఠంలో ఉన్న ఒక రాగి శాసనాన్ని పరమాచార్య స్వామివారు చదవడం జరిగింది. కామాక్షి అమ్మవారి పైన ఉన్న విమాన గోపురం బంగారు పూతతో ఉండేదని, శ్రీమఠం ప్రవేశంలో త్రాగునీటి సదుపాయం ఉండేదని దాని సారాంశం. వెంటనే శ్రీమఠం ప్రవేశ ద్వారం వద్ద త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తులకు నీరు ఇవ్వడం కోసం ఒక ముసలామెకు నేలకు పదిహేను రూపాయలు, రోజుకు కొద్ది బియ్యము ఇచ్చునట్లుగా ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆదేశానుసారం పెద్దస్వామివారు (శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి) కామాక్షి అమ్మవారి విమాన గోపురాన్ని బంగారుమయం చేశారు. --- డి. జానకిరామయ్య, లింగప్పన్ వీధి, కా
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

”. మరొక కార్డుపై నా చిరునామా వ్రాసాను, దివేకర్ గారు త్వరగా ప్రత్యుత్తరం పంపగలరని. “ఉగార్ ఎలా చేరుకోవాలి? ఎక్కడ బస చేయాలి?” వంటి సందేహాలతో. ఫ్యాక్టరీ ఉగార్, ఉగార్ ఖుర్ద్ అని రెండు పేర్లు ఉన్నప్పటికీ నా ఉత్తరం చేరవలసిన చోటికే చేరింది. తపాలా వారు సరిగ్గానే పంపారు. వెంటనే శ్రీ దివేకర్ గారు ప్రత్యుత్తరం పంపారు. పూణే నుండి ఒక్క రాష్ట్ర సర్వీసు బస్సు మాత్రమె ఉంది. అది కూడా తెల్లవారుఝాము నాలుగున్నరకు బయలుదేరుతుంది. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత మధ్యాహ్నం ఒకటిన్నరకు ఉగార్ చేరుకుంటుంది. ఒక్కదాన్నే ఎలా వెళ్ళడం? మా అమ్మ కూడా చాలా గాభరా పడుతోంది. అదే సమస్య. కాని అన్ని అడ్డంకులను తొలగించారు స్వామివారు. మరుసటిరోజు ప్రయాణానికి సాయింత్రం నాలుగ్గంటలప్పుడు టికెట్టు తీసుకోవడానికి బస్టాండుకు వెళ్లాను. అక్కడ అనుకోకుకండా ఒక స్నేహితురాలు కలిసింది. విషయం తెలుపగా “నేను కూడా నీతో వస్తాను” అని చెప్పింది. కేవలం రెండు టికెట్లు మాత్రమె ఉన్నాయి. అవి మేము తీసుకున్నాము. మరుసటిరోజు నా స్నేహితురాలి భర్త మమ్మల్ని పంపడానికి వచ్చారు. దాదాపు రెండుగంటలప్పుడు ఉగార్ చేరుకున్నాము. అది జనవరి 1, 1980. భగవాన్ రమణులను ప్రార్థించిన ఎనిమిది రోజులకు నేను మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి సాన్నిధ్యంలో ఉన్నాను. ముకుళిత హస్తాలతో స్వామివారి ముందు నిలబడ్డాను. పద్దెనిమిదేళ్ళ ఈ సుదీర్ఘ నిరీక్షణ నా అశ్రుధారలలో తడిసి ముద్దైపోయింది. మహాస్వామివారు సైకిలుకు తగిలించిన చిన్న గూడులాంటి దాన్లో కాళ్ళు, చేతులను శరీరానికి దగ్గరగా ఆన్చుకుని కూర్చున్నారు. వారు నన్ను తదేకంగా చూస్తున్నారు. కాని నేను వారి కళ్ళల్లోకి చూడలేకపోయాను. బస్సు ప్రయాణంలో నాకు వచ్చిన కొద్ది సంస్కృత భాషా జ్ఞానంతో స్వామివారికి చిన్న ఉత్తరం వ్రాశాను. రెప్పార్పకుండా నన్నే చూస్తున్నారు స్వామివారు. నాకు కళ్ళ నీరు ఆగడంలేదు. అలా నా బుగ్గలపై నుండి కారిపోతున్నాయి. ఇలా ఐదారు నిముషాలు గడిచింది. ఎవరో నాతో, “అక్కడ ఉన్న గుడిసె వంటి గదిలో యతి నారాయణానంద కూర్చున్నారు. వెళ్లి అక్కడ కూర్చోండి” అని చెప్పారు. నేను అక్కడ కూర్చున్నాను. వెంటనే స్వామివారి శిష్యులొకరు వచ్చి, “మీ పేరేమిటి?” అని అడిగారు. “శశికళ” అని చెప్పాను. “మీ పేరు అదే అయితే, బహుశా మహాస్వామి వారు మిమ్మల్నే పిలుస్తున్నారు. ఈరోజు మౌనంలో ఉన్నారు. వారు తలపై చంద్రుని సంజ్ఞను చూపిస్తున్నారు. మీరు రండి” అని చెప్పారు. అక్కడికి వెళ్లి నేలపై పడి నా తలను తాటించి నమస్కరించాను. మదిలో ఒక ఆలోచన మెదిలింది. “స్వామీ! మీ దర్శనం కోసం పద్దెనిమిది సంవత్సరములు నిరీక్షించాను. కానీ మీ దివ్య పాదాలు నాకు కనిపించడం లేదు”. వెంటనే స్వామివారు బండి నుండి క్రిందకు దిగి నా ముందు నిలబడ్డారు. పదే పదే నా తలను నేలకు తాటించి నమస్కరించాను. స్వామివారు నా మనస్సును చదువుతున్నారు. వెంటనే మరొక కోరిక కలిగింది. మౌనంగా స్వామివారితో సంభాషించసాగాను. “స్వామీ మీరు ఈరోజు మౌనంలో ఉన్నారు. మరి మీ మాటలను నేను ఎలా వినగలను? ఏదైనా మాట్లాడండి స్వామీ” వెంటనే స్వామివారు శ్రీ నారాయణానంద యతి ఉన్న గదివైపు వెళ్ళారు. స్వామివారు గది ముందు కూర్చుని వారికి ఏవో సంజ్ఞలు చేశారు. నారాయణానంద యతి గది చివరకు చూసి పుస్తకాలు పెట్టే అర నుండి ఒక పుస్తకం తీసుకుని చదవడం ఆరంభించారు. వారు చదివిన దానికి పరమాచార్య స్వామివారు సంస్కృతంలో భాష్యం చెబుతున్నారు. నా కోరికను మరలా మన్నించారు స్వామివారు. కాని లౌకిక వృత్తులలో పరిభ్రమించే మన బుద్ధి చాలా చిన్నది. వెంటనే అక్కడ ఉన్న స్వామి సహాయకులతో, “ఈరోజు మహాస్వామి వారు మౌనంలో ఉన్నారు కదా? మరి ఎలా మాట్లాడుతున్నారు?” అని అడిగాను. ఆ సహాయకుడు చిన్నగా నాతో, “వారు ఎదో లౌకికమైన భాషలో సామాన్య విషయముల గురించి మాట్లాడటం లేదు. వారు మాట్లాడుతున్నది దేవభాష అయిన సంస్కృతంలో. అదికూడా ఉపనిషత్తులకు అర్థం వివరిస్తున్నారు. అవి సామాన్య మానవులు రచించినవి కావు. అవి వేదప్రోక్తములు. కనుక వేద విషయాలను సంస్కృత భాషలో తెలపడం వల్ల మౌనవ్రతానికి భాగం కాదు” అని చెప్పారు. నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య మహాస్వామివారు ఒక సామాన్య భక్తురాలి కోరికను తీర్చడం కోసం తమ మౌనవ్రతానికి ఎటువంటి ఆటంకమూ రాకుండా ఇలా నా కోరిక తీర్చారు. భక్తుల కోరికలు తీర్చడానికి జ్ఞానులు ఎంత త్వరగా ప్రతిస్పందిస్తారు. కాని ఇది కేవలం ఈ భక్తురాలికి మాత్రమే తెలుసు. ఇతరులకు ఇదేమీ అర్థం కాదు. రాత్రి ఎనిమిది గంటలప్పుడు మరలా స్వామివారి దర్శనానికి వెళ్లాను. అప్పుడు కూడా స్వామివారు ఆ చిన్న బండిలో శరీరాన్ని దగ్గరిగా చేర్చుకుని కూర్చున్నారు. తాబేలు లాగా కాళ్ళు చేతులు శరీరానికి ఆన్చుకుని తలను వంచి కళ్ళుమూసుకుని ఉన్నారు. నా స్నేహితురాలితో కలిసి శ్రీ దివేకర్ గారి ఇంటికి వెళ్లి, భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాము. “స్వామివారు తెల్లవారుఝామున మూడు మూడున్నరకు లేస్తారు. అప్పుడు సువాసినులు స్వామివారికి హారతి ఇస్తారు. అప్పుడు వారి దర్శనం చేసుకోవడం చాలా ప్రశస్థమని భావిస్తారు” అని దివ
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

వర్షం - వ్యవసాయం నాకు సంబంధించిన విషయం చెప్పుకునే ముందు నాకు అత్యంత ఆప్తులైన శ్రీ జి పార్థసారథి గారు పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకున్న సమయంలో ఆయన పొందిన అనుభూతిని తెలియజేస్తాను. శ్రీ జి పార్థసారథి ఐక్యరాజ్యసమితిలో భారతదేశ రాయబారి. ఇందిరా గాంధి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ సలహాదారు కూడా. ఎప్పుడైనా ఢిల్లీ నుండి తమిళనాడుకు వస్తే కంచికి వెళ్ళకుండా, పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోకుండా ఉండరు. వెళ్ళిన ప్రతిసారీ మహాస్వామి వారు దాదాపు అరగంట సేపు మాట్లాడేవారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పటిదాకా ప్రపంచంలో జరిగిన సంఘటనల గురించి ప్రతి ఒక్క విషయమూ మాట్లాడేవారు. మిగతా దేశాలతో మన దౌత్య సంబంధమైన విషయముల గురించి తగు సూచనలు ఇచ్చేవారు. పార్థసారథి గారు ఆ విషయాలను అతిశయంతో నాతో పంచుకునేవారు. మహాస్వామివారు చెప్పిన విషయాల గురించి వారి జ్ఞానసంపద గురించి పలుమార్లు నాతో చెబుతూ స్వామివారి మేధస్సు అమోఘం అని కొనియాడేవారు. ఇద్దరమూ స్వామివారికి ఒక నమస్కారం చేసుకునేవారము. ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు, స్వామివారు పల్లకిలో కూర్చున్నారు. నేను వెళ్ళి స్వామివారి ముందు కూర్చున్నాను. అప్పుటికి నేను మంత్రి పదవిలో ఉన్నాను. పనైమరత్తుపట్టి నియోజకవర్గం నుండి గెలిచాను. నా నియోజకవర్గంలో ఉత్తమచోళపురం అనే ఒక గ్రామం ఉంది. అది తిరుమణి ముత్తారు నది ఒడ్డున ఉంది. ఆ ఊళ్ళో కరైపురనాథ స్వామివారి దేవాలయం ఉంది. అది చేరనాడు (చేరనాడు, చోళనాడు, పాండ్యనాడు అని మూడు భాగాలుగా ఉండేది ప్రాచీన తమిళనాడు). ఆ దేవాలయంలోనే అవ్వయ్యార్ పారీ రాజు కుమార్తెలు అంగవై, సంగవైలకు వివాహాలు జరిపించింది. ఆమె ఆదేశాన్ని అనుసరించి చేర, చోళ, పాండ్య రాజులు వచ్చి ఆశీస్సులు అందించారు. పరమాచార్య స్వామివారు సేలం నుండి కోయంబత్తూరుకు పాదయాత్రగా వచ్చారు. అదే మార్గంలో ఉత్తమచోళపురం ఉంది. దారి ఎదురుగా ఉత్తమ చోళుడు నిర్మించిన శివాలయం ఉంది. మొదటిసారి పనైమరత్తుపట్టి నియోజకవర్గం నుండి ఉపఎన్నికల్లో పోటీ చేశాను. కరైపురనాథర్ అనే పేరున్న ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించే ఎన్నికల ప్రచారానికి వెళ్లేవాణ్ణి. పరమాచార్య స్వామివారు ఆ దేవాలయం ముందరకు రాగానే, ఆలయ శివాచార్యులు స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం పలికి, ఆలయానికి రమ్మని ఆహ్వానించారు. స్వామివారు కొద్దిగా తల ఎత్తి పైకి చూశారు. అప్పటికి ఆ ఆలయానికి రాజగోపురం లేదు. అందుకు స్వామివారు, “ముందు ఆలయానికి గోపురం నిర్మించండి. తరువాత వస్తాను” అని చెప్పారు. స్వాగతాన్ని మాత్రం స్వీకరించి ముందుకు నడిచారు. చాలా ఏళ్లపాటు నాకు ఈ విషయం తెలియదు. రెండవ సారి ఎన్నికలు గెలిచినా తరువాత అక్కడి శివాచార్యులు ఈ విషయం నాకు చెప్పారు. నా నియోజకవర్గంలో ఉన్న ఇంత గొప్ప ఆలయాన్ని పరమాచార్య స్వామివారు దర్శించాకుండానే వెళ్ళిపోయారే అని నాకు బాధ కలిగింది. అందుకు కారణం తెలుసుకోదలచి, “నా నియోజకవర్గంలో దేవాలయం మీరు ఎందుకు దర్శించలేదు?” అని అడిగాను. అప్పుడు అర్థం అయ్యింది వారి జ్ఞాపకశక్తి ఎంతటిదో! “ఉత్తమచోళపురం నీ నియోజకవర్గంలో ఉందా?” అని అడిగారు స్వామివారు. నేను ఊరిపేరు కూడా చెప్పలేదు. అప్పటికి ఈ విషయం జరిగి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. నేను మాటలురాక ఆశ్చర్యంతో కూర్చుండిపోయాను. “అక్కడ గోపురం లేదు. ఎందుకు నువ్వే కట్టించారాదు?” అని అడిగారు స్వామివారు. స్వామివారి ఆదేశం, అనుజ్ఞ అయ్యింది. ఖచ్చితమైన నిర్ణయంతో అక్కడి నిండి బయలుదేరాను. కంచి నుండి నేరుగా ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీ కె.యస్. నారాయణన్ వద్దకు వెళ్లాను. సంబంధ శాఖతో మాట్లాడి కావాల్సినన్ని సిమెంటు బ్యాగులు పంపుతాను అని చెప్పారు. మొత్తం ఖర్చు భరించడానికి ఇప్పుడు ఒకర్ని వెదకాలి. అందుకే ఆరుట్ సెల్వర్ శ్రీ మహాలింగం సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ ఈరోడ్ కైలాస గౌండర్ ని కలిసి వారి అంగీకారాన్ని తీసుకున్నాను. గోపురం ఆకృతి గురించి ఆలోచిస్తుండగా, నంగవల్లి దేవాలయ గోపురం స్ఫురించింది. స్నేహితులతో కలిసి ఒకసారి వెళ్లి చూశాను. చాలా అద్భుతమైన కట్టడం. వెంటనే ఆ స్థపతితో మాట్లాడి ఉత్తమచోళపురం దేవాలయ గోపుర నిర్మాణానికి ఒప్పించాను. ఈ కార్యం మొత్తం చూసుకోవడానికి ఒక వ్యక్తీ కావాలి కదా! దేవాలయ నిర్మాణ కమిటి అధ్యక్షుడిగా శ్రీ ఆర్. జయకుమార్ ని అడుగగా, ఆయన అంగీకరించారు. అప్పుడు శ్రీ రామస్వామి ఉదయర్ పోరూర్ లొ రామచంద్ర వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. కళాశాల నిర్మాణం కోసం రంగూన్ నుండి టేకు కలప తెప్పించారని విన్నాను. వెళ్లి అడగగానే, “తలుపులకోసం నా దగ్గర ఉన్నదాంట్లో నీకు ఎంత కావాలో చెబితే అంత, నా స్వంత లారీలో పంపుతాను” అన్నారు. పన్నెండు అడుగుల ఎత్తు ద్వారంబంధాలు చేయించాము. ముందు కేవలం మూడంతస్తుల గోపురం నిర్మాణం చేద్దామని అనుకున్నాము. కమిటి అధ్యక్షుడు జయకుమార్ గారి సూచన మేరకు ఐదు అంతస్తుల గోపురం నిర్మాణం చెయ్యాలని తిర్మానిన్చాము. ఆ శివాలయం ప్రశస్తి ఏమిటంటే, చైత్ర పౌర్ణమి రోజు రెండు బస్తాల వండిన అన్నాన్ని అభిషేకించి, మరుసటి రోజు ఉదయం సాంబారు కలిపి ఆ సంబా
Back

కంచి పరమాచార్య వైభవం

భగవాన్ పడి అళప్పన్ పరమాచార్య స్వామివారు చెన్నై బెంగళూరు జాతీయ రహదారి మధ్యలో ఉన్న కావేరీపాక్కం అనే చిన్న ఊరిలో మకాం చేస్తున్నారు. దాదాపు 40 - 50 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. అప్పట్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం గురుదక్షిణగా వచ్చే నాణాలను లెక్కపెట్టి కంచి మఠానికి పంపేవాళ్ళం. పీఠము, పీఠపరివార అవసరాల ఖర్చుల కోసం మఠం నుండే డబ్బులు వచ్చేవి. చాలా అరుదుగా అవసరాల కోసం మహాస్వామివారి అనుమతితో గురుదక్షిణ నుండి తిసుకునేవారం. రోజు రోజుకూ భక్తుల సందర్శన తగ్గిపోవడంతో మొదలయ్యాయి మా కష్టాలు. అన్నింటిని చూసుకుంటున్న శ్రీకంఠన్ ఎన్నిసార్లు అడిగినా మఠంవారిని డబ్బులు అడిగే విషయంలో మహాస్వామివారి సమాధానం ఒక్కటే “భగవాన్ పడి అళప్పన్” (భగవంతుడే అన్నీ చూసుకుంటాడు) అని. రోజువారీ తిండి కూడా సమస్యగా ఉంది. భక్తులు ఇచ్చే కానుకలు కనీసం రోజుకు ఒక్కరూపాయి కూడా అవ్వట్లేదు, మరి భగవంతుడు ఎలా కాపాడతాడు అని శ్రీకంఠన్ ఆశ్చర్యం. ఇంతలో ఆంధ్ర దేశానికి చెందిన ఒక బస్సు కావేరిపాక్కం వద్ద ఆగిపోయింది. దాని మరమ్మత్తుకు కావాల్సిన వస్తువులు 30 మైళ్ళ దూరం నుండి తేవాలి. మరమ్మత్తు పనులు కనీసం మూడునాలుగు గంటలు పట్టవచ్చు. ఏమి తోచక యాత్రీకులు అందరూ కిందకు దిగి అక్కడ ఇక్కడ ఉంటున్నారు. గొర్రెలు కాచే పిల్లవాడు ఒకడు వారిని చూసి, “స్వామివారిని చూడటానికి వెళ్తున్నారా?” అని అడిగాడు. వెంటనే వారు ఆనందంతో పరమాచార్య స్వామివారు ఉన్న ప్రదేశానికి వచ్చారు. భక్తులందరూ పావు అణా, అర్ధ అణా కానుకగా సమర్పించుకున్నారు. బస్సు దగ్గరకు వెళ్ళగానే మరొక బస్సు కూడా అక్కడ ఆగిఉండడం గమనించారు. ఏదైనా సహాయం కావాలేమో అని ఆ బస్సువారు ఆపి అడుగుతున్నారు. మహాస్వామి వారి గురించి తెలియగానే వారు కూడా దర్శనానికి వచ్చారు. దాంతో గురుదక్షిణ పెద్ద నాణాల గుట్టలాగా అయ్యింది. మరుసటి రోజు సేవకులు లెక్కపెట్టడానికి కూర్చోగానే, “వీటిని ఒక సంచిలో వేసి మఠానికి పంపుదాము. వారే లెక్కపెట్టుకుని జమ చేసుకుంటారు“ అని శ్రీకంఠన్ చెప్పాడు. ఒక సంచి తెచ్చి నాణాలను అందులో వెయ్యడానికి “పడి” (ఒక కొలత పరికరం) తీసుకుని వచ్చారు. వెనుకనుండి పరమాచార్య స్వామివారు వచ్చి, “శ్రీకంఠన్ నీకు నేను చెప్పాను ‘”భగవాన్ పడి అళప్పన్ అని. చూడు ఇప్పుడు చూసుకున్నాడు కదా” అని శ్రీకంఠన్ చేతిలో ఉన్న పడిని చూపించారు. ‘పడి’ అను పదానికి అర్థం అనుగ్రహం మరియు కొలత పాత్ర కూడా! అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ పరమాచార్య వైభవం

శతాభిషేకం - శివ సాయుజ్యం ఈ సంఘటన చెన్నై భక్తుడు శ్రీ వెంకటరమణి చెప్పినది. వారు మూడు తరాలుగా కంచి మఠానికి భక్తులు. వారి తండ్రిగారు కామాక్షిపురం శ్రీ వైద్యనాథ అయ్యర్, పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తులు. పరమాచార్య స్వామివారి ఆదేశాలను వారు శ్రద్ధాభక్తులతో అమలుపరిచేవారు. స్వామివారు కూడా వారిపై అత్యంత కరుణను చూపించేవారు. ఆయనకోసమని ఏదీ చేసుకోలేదు. కనీసం వారు అరవై, డెబ్బై ఏళ్ల వయస్సులో జరిపే షష్యబ్దిపూర్తి, భీమరథ శాంతులు కూడా చేసుకోలేదు. జీవితంలో ప్రతీది ఈశ్వరార్పణంగా చేశారు. వారి భార్యకు కూడా ఇటువంటి వాటిపై ఆసక్తి ఉండదు. కాని వారికి ఏనాభైనాలుగేళ్ళ వయస్సప్పుడు శాతాభిషేకం చేయాలని సంకల్పించారు. పిల్లల బలవంతం పైన, పరమాచార్య స్వామివారి ఆశీస్సులు అర్థించమని, వారు ఒప్పుకుంటే జరుపుకుంటానని చెప్పారు. వెంటనే వెంకటరమణి తన తల్లిని చెల్లిని తీసుకుని కాంచీపురం దగ్గరలోని ఒక పల్లెలో మకాం చేస్తున్న మహాస్వామివారి వద్దకు వెళ్ళారు. స్వామివారు నివసిస్తున్న గృహం ముందరే స్వామివారి దర్శనం లభించింది. పరమాచార్య స్వామివారు ఒక దుర్భిణి సహాయంతో ఎదో పుస్తకాన్ని చదువుతున్నారు. పళ్ళు, పూలు, టెంకాయలు, తాంబూలం ఉన్న పళ్లాన్ని పరమాచార్య స్వామివారి ముందు ఉంచి విషయం తెలిపారు. “శాతాభిషేకం పెద్దాయనకా?” అని అడిగారు కానీ, ఎప్పుడూ ఇచ్చినట్టు వారికి ప్రసాదం ఇవ్వలేదు. మరలా పుస్తక పఠనంలో మునిగిపోయారు. కొద్ది నిముషాల్లో దంపతులొకరు తమ కుమార్తె వివాహమై పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చారు. స్వామివారు వారి పళ్లాన్ని స్వీకరించి పెళ్ళిపత్రికను తమవద్ద ఉంచుకున్నారు. సంతోషంతో వారు వెళ్ళిపోయారు. ఇది చూడగానే, తల్లి, చెల్లితోపాటు వెంకటరమణి కూడా కాస్త నొచ్చుకున్నాడు. మమ్మల్ని మాత్రమే పరమాచార్య స్వామివారు ఆశీర్వదించలేదని కలతచెందారు. వారితోపాటు అక్కడున్న ఇంకొందరిని పుదు పెరియవ (జయేంద్ర సరస్వతి స్వామి) తో ప్రసాదం తీసుకోవాల్సిందిగా ఆదేశించి లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు. జయేంద్ర సరస్వతి స్వామివారి వద్ద ప్రసాదం దొరికినా, పరమాచార్య స్వామివారు ప్రసాదం ఇచ్చేదాకా వెళ్లకూడదని నిశ్చయించుకున్నారు. వారు అక్కడే నిలబడియుండగా, “మీ తండ్రిగారికి వెంటనే శాతాభిషేకం నిర్వహించండి” అని ఆజ్ఞాపించారు కాని ప్రసాదం ఇవ్వలేదు. సగం సంతోషంతోనే చెన్నై వెనుతిరిగారు. మరుసటిరోజు కంచిలో నివసించే వారి బంధువులొకరు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకుని చెన్నై వెళ్ళమని ఆదేశించారు. “వెళ్లి వారితో చెప్పు మీ తాతగారికి వెంటనే శాతాభిషేకం నిర్వహించమని” అని అతనితో చెప్పారు స్వామివారు. ప్రసాదం పంపినందుకు, శాతాభిషేకం వెంటనే నిర్వహించమని ఆదేశించినందుకు వైద్యనాథ అయ్యర్ కుటుంబం మొత్తం సంతోషపడ్డారు. మరుసటిరోజే ఉత్సవం నిర్వహించారు. శాభిషేకం జరిగిన మరుసటి రోజు, వైద్యనాథ అయ్యర్ గారు కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ఒకానొక ఆనందకర క్షణంలో లిప్తపాటులో శరీరాన్ని త్యజించారు. పరమాచార్య స్వామివారి కారుణ్యము, ఉత్సవం వెంటనే నిర్వహించమని ఆదేశించిన కారణము అర్థ అయ్యాయి కుటుంబసభ్యులకు. వారి ఆయుష్షు సమాప్తమవుతుందనే విషయం మహాస్వామివారి తెలుసు. కేవలం ఈ ఉత్సవం కోసమే వారికి మరొక్క రెండురోజులు ఆయుష్షును ప్రసాదించారు. భూతభవిష్యత్ వర్తమానాలు తెలిసిన స్వామివారు వారి భక్తుల కోరికలను తీర్చడంలో వాటికీ అతీతంగా అనుగ్రహిస్తారు. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో, త్వయి భక్తిం అచంచలం అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। --- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవ మహిమై” పత్రిక నుండి #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

పరమాచార్య వైభవం

పండరీపురంలో పరమాచార్య కంచి కామకోటి పీఠం పీఠాదిపతులు జగద్గురువులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు మకాం చేస్తున్న పండరీపురానికి వెళ్ళాకనే తెలిసింది ఆధునిక నాగరికతకు విషపు కోరల్లో పడకుండా పల్లెటూళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నాయో. కురుద్వాడి నుండి పండరీపురానికి వెళ్ళే ట్రైను చాలా పాతకాలం నాటిది. చిన్న బోగీల్తో, చిన్న చిన్న సీట్లతో ఉంది. ప్రయాణీకులు అందరూ పల్లెటూరివారు మరియు యాత్రికులు. చాలామంది కిందనే కూర్చున్నారు. పచ్చని పొలాల మధ్య రెండున్నర గంటల పాటు ఎంతో ఆహ్లాదంగా జరిగింది. అంత పాతకాలం నాటి ట్రైను కూడా ఖచ్చితంగా సమయానికి చేరుకుంది. నాకు హిందీ సరిగ్గా రాకపోయినా నాకు కావాల్సిన సమాచారం తెలుసుకున్నాను. ట్రైనులో ఒక ప్రయాణికుడు నాతో, “శ్రీ శంకారాచార్య మహారాజ్ విఠల ఆలయానికి కొద్ది మైళ్ళ దూరంలో ఉన్నారు” అని చెప్పాడు. అందరూ నా రాక గురించి మరాఠిలో అడగడం మొదలుపెట్టారు. స్టేషనులో మనకు లభించే ఒకేఒక్క ప్రయాణ సాధనం టాంగా. ఒక టాంగా వాడు మొత్తం సామాన్లతో సహా ప్రయాణికులను కూడా కుక్కేశాడు. ప్రయాణం మొత్తం ఏవేవో విషయాలు చెబుతూనే ఉన్నాడు. బస్సు ప్రయాణాల వల్ల కలిగే ఇబ్బందుల నుండి విఠలుని గొప్పదనం దాకా! నన్ను ఒక హోటలు వద్ద దింపి చక్కాపోయాడు. ఒక గంట తరువాత మరొక టాంగావాలాను చూసుకుని శంకరాచార్య మహారాజ్ వద్దకు తీసుకుని వెళ్లి తిరిగి నా బసకు తిసుకునిరావడానికి మాట్లాడుకుని బయలుదేరాను. చాలా దూరం అని, కష్టతరమైన ప్రయాణం అని కూడా చెప్పాడు. కాని తరువాత నాకు తెలిసింది అతని చెప్పినంత దూరం, కష్టం ఏమి కాదు. ఆ టాంగావాలా చెప్పినట్టు పండరీపురంలో నది చంద్రవంక లాగా ఉన్నందున దాన్ని చంద్రభాగ నది అంటారని చెప్పాడు. ఆ నది చాలా చూడముచ్చటగా ఉంది. విఠలాలయం నుండి వస్తున్నా భక్తులను శంకరాచార్యుల దర్శనం కోసం ఒకవైపు నుండి మరొక్క వైపుకు తీసుకువెళ్తున్న పడవలు కనిపించాయి. అప్పుడే తెలవారుతుండగా దర్శనం కోసమని స్వామి సన్నిధికి నడిచాను. దేశం నలుదిక్కుల నుండి వచ్చిన భక్తులు అక్కడ ఉన్నారు. లోపల ఉన్న పెద్ద హాలులో తెల్లవారుఝాము నుండే పరమాచార్య స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆశ్రమ సహాయకులొకారు భక్తుల ప్రార్థనలను స్వామివారికి చేరవేస్తున్నారు. “స్వామివారు ఎప్పుడు బయటకు వస్తారు?, దర్శన సమయం ఎప్పుడు?” లాంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. కొద్దిసేపటి తరువాత భక్తుల సంఖ్య ఎక్కువవడంతో ముందున్న మరొక్క హాలులోకి పంపారు. భక్తులందరిని ఒక వరుసలో నిలబెట్టి, రెండు చెక్కబల్లలను భక్తులను నియంత్రించడానికి పెట్టారు. ఇద్దరు కానిస్టేబుళ్ళు అక్కడున్నవారిని వరుసగా నిలబెడుతున్నారు. ధృడకాయుడైన ఒక చౌకిదారు వంటి వ్యక్తీ భక్తులకు సూచనలు ఇస్తున్నాడు. ఒక యువతి “హర హర శంకర, కాలడి శంకర” అని భజనలు మొదలుపెట్టింది. ఒక్కసారిగా మొత్తం హాలంతా భక్తితో నిండిపోయింది. ఒక యువకుడు అందరికంటే బిగ్గరగా భజనలు పాడడం మొదలుపెట్టాడు. అక్కడ పరమాచార్య స్వామివారు రావడానికి మూడు ద్వారాలు ఉన్నాయి. బహుశా వారు ముందున్న ద్వారంగుండా వస్తారేమో, అక్కడ కొందరు ఆడవారు, మగవారు పూలు, పళ్ళు, హారతి పళ్ళాలు పట్టుకుని ఉన్నారు. వారి వెనుక ఒక మధ్యవయస్కుడైన వ్యక్తీ వరుసలో ముందు నిలుచున్నందుకు చాలా సంతోషంతో కనిపిస్తున్నాడు. కొద్ది దూరంలో నిలబడియున్న భార్య, కుమార్తెలను వచ్చి తన వెనకాతల నిలబడమని చెబుతున్నాడు. క్షణాలు గడుస్తున్నాయి. అనదరి కళ్ళూ ముందున్న ద్వారం పైనే ఉన్నాయి. అప్పుడే కొంతమంది మాటలు విన్నాము. మహాస్వామివారు శిష్యునితో కలిసి మరొక్క ద్వారం గుండా వచ్చారు. అందరూ “జయ జయ శంకర!” అంటూ అటువేపు తిరిగారు. అందరిని కూర్చోవలసిందిగా చేతితో సైగ చేశారు స్వామివారు. ఆ చౌకిదారు స్వామివారికి సాష్టాంగం చేశాడు. అతణ్ణి గుర్తుపట్టి పేరు పిలిచి, మాట్లాడడంతో తనకు కలిగిన గౌరవానికి మహదానందపడ్డాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। --- ఎ. ప్రసన్న కుమార్, “ఎ సేజ అట్ పంధర్ పూర్” నుండి #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

కంచి పరమాచార్య వైభవం

ఆచార్య - పరమాచార్య శతాబ్దాలుగా మన పుణ్యభూమి భారతదేశం ఎందఱో ఆచార్యులకు, సాధువులకు, సన్యాసులకు, మహాత్ములకు జన్మను ఇచ్చింది. అటువంటి వారి పాద రజస్సు చేత, లోతైన జ్ఞనము చేత, తపస్సు చేత, పాండిత్యము చేత దశాబ్దాల పాటు ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేస్తున్నారు. వారందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. ఈ ప్రపంచం కాని, మన భారతదేశం కాని ఎన్నడూ చూడని గొప్ప సాధు సత్పురుషులు పూజ్య జగద్గురు శంకరాచార్య పరంపరలో వచ్చిన కంచి కామకోటి పీఠం 68వ పీఠాదిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామివారు. మనకు తెలిసినంతలో 87 సంవత్సరాల పాటు పీఠాదిపతిగా ఉన్నవారు బహుశా ఎవరూ లేరు. అతి చిరు ప్రాయంలో 13 సంవత్సరాల వయస్సులో సన్యసించి జగద్గురు స్థానాన్ని అలంకరించి, 87 చాతుర్మాస్యాలను చేసి తమ నూరవ సంవత్సరంలోకి అడుగిడుతున్న వారు కూడా ఎవరూ లేరు. దాదాపు 25 శాతబ్దాలకు పూర్వం సాక్షాత్ శంకరుడే కేరళలోని కాలడిలో శ్రీ ఆది శంకర భగవత్పాదులుగా ఈ భూమిపై వెలసి, 72 అవైదిక మతాలను ఖండించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిస్తాపించి, సనాతన మతమును ఉద్ధరించారని మనకు చెరిత్ర తెలుపుచున్నది. శతాబ్దాల తరువాత మరలా వైదిక మత స్థితిని, సమసిపోతున్న మానవతా విలువలను చూసి, ఆదిశంకరులే మరొక్కసారి అవతరించాలని నిర్ణయించుకున్నారు. మన పరమాచార్యుల వారి జీవితము, బోధలూ కూడా భగవాన్ ఆది శంకరులకు సమము. మన అదృష్టం ఏమిటంటే మనం జీవించిన కాలము శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీపాదుల కాలము. పరమాచార్యుల వారు నడిచే దైవం, జీవన్ముక్తులు, త్రికాలవేదులు. కేవలం భారతియులనే కాక, విశ్వ మానవాళిని అనుగ్రహించిన ఇరవైవ శతాబ్దపు అవతారం. విశ్వ ప్రజల బాధలను, ఆర్తిని తీర్చడానికి వచ్చిన సమతామూర్తి. వారిపై వచ్చిన గ్రంథాలు అనేకం. కానీ అవన్నీ ఎప్పటికి అసంపూర్ణములే, ఎందుకంటే ఒక శతాబ్దపు జీవితాన్ని, బోధలను వ్రాయడానికి ఆ శతాబ్దపు జీవితాలన్నీ కూడా సరిపోవు. మా తాతముత్తాతల ఆశీస్సుల వల్ల 1954లో కలవైలో నాకు వారి ప్రథమ సందర్శనం కలిగింది. అప్పటినుండి నలభై ఏళ్లుగా ఎన్నో అనుభూతులు, అనుభవాలు, జివితపాఠాలు నాకు ప్రసాదించారు. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో వేలసార్లు స్వామిదర్శనం చేసుకున్నాను. వాటిలో ఎన్నో మరపులేని మరపురాని మధురస్మృతులు. 1967లో పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని ఏలూరులో చాతుర్మాస్యం చేస్తున్నారు. మేము ఒక యాభై మందిమి కలకత్తా నుండి స్వామివారికి భిక్షావందనం సమర్పించడానికి వచ్చాము. మాతో రావడం కుదరక కలకత్తాలో ఉన్న భక్తులకోసమై మహాస్వామివారి సందేశాన్ని రికార్డ్ చేసి సాయింత్రం వెళ్ళే కలకత్తా రైలుకి నాతో తీసుకుని తిసుకునివేళ్ళాలని భిక్షావందనం రోజు తెల్లవారుఝామున ఒక సేవకునితో చెప్పాను. మద్యాహ్నం మూడున్నర ప్రాంతంలో నను శ్రీవారు రమ్మన్నారు. కాని ఐదు ముప్పావు తరువాత కాని నాకు స్వామివారి పిలుపు రాలేదు. మిగిలినవారందరినీ సాయింత్రం రైలుకు కలకత్తా వెళ్ళమని చెప్పి, నేను నా భార్య మరుసటిరోజు వెళ్దామని అక్కడే ఉండిపోయాము. అపార కరుణాసముద్రులైన స్వామివారు మాకోర్కే మన్నించి టేప్ రికార్డర్ లో రికార్డు చేయబడిన సందేశాన్ని మాకు అనుగ్రహించారు. కలకత్తాలో మా అందరి గురించి అడిగారు. దాదాపు 6-45 గంటలప్పుడు “కలకత్తాకి ఎప్పుడు వెళ్తున్నారు?” అని మమ్మల్ని అడిగారు. ఆరోజు 6-30 ట్రైనుకే మేము కలకత్తా వెళ్ళవలసి ఉందని, కాని ఆ ప్రయాణం కంటే మాకు స్వామివారి సందేశం చాలా ముఖ్యమని, మా ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నామని వినయంతో స్వామివారికి చెప్పాను. మహాస్వామివారు సన్నటి నవ్వుతో, “వెళ్ళు, వెళ్లి ప్రయత్నించు. బహుశా ఈరోజు రైలు ఆలస్యంగా రావచ్చు” అని అన్నారు. వెంటనే నా భార్యతో కలిసి పరుగు పరుగున స్టేషనుకు చేరుకుంటే, ఆరోజు మేము వెళ్ళవలసిన రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోందని తెలిసింది. ఆ రోజు రైలు ఆలస్యంగా నడుస్తోందని ఆ జివన్ముక్తులకు తెలుసు. కాని అలా చెప్పక “వెళ్ళు, దొరకవచ్చేమో” అని అన్నారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। --- “కైంకర్య శిరోమణి” డా. యస్.వి. నరసింహన్ #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

కంచి పరమాచార్య వైభవం

క్యాన్వాసుపై కరుణామూర్తి ఒకసారి నా భార్య పద్మావతి నన్ను ఆటపట్టిస్తూ, నేను చిత్రకారుణ్ణి కాబట్టి, ఇవేవి కాదు గాని పరమాచార్య స్వామివారి చిత్రపటాన్ని చిత్రించమని, ఇక జీవితాంతం వేరే ఆలోచన లేక ఆ చిత్రపటాన్నే చూస్తూ ఉంటానని చెప్పింది. ఈ విషయమై కంచి శ్రీమఠానికి ఉత్తరం వ్రాయగా వెంటనే రమ్మని కబురు వచ్చింది. నేను పరమాచార్య స్వామివారికి నమస్కరించి, నేను వచ్చిన విషయం విన్నవించగానే, “అయితే నువ్వు నా చిత్రపటాన్ని గీస్తావన్నమాట. నువ్వు మాలి (టి. ఆర్. మహాలింగం) శిష్యుడివి. నువ్వు నన్ను ని క్యాన్వాసుపై చిత్రించగలనని అనుకుంటున్నావా?” అని అన్నారు. కొన్నిరోజుల తరువాత ఎలాగైతేనేమి, శ్రీవారిని చిత్రించడానికి ఒప్పుకున్నారు. అది వేసవి మధ్యాహ్నం. శ్రీవారికి కొద్ది దూరంలో బాగా ఎండ పడే చోట నన్ను కూర్చోమన్నారు. ఎండవేడిమి వల్ల కూర్చోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నేల బాగా కాలుతుండడంచేత నేను స్థిమితంగా కూర్చొలేకపోయాను. నా పరిస్థితిని స్వామివారు అర్థం చేసుకున్నారు. వారి కళ్ళల్లో అవ్యాజమైన కరుణ. వెంటనే అక్కడ ఉన్న దృశ్యం మారిపోయింది. అక్కడి వాతావరణం చల్లబడి ఎంతో ఆహ్లాదంగా అనిపించసాగింది. ఇంకా శ్రీవారు తమ లీలలు చూపిస్తున్నారు. ఎంత ప్రయత్నించినా స్వామివారిని సరిగ్గా చిత్రించలేకపోతున్నాను. చివరగా ఎన్నో ఓటముల తరువాత ఎక్కువ అత్యంత నిబద్ధతతో శ్రీవారి చిత్రం పూర్తిచేసి, ఆశిస్సుల కోసం వారి పాదముల వద్ద ఉంచాము. నేను, నా భార్య కన్నీరు ఆపుకోలేకపోతున్నాము. ఆ చిత్రపటం సరిగ్గా ఉన్నదని ఆశిర్వాదించమని వేడుకున్నాము. ఒకవేళ శ్రీవారు అది తనలా లేదు అని చెబితే, ధైర్యం చేసి ఆ చిత్రపటం మాకు వద్దు, మీవద్దనే ఉంచుకొమ్మని చెబుదాము అనుకున్నాము. ఒకసారి ఆ చిత్రపటాన్ని తీసుకుని, గుండెలకు ఆన్చుకుని ధ్యానమగ్నులయ్యారు. ఒక్కసారి వరదరాజ స్వామి ఆలయం వంక చూశారు(అప్పుడు స్వామివారు చిన్న కాంచీపురంలో ఉన్నారు). స్వామివారి కళ్ళల్లో సన్నటి నీటిధార. అప్పుడే దేవలాయం గంటలు మ్రోగాయి. శ్రీవారి శరీరంపై ఉన్న బిల్వదళాలు, తులసిమాలను తీసి అ పటంపై ఉంచారు. అక్షతలు, పటికబెల్లం దానిపై ఉంచి రెండు చేతులు ఎత్తి ఇద్దరినీ ఆశీర్వదించారు. కొద్దిదూరంలో నిలబడి అంతా గమనిస్తూ ఉన్న జయేంద్ర సరస్వతి స్వామివారు నాకు పరమాచార్యుల వారి పూర్తి అనుగ్రహం లభించిందని, వారు ఆ చిత్రపటాన్ని అత్యంత కరుణాపూరిత చూపులతో చూశారని చెప్పారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। --- చిత్రకారుడు సిల్పి(పి.యమ్. శ్రీనివాసన్), ‘kamakoti.org’ నుండి #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ పరమాచార్య వైభవం

మహాస్వామి వారి చిత్రపటం చిత్రకారుడు సిల్పి (పి.యమ్. శ్రీనివాసన్) తను చేస్తున్న ఒక పనికోసం నెలరోజులుగా నిరీక్షించిన పరమాచార్య స్వామి వారి దర్శనం లభించిన రోజది. ఆ గొప్ప చిత్రకారుడి జీవితాన్ని పూర్తిగా మలుపుతిప్పిన రోజు. రాత్రి చాలా పొద్దు పోయిన తరువాత, ప్రపంచం మొత్తం గాఢనిద్రలోకి జారుకున్న సమయాన ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఒకరు జగద్విఖ్యాతి చెందిన మహాపురుషులైన సన్యాసులు కాగా, మరొకరు ప్రపంచానికి అంతగా తెలియని గొప్ప చిత్రకారుడు. ఆ పరమపవిత్రమైన గదిలో, నూనెదీపపు వెలుగులో ఆ చిత్రకారునికి ఒక రహస్యాన్ని చెప్పడానికి ఆ సన్యాసి కళ్ళు అత్యంత తెజోవంతములై మెరిశాయి. “ఇప్పటిదాకా నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు. అన్ని జన్మలలో భగవంతుణ్ణి ఎంతో భక్తితో సేవించావు. క్రిందటి జన్మలలో ఎన్నో దేవాలయాలకు స్థపతివై ఎన్నో దైవీ శక్తులు కలిగిన శిల్పాలను మలిచావు. ఇది నీకు చివరి జన్మ. నీకు సంప్రాప్తమైన ఈ దైవకళను వ్యర్థం చెయ్యకు. ఇప్పటినుండి కేవలం దేవతా రూపాలను మాత్రమె చిత్రిస్తానని వాగ్దానం చెయ్యి. నీ ప్రతిభ ఆసాదారణమైనది. నీకు జన్మతః శిలా శాస్త్రము, సాముద్రికా లక్షణము తెలుసు. ఇక వేరే చదువు నీకు అక్కరలేదు. నీ దైవదత్తమైన కళ ద్వారా దైవిత్వాన్ని అన్ని ఇళ్ళల్లో ఆవిష్కరించే లక్ష్యంతో రేపు ఉదయాన్నే ప్రపంచంలోకి వెళ్ళు” అని ఆదేశించారు. ఆ చిత్రకారుడు శ్రీవారి వద్ద సెలవు తీసుకుని, బాహ్య ప్రపంచానికి తెలియని ఎన్నో మారుమూల దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న వివిధ మూర్తులను తన క్యాన్వాసుపై చిత్రిచసాగాడు. అది అంత సులువైన పని కాదు, అత్యంత నియమనిష్టలతో, భక్తిశ్రద్ధలతో ఉన్నవారికి మాత్రమె కుదిరే కార్యం. “నీ ఊహలను ఎంతమాత్రమూ చిత్రించారాదు. శిల్ప శాస్త్రాన్ని అనుసరించి, సాముద్రికా లక్షణంలో తెల్పిన ప్రకారం వివిధ శక్తులతో ఉన్న దేవతా మూర్తులను నువ్వు ఎలా చూస్తున్నావో అలాగే చిత్రించాలి. కొత్తగా వెలుగును ఏర్పాటు చేసుకోకుండా, పరిమితమైన దీపపు వెలుగులో, నువ్వు చిత్రించే సమయంలో నీకు ధ్యానస్థితిలో అగుపించే విశేషాలను మాత్రమె చిత్రించు. నీ కుంచె కదిలికలవల్ల ఆ మూర్తి యొక్క శక్తిని, తేజస్సును కూడా నీ చిత్రాలలో చిత్రించగలుగుతావు” అని స్వామివారు చెప్పిన విషయాలను ఎన్నడూ మరువలేదు. తనకు గురువు, దైవం, మార్గదర్శకులు చెప్పినట్టుగా కొత్త జీవితాన్ని ప్రారంభించి, జీవితాంతం స్వామివారు ఆశిస్సులే ఊపిరిగా బ్రతికాడు. సిల్పి సంసారస్థుడు. తన భార్య పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తురాలు. ఆమె వయోభారం చేత మఠానికి వెళ్లి పరమాచార్య స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకోవడానికి కుదరడంలేదు. అందుకనే ఆమె పరమాచార్య స్వామివారి చిత్రపటాన్ని చిత్రించి ఇంటిలో ఉంచుకుంటే జీవితాంతం వారిని ఆరాధించుకుంటానని తన భర్తని కోరింది. 1956లో తన భార్య కోసం స్వామివారిని చిత్రించడానికి సిల్పి వెళ్ళాడు. కాని స్వామివారు అతనికి సహకరించడం తప్ప అన్నీ చేస్తున్నారు. అటూ, ఇటూ కదులుతూ సిల్పి సహనాన్ని, భక్తిని పరీక్షిస్తున్నారు. చివరికి అంతా ముగిసిన తరువాత సిల్పి చేతిలో ఒక గొప్ప కళాఖండం రూపుదాల్చుకుంది. తన భక్తికి పరాకాష్టలా మహాస్వామివారి కాలివేలి గోళ్ళు మొదలుకుని వారి నుండి వెలువడే దివ్యకాంతి వరకు ఆ చిత్రపటంలో నిండి నిబిడికృతమైంది. అది చాలా ప్రత్యేకమైన చిత్రపటం. మహాస్వామివారి చూపులను అత్యంత సూక్ష్మమమైన రంగుల్లో అందంగా చిత్రించాడు. వేసుకున్న బిల్వమాలలోని బిల్వ దళాలు తాజాగా ఉంటాయి. ఏ ఫోటో కూడా తనలో నింపుకోలేని తేజస్సును తన కుంచె ద్వారా ఆవిష్కరించాడు. ఆ గదిలో స్వామివారి పాదాల వద్ద వెలిగించిన ఒకేఒక్క దీపం స్వామివారి వెలుగులో చిన్నబోయింది. ఇంత అద్బుతంగా ఎప్పుడూ ఎవ్వరూ స్వామివారిని చిత్రించలేదు. ఆ గదిలో కదలకుండా కూర్చుని చిత్రకారుని గమనించి, పూర్తైన తరువాత ఆశీస్సులు అందించి మన పుణ్యవశమున దాన్ని బయలుపరిచారు. చిత్రకారుడు సిల్పి క్యాన్వాసుపై కంచి పెరియవ శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఇప్పటికి సజీవంగా ఉన్నారు. 1956లో సిల్పి కుంచె నుండి జాలువారిన మహాత్తరమైన స్వామివారి చిత్రపటం ఇదే. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

కంచి పరమాచార్య వైభవం

పెళ్లి చీర - పిల్ల తేళ్ళు ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక భక్తురాలు తన కూతురుతో కలిసి శ్రీమఠానికి వచ్చింది. వారి వద్దనున్న పళ్ళెంలో పసుపు, కుంకుమ, టెంకాయలు, తమలపాకులు, పూలతో పాటు మంగళసూత్రాలు కూడా ఉన్నాయి. బహుశా ఆ అమ్మాయికి వివాహం నిశ్చయమైంది అనుకుంటా. ఆ పళ్ళంలో ముహూర్తం చీర కూడా ఉంది. పరమాచార్య స్వామివారు ఎప్పుడూ పట్టువస్త్రముల వాడకాన్ని ఇష్టపడేవారు కాదు. భక్తులను కూడా పట్టును విడువలసిందిగా చెప్పేవారు. పట్టు వస్త్రం తయారీలో ఎంతో జీవహింస ఉంటుంది మరియు అది కేవలం ఐశ్వర్య ప్రదర్శన మాత్రమె కనుక. కాని ఆ విషయం ఈ భక్తురాలికి తెలియక ఎర్రటి పట్టుచీరను స్వామివారి ఆశీస్సుల కోసం తెచ్చింది. మహాస్వామివారి ఆశిస్సులకోసం ఆ పళ్ళాన్ని అందించింది. కాని బాలుమామ దాన్ని ఒప్పుకోలేదు. ఆశీస్సులకోసం ఎర్రని పట్టుచీర పెట్టడంతో కోపంతో, ఆ చీరను తీసివేసి మిగిలిన వస్తువులను మాత్రం అక్కడ ఉంచాడు. పరమాచార్య స్వామివారు లోపలున్న గదిలో ఉన్నారు. బయట ఆ భక్తురాలు బాలు మామతో గొడవకు దిగింది. స్వామివారి ఆశీస్సుల కోసమని ఉంచిన ముహూర్తం చీరను తిసివేయడంతో ఆమె కొంత వేదన పొందింది. ఈ గొడవను విని భక్తులకు దర్శనం ఇవ్వడానికి శ్రీవారు బయటకు వచ్చారు. అక్కడ కూర్చుంటూ, “అవును, ఆ చీరను వేరేగా ఉంచండి” అని అన్నారు. కాని, పరమాచార్య స్వామివారు భక్తుల్ని కష్టపెట్టరు అన్న విషయం తెలిసిందే. అందుకే మహాస్వామివారి మాటలను విని బాలు మామ ఆశ్చర్యపోయారు. ఒక కర్రను తీసుకుని రమ్మని ఆజ్ఞాపించారు. ఆ కర్ర సహాయంతో స్వామివారు ఆ చీర మడతలను విప్పగా, అందులోనుండి ఒక పెద్ద తేలు, రెండు చిన్న తేళ్ళు బయటకు వచ్చాయి. వాటిని చూడగానే ఆ భక్తురాలు భయపడింది. ఇప్పుడే అంగడి నుండి తెచ్చిన కొత్త చీరలో ఆ తేళ్ళు ఎలా వచ్చాయో అని లోచనలో పడింది. కేవలం పరమాచార్య స్వామివారి అపార కృప వల్ల ఆ తేళ్ళ బారినుండి బయటపడ్డాము అని ఊపిరి పీల్చుకుంది. “అందుకే దాన్ని వేరుగా ఉంచమన్నాను” అని అన్నారు మహాస్వామి. వాటిని చంపవద్దని ఆదేశించారు. “వధువు చీర ఈ రంగులో ఉండరాదు. అది ముదురు ఎరుపు రంగులో ఉండాలి. అదే దుకాణంలో ఇచ్చి పసుపుది కాని, వేరే ఏదేని మంగళకరమైన రంగు చీరను తెచ్చుకొండి. ఈ విషయం గురించి దుకాణదారునికి చెప్పవలసిన అవసరం లేదు“ అని వారిని ఆశీర్వదించి పంపారు. స్వామివారు దివ్యదృష్టితో ఆ తేళ్ళను గుర్తించి ఈ పని చేశారు అని అనుకుంటే అది మన మూర్ఖత్వమే. స్వామివారు ఎప్పుడూ చెప్పే మాటల్ని పాటించిన బాలు మామ వాక్కును నిజం చెయ్యడానికి అక్కడికక్కడే ఈ లిలను చేశారు. స్వామిపై మనకి ఉన్ననిజమైన భక్తితో మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుందని మనకు కనువిప్పు కలిగించే సంఘటన ఇది. --- శ్రీ మఠం బాలు మామ, ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

కర్కోటకుడు - మంచివాడు శ్రీమఠంతో చిరకాలంగా సంబంధం ఉన్న ఒక భక్తుడు. ఒకసారి పరమాచార్య స్వామివారితో మాట్లాడుతుండగా మరొక వ్యక్తి గురించి నింద చేస్తూ సంభాషించే అవకాశం లభించింది. “ఆ వ్యక్తి పరమ కర్కోటకుడు!” అని అన్నాడు. ఒక నిముషం తరువాత స్వామివారు, “అతను మంచివాడు అని అంటున్నావా?” అని అడిగారు. స్వామివారి మాటలు ఆ భక్తునికి అర్థం కాలేదు. “అతణ్ణి నేను భయంకరమైన విషం కలిగిన కర్కోటకుడు అని అన్నాను. . .” “నీకు ప్రాతఃస్మరణ శ్లోకం తెలుసా?” అని అడిగారు స్వామివారు. కర్కోటకస్య నాగస్య దమయన్త్యా నలస్య చ, ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనమ్. “కర్కోటక నాగుడు, దమయంతి, నల, ఋతుపర్ణుడు - వీరిని తలచినంతనే పాపాలు పోతాయి. వారందరూ అంతటి పుణ్యవంతులు” అప్పటిదాకా దూషించిన ఆ భక్తుడు ఇప్పుడు సంకటంలో పడ్డాడు. అంటే ఇప్పటిదాకా అతని గురించి చెడుగా మాట్లాడాలి అనుకున్నప్పటికీ చెడుగా మాట్లాడలేదు అన్నమాట. “నువ్వే అతడు మంచివాడు అని చెబుతున్నావు. అవును కదా?” పరమాచార్య స్వామివారి దృష్టిలో అందరూ మంచివారే. అద్వైత ప్రతిష్టాపనాచార్యులైన శంకరులు అధిష్టించిన పీఠానికి పీఠాధిపతులు కదా మన స్వామివారు! --- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2 అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ పరమాచార్య వైభవం

ఆంజనేయ స్వామివారి తోక చెన్నైలోని నంగనల్లూర్ శ్రీ ఆరుళ్ మిగు ఆది వ్యాధి హర భక్త ఆంజనేయ దేవాలయం, ముప్పైరెండు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రసిద్ధి. నంగనల్లూర్ వాసులైన శ్రీ రమణి అన్న ఈ దేవాయలం కట్టాలని సంకల్పించారు. కంచి మఠానికి వెళ్లి పరమాచార్య స్వామివారి అనుమతి, ఆశీస్సులు పొందారు. చాలా వ్యప్రయాసలకోర్చి ఒక పెద్ద ఏకశిలను వెదికి పట్టుకుని, శిల్పి తన పనిని మొదలుపెట్టాడు. పని మొత్తం పూర్తయిన తరువాత ఒకరోజు ఉదయంవేళ ఆ బృహత్ ఆంజనేయ విగ్రహాన్ని నంగనల్లూర్ కి తెచ్చి దేవాలయం వద్ద ఉంచారు. ప్రతిష్ట పూర్వక అధివాసాలను (ధాన్యాధివాసం, జలాధివాసం. . .) సిద్ధం చేశారు. ఈలోగా రమణి అన్న కంచికి వెళ్లి ఆంజనేయ స్వామివారు నంగనల్లూరుకు విచ్చేశారు అనే విషయాన్ని తెలిపి, తరువాత జరుగవలసిన కార్యక్రమములను గురించి పరమాచార్య స్వామి వారిని అడగదలిచాడు. వినాయకుని వలె హనుమంతులవారు అంటే కూడా మహాస్వామివారికి ఎక్కువ మక్కువ. స్వామివారు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతి అణువు గురించి అడిగి తెలుసుకున్నారు. స్వామివారికి సంతృప్తి కలిగే విధంగా రమణి అన్న కూడా అన్నింటికీ సంపూర్ణ సమాచారం ఇచ్చారు. చివరగా ఆంజనేయ స్వామివారి తోక గురించి అడిగారు. “స్వామి వారి వాలము గుండ్రని ఆకృతితో తలపై నుండి పక్కలకు ఉంటుంది పెరియవ” అని స్వామివారి ప్రశంసల కోసం చూశాడు. స్వామివారి కాసేపు మౌనంగా ఉండిపోయారు. రమణి అన్న కాస్త దిగులు పడ్డాడు. చివరకు స్వామివారు “ఆంజనేయ స్వామివారి మూర్తి ఎదురుగా శ్రీరాముల వారిని కూడా ప్రతిష్ట చేయ్యదలచుకున్నామని చెప్పావు. కాని రాములవారి ముందు హనుమంతుడు ఎప్పుడూ అలా తోక ఎత్తుకుని నిలబడి ఉండడు” అని చెప్పారు. రమణి అన్న ఆందోళన ఎక్కువ కాసాగింది. “పెరియవ! ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? విగ్రహం మొత్తం తయారయ్యింది. అధివాసాలు కూడా మొదలుపెట్టాము. ప్రతిష్టాపన తేది, ముహూర్తం కూడా నిర్ణయం అయ్యింది. ఇప్పుడు ఆ తోకను మారిస్తే అధివాసాలు, కుంబాభిషేకం మరలా చెయ్యాలి. మరి నిర్ణయించిన ముహూర్తానికి ప్రతిష్ట చెయ్యడం కుదరదు కదా! మిరే నాకు ఒక దారి చూపించాలి” అని వేడుకున్నాడు. మహాస్వామివారు ప్రశాంతంగా ఉన్నారు. రమణి అన్నతో, “నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. అంతా సర్దుకుంటుంది. ఆంజనేయ స్వామివారే మనల్ని కాపాడుతారు” అని ప్రసాదం ఇచ్చి పంపారు. రమణి అన్న నంగనల్లూరుకు తిరిగొచ్చారు. ఆలోచనలన్నీ తోక చుట్టూనే తిరుగుతున్నాయి. అధివాసాలు ముగిసిన తరువాత, హోమములు, క్రతువులు పూర్తిచేసి, ముహూర్త సమయానికి పీఠంపై స్వామి విగ్రహాన్ని నిలబెట్టడానికి ఒక పెద్ద క్రేన్ తీసుకుని వచ్చారు. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆంజనేయ స్వామి వారి తోక సరైనచోట తెగి ఉండడం గమనించారు. ఎటువంటి మచ్చాలేకుండా ఎవరో శిల్పి చేసినట్టుగా అగుపిస్తోంది. రమణి అన్న మరియు ఇతర సంఘ సభ్యుల ఆనందం వర్ణించడానికి కుదురుతుందా? కళ్ళ నిరు వర్షిస్తుండగా అందరూ చేతులు పైకెత్తి కంచి వైపు తిరిగి నమస్కారం చేశారు. --- శ్రీ రమణి అన్న అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

శ్రీ కంచి పరమాచార్య వైభవం

ఆంజనేయ స్వామివారి తోక చెన్నైలోని నంగనల్లూర్ శ్రీ ఆరుళ్ మిగు ఆది వ్యాధి హర భక్త ఆంజనేయ దేవాలయం, ముప్పైరెండు అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రసిద్ధి. నంగనల్లూర్ వాసులైన శ్రీ రమణి అన్న ఈ దేవాయలం కట్టాలని సంకల్పించారు. కంచి మఠానికి వెళ్లి పరమాచార్య స్వామివారి అనుమతి, ఆశీస్సులు పొందారు. చాలా వ్యప్రయాసలకోర్చి ఒక పెద్ద ఏకశిలను వెదికి పట్టుకుని, శిల్పి తన పనిని మొదలుపెట్టాడు. పని మొత్తం పూర్తయిన తరువాత ఒకరోజు ఉదయంవేళ ఆ బృహత్ ఆంజనేయ విగ్రహాన్ని నంగనల్లూర్ కి తెచ్చి దేవాలయం వద్ద ఉంచారు. ప్రతిష్ట పూర్వక అధివాసాలను (ధాన్యాధివాసం, జలాధివాసం. . .) సిద్ధం చేశారు. ఈలోగా రమణి అన్న కంచికి వెళ్లి ఆంజనేయ స్వామివారు నంగనల్లూరుకు విచ్చేశారు అనే విషయాన్ని తెలిపి, తరువాత జరుగవలసిన కార్యక్రమములను గురించి పరమాచార్య స్వామి వారిని అడగదలిచాడు. వినాయకుని వలె హనుమంతులవారు అంటే కూడా మహాస్వామివారికి ఎక్కువ మక్కువ. స్వామివారు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతి అణువు గురించి అడిగి తెలుసుకున్నారు. స్వామివారికి సంతృప్తి కలిగే విధంగా రమణి అన్న కూడా అన్నింటికీ సంపూర్ణ సమాచారం ఇచ్చారు. చివరగా ఆంజనేయ స్వామివారి తోక గురించి అడిగారు. “స్వామి వారి వాలము గుండ్రని ఆకృతితో తలపై నుండి పక్కలకు ఉంటుంది పెరియవ” అని స్వామివారి ప్రశంసల కోసం చూశాడు. స్వామివారి కాసేపు మౌనంగా ఉండిపోయారు. రమణి అన్న కాస్త దిగులు పడ్డాడు. చివరకు స్వామివారు “ఆంజనేయ స్వామివారి మూర్తి ఎదురుగా శ్రీరాముల వారిని కూడా ప్రతిష్ట చేయ్యదలచుకున్నామని చెప్పావు. కాని రాములవారి ముందు హనుమంతుడు ఎప్పుడూ అలా తోక ఎత్తుకుని నిలబడి ఉండడు” అని చెప్పారు. రమణి అన్న ఆందోళన ఎక్కువ కాసాగింది. “పెరియవ! ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? విగ్రహం మొత్తం తయారయ్యింది. అధివాసాలు కూడా మొదలుపెట్టాము. ప్రతిష్టాపన తేది, ముహూర్తం కూడా నిర్ణయం అయ్యింది. ఇప్పుడు ఆ తోకను మారిస్తే అధివాసాలు, కుంబాభిషేకం మరలా చెయ్యాలి. మరి నిర్ణయించిన ముహూర్తానికి ప్రతిష్ట చెయ్యడం కుదరదు కదా! మిరే నాకు ఒక దారి చూపించాలి” అని వేడుకున్నాడు. మహాస్వామివారు ప్రశాంతంగా ఉన్నారు. రమణి అన్నతో, “నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి. అంతా సర్దుకుంటుంది. ఆంజనేయ స్వామివారే మనల్ని కాపాడుతారు” అని ప్రసాదం ఇచ్చి పంపారు. రమణి అన్న నంగనల్లూరుకు తిరిగొచ్చారు. ఆలోచనలన్నీ తోక చుట్టూనే తిరుగుతున్నాయి. అధివాసాలు ముగిసిన తరువాత, హోమములు, క్రతువులు పూర్తిచేసి, ముహూర్త సమయానికి పీఠంపై స్వామి విగ్రహాన్ని నిలబెట్టడానికి ఒక పెద్ద క్రేన్ తీసుకుని వచ్చారు. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆంజనేయ స్వామి వారి తోక సరైనచోట తెగి ఉండడం గమనించారు. ఎటువంటి మచ్చాలేకుండా ఎవరో శిల్పి చేసినట్టుగా అగుపిస్తోంది. రమణి అన్న మరియు ఇతర సంఘ సభ్యుల ఆనందం వర్ణించడానికి కుదురుతుందా? కళ్ళ నిరు వర్షిస్తుండగా అందరూ చేతులు పైకెత్తి కంచి వైపు తిరిగి నమస్కారం చేశారు. --- శ్రీ రమణి అన్న అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

జ్ఞానం

_*జ్ఞానం అంటే ఏమిటి ?*_ *జ్ఞానం అంటే చాల మందికి గుర్తుకువచ్చే అంశం బుద్దుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. దీనినే చాల మంది వేరే వారిని అవహేళనగా కూడ, తమాషాగా కూడ మాట్లాడుకుంటారు. అయితే జ్ఞానం అంటే ఏమిటి ? అసలు ఆ బుద్దునికి రావి చెట్టు కింద వచ్చిన జ్ఞానం ఏంటి ? మనం గ్రహించని ఆ జ్ఞానం ఏది ?* *సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏమిటంటే జ్ఞానం అనగానే చాల మంది వారి తెలివితేటలూ అని అనుకుంటారు. కాని తెలివితేటలూ జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి ?* *భగవద్గీతలో శ్రీ కృష్ణుడు మరియు ఉపనిషత్తులలో ఈ జ్ఞానం అనే పదం వచ్చింది. కనుక ఇప్పుడు మనం అక్కడ జ్ఞానం అంటే ఏమి చెప్పారో తెలుసుకుందాం ?* *మన సనాతన ధర్మం, వేదాలు, ఉపనిషత్తులలో, భగవద్గీతలో మరియు ఎందరో సద్గురువులు, జగద్గురువుల చేత చెప్పబడిన జ్ఞానం అయితే బ్రహ్మజ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవడం.* *జ్ఞానాన్ని దేని ద్వార తెలుసుకోవాలి అంటే ఒకటి గురువు బోధించడం వలన లేక వేద వేదాంగాలను క్షుణ్ణంగా గ్రహించి తెలుసుకోవడం వలన పొందేదే బ్రహ్మజ్ఞానం.* *అంటే ఎవరైతే గురువు బ్రహ్మవిద్యను తెలుపుతారో లేక వేద వేదాంగాల బ్రహ్మ విద్యను చదివి తెలుసుకుంటారో వారు తెలుసుకునేదే బ్రహ్మజ్ఞానం. అంతే కాని మనం ఇప్పుడు చదివిన Be Tech, MBA, MCA, MBBS మరియు PG చదువులు చదివి తెలుసుకున్నది కాదు. ఇది అంతయు విద్యే కావచ్చు కాని బ్రహ్మవిద్య కాదు.* *సరే బ్రహ్మ విద్యను తెలుసుకోవడం అంటే జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానం అంటే ఏమిటి ? నిజమైన జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. వివేకం అంటే తెలివితేటలు మరియు క్షుణ్ణంగా తెలుసుకోవడం. అంటే ఇక్కడ *ఏది ఆత్మ ? ఏది అనాత్మ ? అనాత్మ అయినది దేని నుండి పుడుతుంది ? వీటితో పాటు మరీ ముఖ్యంగా “నేను” ఎవరు ? “దేవుడు” ఎవరు ? ఈ శరీరము, మనస్సు, బుద్ధి మరియు ఈ కనిపించే ప్రకృతి ఎట్లా వచ్చింది ? ఎవరు సృష్టించారు ? నేను ఎందుకు పుట్టాను ?ఇలా ఈ విధంగా క్షుణ్ణంగా తెలుసుకోవడాన్నే జ్ఞానం అంటారు.* *జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే.* *భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు, దేవునికి రూపం అనడమే అజ్ఞానం.* *దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రకృతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు. అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.* *మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా ! అప్పుడు నీ పరిస్థితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం._* *నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా ! ఇవి ఏవియు నీవు కాదు. వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం.* *_ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరిస్తూ ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి._* *_శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాలు చూడండి._* *1.ఆత్మజ్ఞానమందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు ఇవికాక ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును._* *2. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములేత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను (నిరాకర రూపమైన పరమాత్మను) శరణమునొందుచున్నాడు._* *3.అర్జునా ! ఎవని అజ్ఞానము, జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలే ప్రకాశించి పరమార్ధతత్వము జూపును._* *4.ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టి వానిని పండితులని విద్వాంసులని పల్కుదురు._* *5.అనురాగము, భయము, క్రోధము వదిలి నాయందు (పరమాత్మా) మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యము పొందారు.* *6.పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది._శుభం జయం
Back

కంచి పరమాచార్య వైభవం

చిన్నపిల్లల దేవుడు అప్పటి రోజుల్లో చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్లో కూడా మన సంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడేది. సామాజిక జీవితాలను నాశనం చేసే ఇప్పటి పిల్లల ఆటలు వచ్చిచేరిన సమయం కాదది. మరి అలాంటి సమయంలో ఎన్నో దేవాలయాలతో, ఎన్నో ఆలయ ఉత్సవాలతో, నిరంతరం దేవతల ఊరెరిగింపులతో ఉండే కుంభకోణం పిల్లలకు ఆటవిడుపు ఏమిటి? వారికి ఆటలు ఏవి? నిజమైన స్వామి ఊరేరిగింపుల్లో ఉండే సందడి ఆటల్లో కూడా ఉండేది. ఒక బుట్ట నిండుగా బంకమట్టి తెచ్చి, నలుగురూ చేతులు వేసి కలిపి, స్వామిని సిద్ధం చేసేవారు. వెన్న కుండ, గరుడ వాహనం, అశ్వ వాహనం ఇలా మొత్తం సరంజామా సిద్ధం చేసేవారు. ఇక పూలకు కొదువ లేదు. కావేరీ తీరంలో ఎన్నో పూల చెట్లు వున్నాయి. ఇక మంత్రాలా, అందుకోసం వేదపాఠశాల నుండి శిక్షణ పొందాలా? శివాయ నమః, విష్ణువే నమః, సుబ్రహ్మణ్యాయ నమః, వినాయకాయ నమః. ఇలా ఒక స్వామివారిని ఊరేరిగింపుగా తీసుకునివచ్చారు, కుంభకోణంలోని శ్రీమఠం వీధిలోనికి. స్వామి వచ్చి శ్రీమఠం ముందు నిలబడ్డారు. ఎవ్వరూ ఊహించని సంఘటన. పరమాచార్య స్వామివారు బయటకు వచ్చారు. అది చిన్నపిల్లల ఆట అని తేలికగా తీసుకోలేదు స్వామివారు. ఆ చిన్నపిల్లల దేవునికి దండ నమస్కారం చేశారు; రెండు చేతులు జోడించి నమస్కరించారు. కొబ్బరికాయ, అరటిపళ్లతో నైవేద్యం చెయ్యమని మఠం వారికి చెప్పారు. పిల్లలకు ఆరతిపళ్లు, పటికబెల్లం పంచమని ఆదేశించారు. తరువాత చెయ్యెత్తి వారిని ఆశీర్వదించి, స్వామి ఉత్సవం ముందుకు వెళ్లడానికి అనుమతిచ్చారు. ఆ పిల్లలకు ఎంతటి సంతోషమో!!! ఆ చిన్నపిల్లల భక్తిని గౌరవించి, అది వారిలో ఇంకా పెరగడానికి స్వామివారు చేసిన పని ఎంతో అపూర్వమైనది. పరమాచార్య స్వామివారు రోజూ ఏకాగ్రతతో ఎంతోసేపు, విస్తారంగా పూజ చేస్తారన్న విషయం మనందరికీ తెలిసినదే. అలాగే, స్వామివారు ఇతరులు చేసే పూజను కూడా గౌరవిస్తారు. శ్రీమఠానికి వచ్చే భక్తులలో, రోజూ పంచాయతన పూజ చేసేవారు ఎందరో వున్నారు. స్వామివారు వెళ్ళి అ పూజలను చూసి, భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. స్వామివారు బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా వినాయకుని మందిరం కనబడితే - అది చిన్నదైనా, పాడుబడినదైనా లేదా ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించకపోయినా, ఆ గణపతులకి తప్పక కొబ్బరికాయ సమర్పించాల్సిందే. --- శ్రీమఠం బాలు, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

పరమాచార్య వైభవం

సర్వభూత గణామేయ సౌహార్దాయ శ్రీమఠంలో ప్రతిరోజూ సాయంత్రం, ఏనుగులకు బెల్లం కలిపిన అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలు బంతులుగా పెట్టడం అలవాటు. మావటి ఆ అన్నం ముద్దలను చేతిలోకి తీసుకుని, నేరుగా ఏనుగు నోట్లో పెట్టేవాడు. ఒకరోజు ఏనుగులకు అన్నం పెట్టే సమయంలో పరమాచార్య స్వామివారు మామూలుగా అటువైపు వచ్చారు. ముద్దలుగా చేసిన అన్నాన్ని చూశారు. దగ్గరలోనే ఉన్న సహాయకునితో, “ఈ అన్నం ముద్దలను ఏనుగుకు తినిపించవద్దు అని మావటికి చెప్పు” అని చెప్పి వెళ్ళిపోయారు. వెంటనే మేనేజరుని పిలిచారు స్వామివారు. “ఏనుగుకు పెట్టే అన్నాన్ని సరిగ్గా ఉడికించలేదు. పొడిగా, తరకలుగా విరిగిపోతోంది. ఇంత అశ్రద్ధతో, ఇలా దానికి ఆహారం పెట్టరాదు. అది మాటలురాని ఒక జంతువు, దానికి ఇలా సగం ఉడికిన అన్నం పెడతారా? మావటికి చెప్పు. ఈ ఏనుగుకు పెట్టే ఆహారం సాక్షాత్ గజముఖునికి పెట్టే నైవేద్యం లాగా ఉండాలి. అంత భక్తి ఉండాలి. అంత శ్రద్ధ ఉండాలి. మరలా అన్నం వండి, ఏనుగుకు పెట్టండి” అని చెప్పారు. మాటలురాని ఒక జంతువుపై స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని చూసి శిష్యులు కరిగిపోయారు. మహాస్వామి వారు ఆ అన్నం ముద్దల్ని చేతిలోకి తీసుకుని పరిశీలించలేదు. అంతెందుకు, అసలు ఒక్క క్షణం అక్కడ నిలబడి వాటివైపు కూడా చూడలేదు. మరి అది సరిగ్గా ఉడకలేదని, తరకలుగా అయిపోయిందని స్వామివారికి ఎలా తెలుసు? ఇంత చిన్న విషయాల్లో కూడా స్వామివారు తమ సర్వజ్ఞత్వాన్ని చూపేవారు. --- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

చిదంబరం - కుంచిత పాదం

మహావిద్యాపీఠం అష్టాంగం 28-12-2019 స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీవికారి నామ సంవత్సరే, దక్షిణాయనే ,హేమంతఋతౌ పుష్యమాసే , శుక్లపక్షే ద్వితీయాయాం స్థిరవాసరే ఉత్తరాషాఢ నక్షత్రే శ్రీ ఆదిగురో: పరశివస్యాజ్ఞయా ప్రవర్తమాన తాంత్రిక శాక్తమాన షట్త్రింశ తత్త్వాత్మక సకల ప్రపంచ సృష్టి స్థితి సంహార తిరోధానా నుగ్రహ కారణ్యా: శ్రీపరాశక్తే: ఊర్ధ్వ భూవిభ్రమే నంఘ్రాణ తత్వ మహాకల్పే దంచక్షు స్తత్వ కల్పే ధం త్వక్తత్వ మహాయుగే ఖం సదాశివ తత్వ యుగే ధం త్వక్త త్వ పరివృత్తే. ఛం అవిద్య తత్వేశ్వరానంద వర్షే ఇం ఈం మోహినీ ఋతౌ ఈం భేరుండ నిత్యామాసే. : ఆం భగమాలిని తిథినిత్యాయాం అం కామేశ్వరి దిననిత్యాయాం ఓం సర్వమంగళ కాలనిత్యాయాం, అం పరశివ తత్వేశ్వరానంద దివసే అం ప్రకాశానందనాథవాసరే కాల్యాఖ్య అకారోదయ ఘటికాయాం. శుభం -------------జయం మతిం ధర్మే గతిం శుభాం గావో విశ్వస్య మాతరః. గో సేవ చేయండి ప్రకృతిని రక్షించండి
Back

అన్న దాన మహత్యం

పరమాచార్య స్వామివారు చెప్పిన కథ ఇది. కర్ణుడు ఎంతో సంపదను దానంగా ఇచ్చినవాడు. వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం, డబ్బు, పాత్రలు - ఏదడిగితే అది అడిగినవారికి లేదనకుండా ఇచ్చాడు. కురుక్షేత్ర యుద్ధంలో ప్రాణాలు వదిలిన తరువాత, స్వర్గానికి చేరుకున్నాడు. తనకి చాలా ఆకలిగా ఉంది. చుట్టూ ఉన్న పాత్రల్లో వజ్రాలు, వైఢూర్యాలు మరియు బంగారం వున్నాయి. కానీ ఒక్క పిడికెడు వండిన అన్నం కానీ గుక్కెడు నీరు కానీ లేదు. “ఎందుకు ఇలా?” అని అక్కడున్నవారిని అడిగాడు. “నువ్వు దానశూరుడివి, అందులో సందేహం లేదు. ఎంతో బంగారం, వెండి దానం చేశావు. కానీ నువ్వు ఎప్పుడూ అన్నదానం చెయ్యలేదు. అక్కడ నువ్వు ఇచ్చినదే ఇక్కడ నీకు దొరుకుతుంది” అని చెప్పారు. కర్ణుడు దాన్ని అవమానంగా భావించాడు. ఈ ధర్మాసూక్ష్మం తను గ్రహించలేకపోయాడు. తరువాత తనకి ఆకలి ఎక్కువకాసాగింది. అక్కడున్నవారు అతనితో, “ఒకసారి కొందరు ఆకలితో నీవద్దకు వచ్చారు. నీ వేలు చూపించి, ధూర్యోధనుని ఇంటికి వెళ్ళమని చెప్పావు. ‘అన్నం అక్కడ దొరుకుతుంది’ అని చూపిన వెలును నోటిలో ఉంచుకుని చప్పరించు. నీ ఆకలి పోతుంది” అన్నారు. కర్ణుడు వారు చెప్పినట్టే చేశాడు. వెంటనే అతనికి షడ్రసోపేతమైన భోజనం చేసిన తృప్తి కలిగింది. ************************************* ఒక భక్తుడు స్వామివారితో తను చాలా విపరీతమైన కడుపునెప్పితో బాధపడుతున్నాను అని చెప్పాడు. ప్రతిరోజూ వైశ్వదేవం చేసి, ఆ అన్నాన్ని ఒక అతిథికి సమర్పించినా తరువాత తను తినాల్సిందిగా ఆజ్ఞాపించారు స్వామివారు. స్వామివారి ఆదేశాన్ని అనుసరించి ఆ బాధ నుండి నివారణ పొందాడు ఆ భక్తుడు. “నీకు కుదిరితే, ఏదైనా క్షేత్రంలో ఒక వంద మందికో లేదా వెయ్యిమందికో అన్నదానం చెయ్యి” అని ఆ భక్తునికి చెప్పారు. ఆ భక్తుడు గురువాయూర్ వెళ్ళి, అక్కడి గురువాయురప్పన్ దేవాలయంలో అన్నదానం చేశాడు. తిరువళ్ళువర్ చెబుతారు, “నోయ్ నాది, నోయ్ ముదల్ నాది, అథు థణిక్కుం వాయ్ నాది వాయ్ ప్పచ్చయల్” అని. “అనారోగ్యాన్ని నిర్ధారించి, మూలకారణాన్ని కనుక్కోవాలి. దానికి తగిన పరిహారం తెలుసుకుని, నైపుణ్యంతో అమలుపరచాలి”. అన్నిటికీ మూలకారణం పాపం. మన పరమాచార్య స్వామివారు మూలాన్ని కనుగొని పూర్తిగా దాన్ని నిర్మూలించే పరిహార చికిత్సా శిరోమణి. --- శ్రీమఠం బాలు, కాంచీపురం. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

ధర్మ సూక్ష్మములు

పరమాచార్య స్వామి వారితో ఒక భక్తుడు ఇలా అన్నాడు, “పెరుగన్నం ఎక్కువగా మిగిలిపోయింది. దాన్ని ఆవుకు పెట్టాను. అది ఎంతో తృప్తిగా ఆరగించింది”. వెంటనే స్వామివారు, “పెరుగన్నం కాని, పాలు కలిపిన అన్నం కాని ఆవుకు పెట్టరాదు. పెరుగు పాల నుండి వస్తుంది, పాలు ఆవు నుండి వస్తాయి.” ఆ భక్తుడు బాధపడుతూ, “నేను అపచారం చేశాను, నన్ను క్షమించండి పెరియవా” అని వేడుకున్నాడు. “సరే జరిగిపోయింది; ఇక ఎప్పుడూ అలా చెయ్యకు. ఇతర ప్రాణులకు పాలు, పెరుగు లేదా నెయ్యి కలిపిన అన్నం పెట్టవచ్చు. కాని గోవులకు మాత్రం పెట్టరాదు”. మనస్సులో నటుకునేలా ధర్మసూక్ష్మములను చెప్పడం కేవలం పరమాచార్య స్వామివారికి మాత్రమే సాధ్యం. ************************************************** పరమాచార్య స్వామివారు చిన్న కాంచీపురంలో ఉన్నప్పుడు, ప్రతిరోజూ తప్పక వరదరాజ స్వామి దేవాలయ ప్రదక్షిణ చేసేవారు. ఒకరోజు ఉదయం దేవాలయ ప్రదక్షిణ పూర్తైన తరువాత, చుట్టూ ఉన్న భక్తులు విష్ణు సహస్రం పఠిస్తుండగా మహాస్వామి వారు ఒక వీధిలో నడిచి వెళ్తున్నారు. ఒక ఇంటి ముందర చిన్న అమ్మాయి ముగ్గు వేస్తూ ఉంది. పరమాచార్య స్వామివారు ఆగారు. “నువ్వు ముగ్గు చాలా బాగా వేశావు. భేష్! కాని ముగ్గును కేవలం బియ్యపు పిండితో మాత్రమే వెయ్యాలి. అప్పుడే ఈగలు, చీమలు, పక్షులు ఆ పిండిని తింటాయి; ముగ్గు వేసిన నీవైపు సంతోషంతో చూస్తాయి. ముగ్గు పిండితో ముగ్గు వెయ్యడం వల్ల ఏ జీవికి ఉపయోగం లేదు, తెలిసిందా?” అని అన్నారు. ఆ అమ్మాయి సరే అన్నట్టు తలాడించి, స్వామివారికి పంచాంగ సంస్కారం చేసింది. పరమాచార్య స్వామివారి ఈ ఆదేశం కేవలం ఆ అమ్మాయికి మాత్రమేనా లేక అందరు ఆడ పిల్లలకా? ఈ విషయం తల్లులు కాస్త గమనించాలి. --- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2 అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్ శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।। #KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
Back

వ్యాస స్మృతి

సంధ్యావందన, జప, తప, అనుష్ఠాదులు చేసేప్పుడు భగవత్కృప శిఖద్వారా మనలో చేరుతుంది. వ్యాస స్మృతి:- వేద వ్యాసుడు సైతం తన వ్యాసస్మృతిలో ఇలా చెప్పాడు. వినా యచ్చిఖయా కర్మ వినా వినా యజ్ఞోపవీతకమ్ రాక్షసమ్ తద్ధి విజ్ఞేయమ్ సమస్యా నిష్ఘలా క్రియాః శిఖ లేకుండా ఏ సత్క్రియ చేసినప్పటికి, అది రాక్షస క్రియగానే పరిణమిస్తుందంటూ వేదవ్యాసుడు సైతం వ్యాసస్మృతిలో చెప్పాడు. మనుస్మృతి:- వేధిక ధర్మం ప్రకారం శిఖ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో మనుస్మృతి వివరించింది. స్నానే దానే జపే హోమే సన్ధ్యాయామ్ దేవతార్చనే శిఖాగ్రన్ధిమ్ సదా కుర్యా దిత్యేతతన్మను రబ్రవీత్ స్నాన దాన జప హోమాలు చేసేటప్పుడూ, దేవ, పితృ కర్మలు చేసేటప్పుడూ జుట్టు ముడి వేసి తీరాలని ధర్మశాస్త్రాలు, మనుస్మృతి చెబుతున్నాయి. కాత్యాయన స్మృతి(1/4):- సదోపవీతినా భాష్యమ్ సదా బద్ధ శిఖేన చ విశిఖో వ్యుపవీతశ్చ యత్కరోతి న తత్కృతమ్ శిఖ లేకుండా యజ్ఞం చేసినా, దానం చేసినా, మరి ఏ ధార్మిక కార్యాలు ఒనరించినా అవన్నీ నిష్ఫలము. శరీరంలో అన్ని అవయాలకన్నా శిరస్సు ప్రధానమైనది. శిరస్సులోనే మన మెదడు, అందులోనే మన శరీరాన్ని, ఆలోచనలనూ భావోద్వేగాలను నియంత్రించే పిట్యూటరీ గ్రంధి సైతం ఉంటాయి. శిఖముడి వేసుకున్న జుట్టు మూలాలు మన ఆలోచనలను నియంత్రిస్తాయి. శిఖ పెట్టుకునే శిరస్సు వెనక భాగం జ్ఞానానికి, ఆలోచనలకు స్థానం.
Back

వ్యాస స్మృతి

సంధ్యావందన, జప, తప, అనుష్ఠాదులు చేసేప్పుడు భగవత్కృప శిఖద్వారా మనలో చేరుతుంది. వ్యాస స్మృతి:- వేద వ్యాసుడు సైతం తన వ్యాసస్మృతిలో ఇలా చెప్పాడు. వినా యచ్చిఖయా కర్మ వినా వినా యజ్ఞోపవీతకమ్ రాక్షసమ్ తద్ధి విజ్ఞేయమ్ సమస్యా నిష్ఘలా క్రియాః శిఖ లేకుండా ఏ సత్క్రియ చేసినప్పటికి, అది రాక్షస క్రియగానే పరిణమిస్తుందంటూ వేదవ్యాసుడు సైతం వ్యాసస్మృతిలో చెప్పాడు. మనుస్మృతి:- వేధిక ధర్మం ప్రకారం శిఖ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో మనుస్మృతి వివరించింది. స్నానే దానే జపే హోమే సన్ధ్యాయామ్ దేవతార్చనే శిఖాగ్రన్ధిమ్ సదా కుర్యా దిత్యేతతన్మను రబ్రవీత్ స్నాన దాన జప హోమాలు చేసేటప్పుడూ, దేవ, పితృ కర్మలు చేసేటప్పుడూ జుట్టు ముడి వేసి తీరాలని ధర్మశాస్త్రాలు, మనుస్మృతి చెబుతున్నాయి. కాత్యాయన స్మృతి(1/4):- సదోపవీతినా భాష్యమ్ సదా బద్ధ శిఖేన చ విశిఖో వ్యుపవీతశ్చ యత్కరోతి న తత్కృతమ్ శిఖ లేకుండా యజ్ఞం చేసినా, దానం చేసినా, మరి ఏ ధార్మిక కార్యాలు ఒనరించినా అవన్నీ నిష్ఫలము. శరీరంలో అన్ని అవయాలకన్నా శిరస్సు ప్రధానమైనది. శిరస్సులోనే మన మెదడు, అందులోనే మన శరీరాన్ని, ఆలోచనలనూ భావోద్వేగాలను నియంత్రించే పిట్యూటరీ గ్రంధి సైతం ఉంటాయి. శిఖముడి వేసుకున్న జుట్టు మూలాలు మన ఆలోచనలను నియంత్రిస్తాయి. శిఖ పెట్టుకునే శిరస్సు వెనక భాగం జ్ఞానానికి, ఆలోచనలకు స్థానం.
Back

సూర్య గ్రహణం సమయంలో చదవాలిసిన నవగ్రహ స్తోత్రం

గ్రహణం సమయంలో చదవాలిసిన నవగ్రహ సోత్రం🙏🙏🙏🙏 గ్రహాణామాదిరాదిత్యో లోకరక్షణకారకః । విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే రవిః ॥ ౧॥ రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః । విషమస్థాన సంభూతాం పీడాం హరతు మే విధుః ॥ ౨॥ భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్ సదా । వృష్టికృద్వృష్టిహర్తా చ పీడాం హరతు మే కుజః ॥ ౩॥ ఉత్పాతరూపో జగతాం చన్ద్రపుత్రో మహాద్యుతిః । సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతు మే బుధః ॥ ౪॥ దేవమన్త్రీ విశాలాక్షః సదా లోకహితే రతః । అనేకశిష్యసమ్పూర్ణః పీడాం హరతు మే గురుః ॥ ౫॥ దైత్యమన్త్రీ గురుస్తేషాం ప్రాణదశ్చ మహామతిః । ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే భృగుః ॥ ౬॥ సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః । మన్దచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ॥ ౭॥ మహాశిరా మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః । అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖీ ॥ ౮॥ అనేకరూపవర్ణైశ్చ శతశోఽథ సహస్రశః । ఉత్పాతరూపో జగతాం పీడాం హరతు మే తమః ॥ ౯॥ ॥ ఇతి బ్రహ్మాణ్డపురాణోక్తం నవగ్రహపీడాహరస్తోత్రం సమ్పూర్ణమ్ ॥
Back

చిదంబరం - కుంచిత పాదం

పరమాచార్య స్వామివారు సిద్ధి పొందే సంవత్సరం ముందు వారి తొంబైల చివర్లలో జరిగిన సంఘటన ఇది. మహాస్వామి వారు అక్కడ ఉన్న శిష్యులతో చిదంబరంలో ఉన్న శ్రీనటరాజ స్వామి గుడికి వెళ్ళాలని, స్వామి దర్శనం చేసుకోకావలని ఉందని చెప్పేవారు. చిదంబరం అలయముకు సంబధించిన వివిధ మొక్కల వేర్లతో చేయబడిన ఒక చిన్న మాల వంటి "కుంచితపాదం" గురించి చెప్పేవారు (ఇక్కడున్న చిత్రంలో స్వామివారు తలమీద దరించి ఉన్నది చూడవచ్చును). చిదంబరం వెళ్ళిన వాళ్ళకు దీనిగురించి బాగా తెలిసిఉంటుంది. ‘కుంచితపాదము’ను దర్శిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగములు అన్ని నయం అవుతాయని, మోక్షం ప్రసాదింబడుతుందని అందరి విశ్వాసము. స్వామివారి మాటలు విన్న శిష్యులు విచారంతో కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు అక్కడికి పోవుట దాదాపుగా అసాధ్యము. అంతదూరం స్వామిని తీసుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు. ఆశ్చర్యకరంగా స్వామివారు ఆ మాటలన్న మరుసటి రోజు ఉదయమున చిదంబరం దేవస్థానం నుండి కొందరు దీక్షితర్లు వచ్చారు. థిల్లై నటరాజ స్వామివారి ప్రసాదమును, ‘కుంచితపాదము’ను తీసుకొని శ్రీ మఠానికి వచ్చారు. మహాస్వామి వారిని దర్శించాలని, చిదంబరం నుండి తీసుకు వచ్చిన ప్రసాదములను శ్రీ వారికి ఇవ్వాలని శిష్యులకు తెలియచేసారు. ఆ మాటలు విని శిష్యులు చాలా సంతోషించారు. వెంటనే స్వామి దగ్గరకు వెళ్లి చిదంబరం ఆలయ దీక్షితర్లు తమ దర్శననికి ఎదురుచూస్తున్నారు అని తెలియజేసారు. వెంటనే స్వామి వారి అనుమతితో ప్రసాదములు తీసుకువచ్చారు. మహాస్వామి వారు వెంటనే ‘కుంచితపాదము’ను తీసుకుని తమ తల పైన పెట్టుకున్నారు. నటరాజ స్వామిని స్తుతిస్తూ వారిని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇది. ఈ చిత్రపటం చూసినంత మాత్రం చేత అన్ని రోగములు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇందులో పరమౌషధమైన ‘కుంచితపాదము’, ఆది వైద్యుడైన సాక్షాత్ ధన్వంతరి స్వారుపము ‘పరమాచార్య స్వామి’ వారు ఉన్నారు. స్వామి వారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యాలతో ప్రశాంతముగా జీవించుగాక!!!
Back

చిదంబరం - కుంచిత పాదం

పరమాచార్య స్వామివారు సిద్ధి పొందే సంవత్సరం ముందు వారి తొంబైల చివర్లలో జరిగిన సంఘటన ఇది. మహాస్వామి వారు అక్కడ ఉన్న శిష్యులతో చిదంబరంలో ఉన్న శ్రీనటరాజ స్వామి గుడికి వెళ్ళాలని, స్వామి దర్శనం చేసుకోకావలని ఉందని చెప్పేవారు. చిదంబరం అలయముకు సంబధించిన వివిధ మొక్కల వేర్లతో చేయబడిన ఒక చిన్న మాల వంటి "కుంచితపాదం" గురించి చెప్పేవారు (ఇక్కడున్న చిత్రంలో స్వామివారు తలమీద దరించి ఉన్నది చూడవచ్చును). చిదంబరం వెళ్ళిన వాళ్ళకు దీనిగురించి బాగా తెలిసిఉంటుంది. ‘కుంచితపాదము’ను దర్శిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగములు అన్ని నయం అవుతాయని, మోక్షం ప్రసాదింబడుతుందని అందరి విశ్వాసము. స్వామివారి మాటలు విన్న శిష్యులు విచారంతో కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు అక్కడికి పోవుట దాదాపుగా అసాధ్యము. అంతదూరం స్వామిని తీసుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు. ఆశ్చర్యకరంగా స్వామివారు ఆ మాటలన్న మరుసటి రోజు ఉదయమున చిదంబరం దేవస్థానం నుండి కొందరు దీక్షితర్లు వచ్చారు. థిల్లై నటరాజ స్వామివారి ప్రసాదమును, ‘కుంచితపాదము’ను తీసుకొని శ్రీ మఠానికి వచ్చారు. మహాస్వామి వారిని దర్శించాలని, చిదంబరం నుండి తీసుకు వచ్చిన ప్రసాదములను శ్రీ వారికి ఇవ్వాలని శిష్యులకు తెలియచేసారు. ఆ మాటలు విని శిష్యులు చాలా సంతోషించారు. వెంటనే స్వామి దగ్గరకు వెళ్లి చిదంబరం ఆలయ దీక్షితర్లు తమ దర్శననికి ఎదురుచూస్తున్నారు అని తెలియజేసారు. వెంటనే స్వామి వారి అనుమతితో ప్రసాదములు తీసుకువచ్చారు. మహాస్వామి వారు వెంటనే ‘కుంచితపాదము’ను తీసుకుని తమ తల పైన పెట్టుకున్నారు. నటరాజ స్వామిని స్తుతిస్తూ వారిని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇది. ఈ చిత్రపటం చూసినంత మాత్రం చేత అన్ని రోగములు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇందులో పరమౌషధమైన ‘కుంచితపాదము’, ఆది వైద్యుడైన సాక్షాత్ ధన్వంతరి స్వారుపము ‘పరమాచార్య స్వామి’ వారు ఉన్నారు. స్వామి వారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యాలతో ప్రశాంతముగా జీవించుగాక!!!
Back

చిదంబరం - కుంచిత పాదం

పరమాచార్య స్వామివారు సిద్ధి పొందే సంవత్సరం ముందు వారి తొంబైల చివర్లలో జరిగిన సంఘటన ఇది. మహాస్వామి వారు అక్కడ ఉన్న శిష్యులతో చిదంబరంలో ఉన్న శ్రీనటరాజ స్వామి గుడికి వెళ్ళాలని, స్వామి దర్శనం చేసుకోకావలని ఉందని చెప్పేవారు. చిదంబరం అలయముకు సంబధించిన వివిధ మొక్కల వేర్లతో చేయబడిన ఒక చిన్న మాల వంటి "కుంచితపాదం" గురించి చెప్పేవారు (ఇక్కడున్న చిత్రంలో స్వామివారు తలమీద దరించి ఉన్నది చూడవచ్చును). చిదంబరం వెళ్ళిన వాళ్ళకు దీనిగురించి బాగా తెలిసిఉంటుంది. ‘కుంచితపాదము’ను దర్శిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగములు అన్ని నయం అవుతాయని, మోక్షం ప్రసాదింబడుతుందని అందరి విశ్వాసము. స్వామివారి మాటలు విన్న శిష్యులు విచారంతో కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు అక్కడికి పోవుట దాదాపుగా అసాధ్యము. అంతదూరం స్వామిని తీసుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు. ఆశ్చర్యకరంగా స్వామివారు ఆ మాటలన్న మరుసటి రోజు ఉదయమున చిదంబరం దేవస్థానం నుండి కొందరు దీక్షితర్లు వచ్చారు. థిల్లై నటరాజ స్వామివారి ప్రసాదమును, ‘కుంచితపాదము’ను తీసుకొని శ్రీ మఠానికి వచ్చారు. మహాస్వామి వారిని దర్శించాలని, చిదంబరం నుండి తీసుకు వచ్చిన ప్రసాదములను శ్రీ వారికి ఇవ్వాలని శిష్యులకు తెలియచేసారు. ఆ మాటలు విని శిష్యులు చాలా సంతోషించారు. వెంటనే స్వామి దగ్గరకు వెళ్లి చిదంబరం ఆలయ దీక్షితర్లు తమ దర్శననికి ఎదురుచూస్తున్నారు అని తెలియజేసారు. వెంటనే స్వామి వారి అనుమతితో ప్రసాదములు తీసుకువచ్చారు. మహాస్వామి వారు వెంటనే ‘కుంచితపాదము’ను తీసుకుని తమ తల పైన పెట్టుకున్నారు. నటరాజ స్వామిని స్తుతిస్తూ వారిని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇది. ఈ చిత్రపటం చూసినంత మాత్రం చేత అన్ని రోగములు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇందులో పరమౌషధమైన ‘కుంచితపాదము’, ఆది వైద్యుడైన సాక్షాత్ ధన్వంతరి స్వారుపము ‘పరమాచార్య స్వామి’ వారు ఉన్నారు. స్వామి వారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యాలతో ప్రశాంతముగా జీవించుగాక!!!
Back

చిదంబరం - కుంచిత పాదం

పరమాచార్య స్వామివారు సిద్ధి పొందే సంవత్సరం ముందు వారి తొంబైల చివర్లలో జరిగిన సంఘటన ఇది. మహాస్వామి వారు అక్కడ ఉన్న శిష్యులతో చిదంబరంలో ఉన్న శ్రీనటరాజ స్వామి గుడికి వెళ్ళాలని, స్వామి దర్శనం చేసుకోకావలని ఉందని చెప్పేవారు. చిదంబరం అలయముకు సంబధించిన వివిధ మొక్కల వేర్లతో చేయబడిన ఒక చిన్న మాల వంటి "కుంచితపాదం" గురించి చెప్పేవారు (ఇక్కడున్న చిత్రంలో స్వామివారు తలమీద దరించి ఉన్నది చూడవచ్చును). చిదంబరం వెళ్ళిన వాళ్ళకు దీనిగురించి బాగా తెలిసిఉంటుంది. ‘కుంచితపాదము’ను దర్శిస్తే ఆ వ్యక్తికి ఉన్న రోగములు అన్ని నయం అవుతాయని, మోక్షం ప్రసాదింబడుతుందని అందరి విశ్వాసము. స్వామివారి మాటలు విన్న శిష్యులు విచారంతో కొంత ఆందోళన చెందారు. ఎందుకంటే ప్రస్తుతం స్వామివారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు అక్కడికి పోవుట దాదాపుగా అసాధ్యము. అంతదూరం స్వామిని తీసుకొని వెళ్ళడం కూడా మంచిది కాదు. ఆశ్చర్యకరంగా స్వామివారు ఆ మాటలన్న మరుసటి రోజు ఉదయమున చిదంబరం దేవస్థానం నుండి కొందరు దీక్షితర్లు వచ్చారు. థిల్లై నటరాజ స్వామివారి ప్రసాదమును, ‘కుంచితపాదము’ను తీసుకొని శ్రీ మఠానికి వచ్చారు. మహాస్వామి వారిని దర్శించాలని, చిదంబరం నుండి తీసుకు వచ్చిన ప్రసాదములను శ్రీ వారికి ఇవ్వాలని శిష్యులకు తెలియచేసారు. ఆ మాటలు విని శిష్యులు చాలా సంతోషించారు. వెంటనే స్వామి దగ్గరకు వెళ్లి చిదంబరం ఆలయ దీక్షితర్లు తమ దర్శననికి ఎదురుచూస్తున్నారు అని తెలియజేసారు. వెంటనే స్వామి వారి అనుమతితో ప్రసాదములు తీసుకువచ్చారు. మహాస్వామి వారు వెంటనే ‘కుంచితపాదము’ను తీసుకుని తమ తల పైన పెట్టుకున్నారు. నటరాజ స్వామిని స్తుతిస్తూ వారిని ఆశీర్వదించి పంపించారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇది. ఈ చిత్రపటం చూసినంత మాత్రం చేత అన్ని రోగములు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఇందులో పరమౌషధమైన ‘కుంచితపాదము’, ఆది వైద్యుడైన సాక్షాత్ ధన్వంతరి స్వారుపము ‘పరమాచార్య స్వామి’ వారు ఉన్నారు. స్వామి వారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యాలతో ప్రశాంతముగా జీవించుగాక!!!
Back
శ్రీ మహా విద్య పీఠం